Driving at Night | మీరు రాత్రిపూట డ్రైవ్ చేస్తారా? ఐతే ఈ టిప్స్ పాటించాల్సిందే!
పగటిపూట డ్రైవింగ్ చేయడానికి, రాత్రి పూట డ్రైవింగ్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. మీరు రాత్రిపూట డ్రైవింగ్ చేయాల్సి వస్తే ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయి..
చాలామంది పగటివేళల్లో ప్రయాణాల కంటే రాత్రి వేళల్లో ప్రయాణాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే సమయం కలిసివస్తుంది, రాత్రి వేళ ప్రయాణం చల్లగా, ఆహ్లాదంగా ఉంటుంది. అయితే మీకు మీరుగా సొంత వాహనంలో ప్రయాణిస్తుంటే రాత్రివేళలో డ్రైవింగ్ చేసేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పగటి వేళ డ్రైవింగ్‌కి, రాత్రి వేళ డ్రైవింగ్‌కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఘోరం జరిగే అవకాశం ఉంటుంది. మీ వల్ల ఇతరులు ప్రమాదానికి గురవుతారు.
చీకటి రోడ్లపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు, చిట్కాలు ఇక్కడ అందిస్తున్నాం, గమనించండి.
రాక్ మ్యూజిక్ వద్దు
రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు పాటించాల్సిన అతి ప్రాథమిక నియమం ఏమిటంటే రోడ్డుపై దృష్టి పెట్టడం. ట్రాఫిక్ సంబంధిత మరణాలలో 50% రాత్రిపూట సంభవిస్తాయని సర్వేలు తెలిపాయి. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ పరధ్యానం వద్దు. ముఖ్యంగా పదేపదే సెల్‌ఫోన్‌ని తీసుకోవడం, మెసేజులు చూడటం, మాట్లాడటం వద్దు. బిగ్గరగా మ్యూజిక్ పెట్టుకోవద్దు. మ్యూజిక్ పెట్టుకోవాల్సి వస్తే మరి హుషారైన పాటలు కాకుండా, అలా అని జోలపాటలు కాకుండా సాధారణ టెంపోలో ఉండే మ్యూజిక్ ఎంచుకోవాలి. అలాంటి ప్లేలిస్టును ముందే సిద్ధం చేసుకోవాలి.
మధ్యాహ్నం నిద్రపోండి
రాత్రిపూట డ్రైవింగ్ చేసేటపుడు మీ మైండ్ యాక్టివ్‌గా ఉండాలి. మీరు డ్రైవింగ్ చేయడానికి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోండి. పగటిపూట బాగా నిద్రపోండి, కాబట్టి రాత్రి నిద్ర రాదు. అలాగే ఆకలిగా, అలసటగా ఉంటే ఎక్కడైనా ఆగి.. తిని, రిఫ్రెష్ అయిన తర్వాతనే మీ వాహనం నడపండి. మీరు నిద్రమత్తులో ఉంటే ఎట్టిపరిస్థితుల్లో వాహనం నడపవద్దు. సమీపంలో ఎక్కడైనా హోటెల్‌లో నిద్రపోయి, తర్వాత వెళ్లండి.
డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్
మద్యం చేసి వాహనం ఎట్టి పరిస్థితుల్లో నడపకూడదు. చిన్న మోతాదులోనైనా సరే డ్రైవింగ్ చేసేటపుడు ఆల్కాహాల్ వద్దేవద్దు. మద్యం ఏ మోతాదులో సేవించినా మత్తులో నడుపుతారు లేదా జోష్ మీద నడుపుతారు. ఈ రెండు డ్రైవింగ్ మోడ్‌లు ప్రమాదకరమే.
తక్కువ వేగంతో డ్రైవ్ చేయండి.
సలోలి.. సలోలి.. చాలా వేగంగా అంబులెన్స్ నడిపినట్లు మీ వాహనం నడపకండి. రాత్రిపూట సురక్షితమైన వేగంలోనే వాహనాన్ని నడపాలి. రాత్రిపూట రోడ్డుపై ఏది స్పష్టంగా కనిపించదు. ఆబ్జెక్ట్‌లను చాలా ఆలస్యంగా గమనిస్తాము. ఏదైనా అడ్డుగా వస్తే మితిమీరిన వేగాన్ని నియంత్రించలేము. కాబట్టి రాత్రిపూట గంటకు 72 కిమీ కంటే ఎక్కువ వేగంతో నడపకూడదు.
లైట్స్ ఒకే అయితేనే రైట్ రైట్
రాత్రిపూట అన్నింటికంటే ముఖ్యం మీ వాహనం హెడ్ లైట్స్. మీ వాహనానికి మంచి హెడ్ లైట్స్ ఉపయోగించండి. రాత్రిపూట హైడ్ లైట్స్ పనిచేస్తేనే ప్రయాణం.. లేకపోతే బతుకు చీకటిమయం అని గుర్తుంచుకోవాలి.
సంబంధిత కథనం