నోరు తెరిచిన కంచంలోని చేప.. నోరెళ్లబెట్టిన నెటిజన్స్!
అనగనగా ఒక చేప ఉంది. చేపా.. చేపా నిన్ను లంచ్‌లో లాగించేస్తాను అని ఆ వ్యక్తి సిద్ధపడగా.. అంతలోనే ఆ చేప ఒక కప్పలాగా నోరు తెరిచింది. దీంతో షాక్ అవడం ఆ వ్యక్తి వంతైంది. వీడియో చూడండి..
చేపల కూర అంటే చాలా మందికి ఇష్టమే. అలాగని పచ్చి చేపను తినమంటే ఎవరూ తినలేరు. ఇక ఇది వదిలేసి నేరుగా నేరుగా బ్రతికున్న చేపను తినమంటే? ఎవరో కరుడుగట్టిన మాంసాహారి అయితే తప్ప తినలేరు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే విచిత్రమైన ఒక వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది.
ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి రెస్టారెంట్లో చేపతో చేసిన వంటకం ఒకటి ఆర్డర్ ఇచ్చాడు. కొద్దిసేపటికి అతడి ఇచ్చిన ఆర్డర్ అతడి ముందుకు వచ్చింది. ఇక తినడానికి ఉపయోగించే చాప్ స్టాక్‌తో ఆ చేపను తినేందుకు సిద్దపడగా ఆ చేప బావురుమంటూ అంతలా నోరు తెరిచింది. రివర్స్ లో ఆ చాప్ స్టిక్‌నే ఆ చేప తన నోట కరిచింది. దాని పళ్లు కూడా పదునుగా ఉన్నాయి. ఆ పళ్లతో గట్టిగా ఆ పుల్లను లాగుతుంది. జపాన్ లోని ఒక రెస్టారెంట్ వారు ఇలా బ్రతికున్న ఫిష్ వడ్డించినట్లు తెలుస్తోంది.
ఏదేమైనా, ఇప్పుడు ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరి ఆ వీడియోని ఇక్కడ మీరూ చూసేయండి.
ఈ వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చేప చచ్చినా.. దాని ఆకలి చావలేదు అంటూ కొందరు, ఆకలికి చావు లేదు అని కొందరు అంటూ కమెంట్స్ చేస్తున్నారు. మరీ మీరేం కమెంట్ చేస్తారు? మీకు ఇలాంటి అనుభవం ఎదురైతే ఏం చేస్తారు?
ఏదైనా పంచుకోవడానికి సోషల్ మీడియా ఉందిగా. మీరు ఈ కంటెంట్ ను అందరితో పంచుకొని ఫన్నీ ఫన్నీ కమెంట్స్ అందుకోండి.
సంబంధిత కథనం