బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బ్యాటరీ లేకుండా కూడా కొనుగోలు చేయొచ్చు
ఇన్ఫినిటీ ఈ-స్కూటర్ బ్యాటరీ, ఛార్జర్‌తో కలిపి రూ. 68,999 లభిస్తుండగా, బ్యాటరీ లేకుండా స్కూటర్ ధర రూ. 36,000గా నిర్ణయించారు. 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' ఛాయిస్ తో ఇండియాలో పరిచయం అయిన తొలి ఈ-స్కూటర్ ఇన్ఫినిటీ కావడం విశేషం.
EV స్టార్టప్ బౌన్స్ సరికొత్త ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇప్పటికే భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఇందులో బ్యాటరీ అనేది వియోగదారుడి ఐచ్ఛికం. అంటే స్కూటర్‌ను బ్యాటరీతో పాటుగానైనా, బ్యాటరీ లేకుండా విడిగా అయినా కొనుగోలు చేయవచ్చు. ఇన్ఫినిటీ ఈ-స్కూటర్ బ్యాటరీ, ఛార్జర్‌తో కలిపి రూ. 68,999 లభిస్తుండగా, బ్యాటరీ లేకుండా స్కూటర్ ధర రూ. 36,000గా నిర్ణయించారు. 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' ఛాయిస్ తో ఇండియాలో పరిచయం అయిన తొలి ఈ-స్కూటర్ ఇదే కావడం విశేషం. కేవలం రూ. 499 టోకెన్ ధరతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుకింగ్ చేసుకోవచ్చు.
స్కూటర్ రేంజ్..
బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్ బ్యాటరీ రెండు కిలోవాట్-అవర్ లిథియం-అయాన్ శక్తి సామర్థ్యం కలది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిమీ పరిధి వరకు ప్రయాణించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ఠంగా 65kmph వేగాన్ని అందుకోగలదు. అంతేకాదు స్కూటర్ పంక్చర్ అయినట్లయితే దీనిని సులువుగా లాగడానికి వీలుగా 'డ్రాగ్ మోడ్' అనే ఫీచర్ కూడా కలిగి ఉండటం మరో విశేషం. ఇందులోని మరిన్ని ఫీచర్లు ఆపరేట్ చేయడం కోసం వినియోగదారులు తమ ఇన్ఫినిటీ స్కూటర్‌ను స్మార్ట్ యాప్‌తో జత చేయవచ్చు.
కలర్స్ లభ్యత..
బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐదు ఆకర్షనీయమైన రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇది బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్, TVS iQube , Ather 450X లాంటి EV స్కూటర్లకు పోటీగా నిలవనుంది.
రాజస్థాన్ లోని ఏకైక ప్లాంట్ నుంచి ఏడాదికి 180,000 స్కూటర్‌లను ఉత్పత్తి చేయాలని బౌన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. డిమాండును బట్టి ఉత్పత్తిని పెంచేందుకు దక్షిణ భారతదేశంలో ఎక్కడైనా మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒప్పందం ప్రకారం 2022 మార్చి నుంచి ఇన్ఫినిటీ స్కూటర్స్ డెలివరీలు ప్రారంభమవుతాయి.
సంబంధిత కథనం