Hair Masks : ఈ సహజమైన మాస్క్​లు.. మీ హెయిర్​ని ఆరోగ్యంగా.. సిల్కీగా చేస్తాయి..-five easy diy natural hair mask recipes for healthy and growth hair ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Masks : ఈ సహజమైన మాస్క్​లు.. మీ హెయిర్​ని ఆరోగ్యంగా.. సిల్కీగా చేస్తాయి..

Hair Masks : ఈ సహజమైన మాస్క్​లు.. మీ హెయిర్​ని ఆరోగ్యంగా.. సిల్కీగా చేస్తాయి..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 17, 2022 04:54 PM IST

హెయిర్ అనేది ప్రతి ఒక్కరికి ఓ ఎమోషన్ అని చెప్పవచ్చు. చాలామంది జుట్టుకి చాలా కేర్ తీసుకుంటారు. అయితే హెయిర్ ఫాల్ అవుతున్నవాళ్లు ఇప్పుడు కేర్ తీసుకున్న మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. దీనికోసం సులభమైన, సహజమైన మాస్క్​లను సిఫారసు చేస్తున్నారు.

<p>సహజమైన హెయిర్ మాస్క్​లు</p>
సహజమైన హెయిర్ మాస్క్​లు

Hair Masks for Damage Hair : మీ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం, దానిని వేగంగా పెరిగేలా చేయడం కోసం ఖచ్చితంగా మీరు మీ హెయిర్ మాస్క్​లను ప్రయత్నించండి. ఎక్కువ ఖర్చుపెట్టి.. జుట్టును రసాయానాలతో నింపేసే బదులు.. హాయిగా ఇంట్లో దొరికే వస్తువులతో మంచి ప్యాక్స్ వేసుకుని హెయిర్​ని కాపాడుకోండి. మరి హెయిర్ గ్రోత్​కి ఉపయోగపడే ప్యాక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని ఎలా తయారు చేసుకోవాలో.. ఎంత సేపు ఉంచుకోవాలో చూద్దాం.

1. ఆముదం, తేనె మాస్క్

జుట్టు పెరుగుదలకు ఆముదం వల్ల కలిగే ప్రయోజనాలు మనకు తెలిసిందే. ఈ నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. దీని యాంటీమైక్రోబయల్ లక్షణాల వల్ల నెత్తిమీద పొడిబారడం, పొట్టును కూడా తగ్గిస్తుంది. తేనె కూడా జుట్టుకు సహజసిద్ధంగా తేమనిస్తుంది. అందమైన మెరుపును ఇస్తుంది. మీరు రెండు చెంచాల ఆముదం నూనెలో ఒక చెంచా తేనెను జోడించవచ్చు. ఈ మిశ్రమాన్ని వేడి చేయవచ్చు. మాస్క్‌ను తలకు పట్టించి.. చేతివేళ్లతో సున్నితంగా మసాజ్ చేయండి. 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు ఉంచి.. గోరువెచ్చని నీటితో కడిగేయండి.

2. అవోకాడో, బనానా మాస్క్

ఈ డీప్ కండిషనింగ్ హెయిర్ మాస్క్ డ్రై డ్యామేజ్డ్ హెయిర్ కోసం. ఇది చిట్లు రాకుండా నిరోధిస్తుంది. జుట్టు పెరుగుదలను పెంచుతుంది. అవోకాడో, అరటిపండ్లు రెండింటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టుకు అవసరమైన పోషక పదార్ధాలను తిరిగి పొందేలా చేస్తుంది. అరటిపండుతో సగం అవకాడోను మెత్తగా పేస్ట్ అయ్యేవరకు గ్రైండ్ చేయాలి. మిశ్రమాన్ని మూలాల నుంచి చివరల వరకు అప్లై చేయండి. కనీసం 15 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. ఆరోగ్యకరమైన జుట్టు కోసం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

3. మందార మాస్క్

మందార పువ్వులు, ఆకులు రెండూ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. జుట్టు వేగంగా, పొడవుగా, మందంగా పెరగడానికి సహాయపడుతుంది. కొన్ని పువ్వులు, ఆకులను తీసుకొని నీటిలో ఉడకబెట్టండి. రసాన్ని తీసుకొని మీ జుట్టుకు అప్లై చేసి కనీసం 15 నిమిషాల పాటు కూర్చోండి. చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. మీ జుట్టు ఆరోగ్యంగా కనిపించడంతో పాటు మంచి సిల్కి, స్మెల్ హెయిర్ మీకు వస్తుంది.

4. వెల్లుల్లి, ఉల్లిపాయ మాస్క్

వెల్లుల్లి, ఉల్లి యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ రెండు పదార్ధాలు ఫ్లాకీనెస్, చుండ్రుని తగ్గించడంలో మీకు సహాయపడతాయి. ఈ రెండు పదార్థాలను ఒక గిన్నెలో వేసి.. మీ రెగ్యులర్ హెయిర్ ఆయిల్‌ను మిశ్రమానికి జోడించండి. మందపాటి పేస్ట్‌ను మీ జుట్టుకు అప్లై చేసి 30-45 నిమిషాలు అలాగే ఉంచండి. బలమైన వాసన కలిగిన ఈ పదార్థాల వాసనను క్లియర్ చేయడానికి షాంపూతో కడగాలి.

5. మెంతి గింజలు, మొరింగ మాస్క్

మొరింగ ఆకుల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బలహీనమైన, పెళుసుగా ఉండే జుట్టు.. ఆరోగ్యంగా పెరగడానికి ఇది సహాయపడుతుంది. మెంతి గింజలు జుట్టు పెరుగుదలకు అనువైనవి. ఎందుకంటే అవి జుట్టు కుదుళ్లు వేగంగా పెరిగేలా చేస్తాయి. మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. కొన్ని మొరింగ ఆకులను తీసుకుని వాటిని మెంతి నీరు, గింజలతో మెత్తగా పేస్ట్ చేయాలి. దీనిని తల మొదలు నుంచి చివర వరకు అప్లై చేయండి. 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు దీనిని అలాగే ఉంచండి. గోరువెచ్చని నీటితో బాగా కడిగేయండి.

వీటిని ప్రయత్నించే ముందు మీ డైర్మాటలజిస్ట్ ని సంప్రదించండి. వారి సూచనలమేరకు వీటిని ప్రయత్నించండి.

Whats_app_banner

సంబంధిత కథనం