Eye Flu Symptoms : మీ కళ్లు ఎర్రగా ఉన్నాయా? ఐ ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా?
Conjunctivitis Eye Flu Precautions : భారతదేశంలో ఐ ఫ్లూ పెరుగుతోంది. ముఖ్యంగా స్కూల్ పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి. చాలా రాష్ట్రాల్లో ఐ ఫ్లూ కారణంగా రోగులు ఆసుపత్రికి వెళ్తున్నారు.

ఈ మధ్యకాలంలో కంటి ఫ్లూ(Eye Flu) సమస్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసులు చాలా నమోదవుతున్నాయి. చాలా మంది రోగులు కంటి వాపుతో ఇబ్బంది పడుతున్నారు. కళ్లు ఎర్రగా మారుతున్నాయి. దీనిని వైద్య భాషలో కంజుంక్టివిటిస్(Conjunctivitis) అంటారు. ఐ ఫ్లూ వచ్చినప్పుడు కళ్లు ఎర్రగా, వాపుగా ఉంటాయి. ఐ ఫ్లూ కారణంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సమస్య ఎక్కువైంది. అయితే ఐ ఫ్లూ వస్తే.. అంత ఈజీగా తీసుకోవద్దు. కావాల్సిన చికిత్స తీసుకోవాలి.
కంటి ఫ్లూకి కారణమేమిటి
వైరస్, బాక్టీరియా, అలెర్జీ, రసాయనాలు, కాంటాక్ట్ లెన్స్, వాయు కాలుష్యం, శిలీంధ్రాలు
కంటి ఫ్లూ లక్షణాలు ఏమిటి?
ఎరుపు లేదా గులాబీ కళ్లు, కళ్లలో వాపు, నీరు కారడం, కళ్లలో దురద, మంట లేదా చికాకు, కళ్ళ నుండి తెల్లటి పొర రావడం, కాంటాక్ట్ లెన్స్‌లు ధరించడంలో ఇబ్బంది
కంటి ఫ్లూ వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపించగలదా?
ఐ ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
పాఠశాలకు వెళ్లే పిల్లల విషయంలో గుంపులు గుంపులుగా ఆడుకుంటూ ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తుంది.
పిల్లలకు దీని గురించి అవగాహన కల్పించడం కష్టం, వినరు, దీనివల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి చాలా త్వరగా వ్యాపిస్తుంది.
పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి(Immunity) చాలా తక్కువగా ఉంటుంది, దీని వల్ల ఒకరి నుంచి మరొకరికి ఈజీగా వెళ్తుంది.
కంటి ఫ్లూ చికిత్స ఎలా?
ఐ ఫ్లూ వచ్చిన వారు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు సోకకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కంటిలో దురద అనిపిస్తే.. చేతులు కంటి దగ్గరకు వెళ్లనివ్వద్దు. ఇతురుల కళ్లలోకి ఎక్కువ సేపు చూడకండి. స్క్రీన్ ను కూడా చూడటం తగ్గిస్తే ఇంకా మంచిది. బయటకు వెళ్లినా.., ఇంట్లో ఉన్నా.. గ్లాసెస్ పెట్టుకుంటే.. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. చిన్నపిల్లలు ఐ ఫ్లూ విషయంలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. వారికి త్వరగా వ్యాపిస్తుంది.
ఈ సమస్య ఉన్నవారు.. డాక్టర్ వద్దకు వెళ్లాలి. మీకు కంటి చుక్క లేదా యాంటీబయాటిక్, లూబ్రికెంట్ ఇవ్వవచ్చు. కంటి ఫ్లూ ఉన్నవారు తరచుగా కళ్లను తాకకూడదు. తరచుగా చేతులు కడుక్కోకూడదు. అలాగే కంటి ఫ్లూ ఉన్నవారు కోలుకున్న తర్వాత ఇంట్లోనే ఉండాలి. ఇక పూర్తిగా తగ్గిపోయిందనుకుంటేనే బయటికి వెళ్లాలి. లేకుంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కంటి ఫ్లూ సాధారణంగా 7-14 రోజులలో తగ్గిపోతుంది, కొంతమందికి 3 వారాలు కూడా ఉంటుంది.