Drinks for PCOS : అమ్మాయిలు పీసీఓఎస్​తో ఇబ్బందులా? అయితే వీటిని తాగండి.. -drinks these home made drinks to cure pcos ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Drinks For Pcos : అమ్మాయిలు పీసీఓఎస్​తో ఇబ్బందులా? అయితే వీటిని తాగండి..

Drinks for PCOS : అమ్మాయిలు పీసీఓఎస్​తో ఇబ్బందులా? అయితే వీటిని తాగండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 13, 2022 05:14 PM IST

సరైన జీవన శైలి లేకపోవడం, పోషకాహార లోపం వల్ల అమ్మాయిలు PCOSకు గురవుతుంటారు. దీనివల్ల చాలా ఇబ్బందుల పడాల్సి ఉంటుంది. అయితే ఇంట్లోనే తయారు చేసిన కొన్నిపానీయాలతో దీనికి చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆహార నిపుణులు.

పీసీఓఎస్
పీసీఓఎస్

Drinks for PCOS : అమ్మాయులు ఎదుర్కొనే సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పీసీఓఎస్. ఇది సరైనజీవన శైలి లేకపోవడం, పోషకాహార లోపం వల్ల ఎక్కువ వస్తుంది. అయితే దీనితో బాధపడే మహిళలకు ఋతుక్రమం సక్రమంగా ఉండదు. జుట్టు రాలే సమస్యలు, మొటిమలు, అధిక రక్తపోటు, మధుమేహానికి కూడా గురవుతారు. అయితే ఈ పరిస్థితిని తగ్గించేందుకు కొన్ని పానీయాలు మీకు సహాయం చేస్తాయి అంటున్నారు నిపుణలు. అవేంటో.. వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* దాల్చిన చెక్క టీ

PCOS నిర్వహణలో దాల్చిన చెక్క సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఇది గర్భాశయ ఫైబ్రాయిడ్లను పరిష్కరించి.. మహిళల్లో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుందని నిరూపించాయి.

తయారీ విధానం..

మరిగే నీటిలో దాల్చిన చెక్కలను వేసి మూత పెట్టండి. స్టవ్ ఆపేసి.. టీ బ్యాగ్ వేసి.. దానిలో పది నిముషాలు అలానే ఉంచండి. అనంతరం టీ బ్యాగ్, దాల్చిన చెక్కలను తీసివేసి.. వెచ్చగా తాగేసేయండి.

* పుదీనా టీ

PCOS చికిత్సకు మరొక గొప్ప ఔషధం పుదీనా టీ. దీనిలో యాంటీ-ఆండ్రోజెన్ ప్రభావాలు ఉంటాయి. ఇవి PCOSతో సంబంధం ఉన్న హార్మోన్ల అసమతుల్యత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇది మీ ఋతు చక్రం రెగ్యులర్ చేస్తుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. PCOS ఉన్న మహిళల్లో అధిక టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉంటాయి. ఇది జుట్టు రాలడం, మొటిమలకు దారితీస్తాయి.

తయారీ విధానం

పుదీనా ఆకులను నీటిలో వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ప్రతి రోజూ ఉదయం ఈ నీటిని తీసుకుంటే చాలా మంచిది.

* మునగాకుతో నీరు

మునగాకు నీరు PCOS సమస్యలో సహాయపడటమే కాకుండా మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మహిళల్లో రక్త ఇన్సులిన్‌ను, ఆండ్రోజెన్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. మహిళల్లో సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

తయారీ విధానం

ఒక టేబుల్ స్పూన్ మునగాకు పొడిని ఒక గ్లాసు నీటిలో కలపి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగండి.

* కలబంద

అలోవెరా పోషక, హైడ్రేటింగ్ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇది శరీరానికి తగినంత లూబ్రికేషన్ అందించి.. రసాయన నిర్మాణాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మీ జీర్ణవ్యవస్థకు కూడా చాలా మంచిది.

తయారీ విధానం

తాజా అలోవెరా జెల్‌ను నీటిలో కలపండి. కొద్దిగా ఉప్పు, తేనె వేసి బాగా కలపాలి. అల్పాహారానికి ముందు దీన్ని తీసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్