Dog Walker: డాగ్ వాకర్, ఈ ఉద్యోగంతో నెలకు 80,000 రూపాయలదాకా సంపాదించవచ్చు, రోజులో గంట మాత్రమే పని-dog walker this job can earn up to 80 000 rupees per month working only an hour a day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dog Walker: డాగ్ వాకర్, ఈ ఉద్యోగంతో నెలకు 80,000 రూపాయలదాకా సంపాదించవచ్చు, రోజులో గంట మాత్రమే పని

Dog Walker: డాగ్ వాకర్, ఈ ఉద్యోగంతో నెలకు 80,000 రూపాయలదాకా సంపాదించవచ్చు, రోజులో గంట మాత్రమే పని

Haritha Chappa HT Telugu
Sep 10, 2024 06:46 PM IST

Dog Walker: కరోనా వచ్చాక ఎన్నో కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. అలాంటి వాటిలో డాగ్ వాకర్ ఉద్యోగం కూడా ఒకటి. దీంతో ఒక వ్యక్తి ఎనిమిది వేల రూపాయల నుంచి 80 వేల రూపాయలు దాకా సంపాదించవచ్చు.

కొత్త ఉద్యోగం డాగ్ వాకర్
కొత్త ఉద్యోగం డాగ్ వాకర్ (Pixabay)

Dog Walker: ఆధునిక కాలంలో పరిస్థితులను బట్టి కొంత ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. జొమాటో, స్విగ్గీలాగా ఇంటికి ఆహారానికి వచ్చే డెలివరీ సర్వీసులు ఎన్నో వచ్చాయి. ఇప్పుడు డాగ్ వాకర్ ఉద్యోగం కూడా అలాంటిదే. చాలామందికి రిమోట్ వర్క్ పెరిగిపోయింది. ఇంట్లోనే కూర్చుని భార్యాభర్తలిద్దరూ పనిచేయాల్సిన పరిస్థితి. అయితే ఎంతోమందికి కుక్కలు పెంచుకునే అలవాటు ఉంటుంది. కొంతమంది వాటిని తమ పిల్లలతో సమానంగా ప్రేమగా చూస్తారు.

కానీ ఉద్యోగ రీత్యా వాటిని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ కి తీసుకెళ్లలేరు. అలాంటివారు డాగ్ వాకర్లను ఏర్పాటు చేసుకుంటారు. ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట తమ కుక్కలను వారికి ఇస్తారు. వాటిని వాకింగ్ చేయించి తీసుకురావడమే డాగ్ వాకర్ల పని. ఇందుకు వారానికి లేదా నెలకు చెల్లిస్తారు. ఇలా కొంతమంది ఎనిమిది వేల నుంచి 80 వేల రూపాయలు దాకా సంపాదిస్తున్న వారు ఉన్నారు.

పెట్ కేర్ సర్వీస్ ప్రొవైడర్లు డాగ్ వాకర్ సర్వీసును అందించేందుకు కొత్తగా పుట్టుకొచ్చాయి. ది పెట్ నెస్ట్ సంస్థ అలాంటిదే 2019 నుంచి తమ సేవలను అందించడం మొదలుపెట్టింది. వీరితో కొంతమంది విద్యార్థులు లేదా స్వల్ప కాల ఉద్యోగం చేసే వ్యక్తులు. రోజులో రెండు సార్లు తమకు అప్పచెప్పిన కుక్కలను వాకింగ్ కు తీసుకువెళ్లడమే పని. అమెరికా, కెనడా, యూకే వంటి ప్రదేశాలలో ఇలాంటి ఉద్యోగాలు బాగా ఆదరణ పొందాయి. పార్ట్ టైమ్ ఉద్యోగం చేయాలనుకునే వారికి, అదనంగా సంపాదించుకోవాలనుకునే వారికి ఈ ఉద్యోగం సరైనది.

రోజులో గంట మాత్రమే

ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఏ ఉద్యోగం చేసుకున్నా పరవాలేదు, పెట్ ఓనర్లు చెప్పిన టైంకి వచ్చి వారి కుక్కలను వాకింగ్ కు తీసుకెళ్తే సరిపోతుంది. కేవలం అరగంట పాటు మాత్రమే వాకింగ్ చేయించాలి. అలాగే ఉదయం పూట కూడా వాకింగ్ చేయించాల్సి వస్తుంది. అంటే రోజులో ఒక గంటసేపు పనిచేస్తే చాలు, కొంతమంది నెలకు 8000 ఇస్తే మరి కొంతమంది 15 వేల రూపాయలు ఇస్తారు. ముంబైలాంటి మహానగరాల్లో మాత్రమే 80,000 రూపాయల దాకా ఇచ్చేవారు ఉన్నారు.

ఇలాంటి డాగ్ వాకింగ్ సర్వీసులను అందించే మరొక సంస్థ పించ్. దీని సీఈవో నితిన్ మోహన్ శ్రీ వాస్తవ ఆయన మాట్లాడుతూ కుక్కలను వాకింగ్ కు తీసుకువెళ్ళడమే కాదు, వాటికి వ్యాక్సిన్లు వేయించడం, ఆరోగ్యం బాగోకపోతే వైద్యులకు చూపించడం వంటి సర్వీసులు కూడా అందిస్తామని చెబుతున్నారు. వాటిని కుటుంబ సభ్యుల్లాగే చూస్తామని వివరిస్తున్నారు.

ముంబై లాంటి టైర్ 1 నగరాల్లో డాగ్ వాకింగ్ అనేది ఖరీదైనదిగా మారింది. ఢిల్లీలో, నోయిడా ప్రాంతంలో కూడా డాగ్ వాకింగ్ సర్వీస్ కు అధికంగానే క్లయింట్లు వస్తున్నారు.

ఒక్కో కుక్కకు

పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఉద్యోగాల కోసం ఢిల్లీకి వెళ్తారు. అలాంటివారు పార్ట్ టైం ఉద్యోగాలు చేసేందుకు ఈ డాగ్ వాకర్స్ గా మారుతున్నారు. మిగిలిన ఖాళీ సమయంలో ఇతర ఉద్యోగాలు చేస్తూ రెండు సంపాదనలను పొందుతున్నారు. ఒక వ్యక్తి రెండు నుంచి నాలుగు కుక్కలను వాకింగ్ కు తీసుకెళ్తారు. దీని వల్ల వారికి అదనపు ఆదాయం వస్తుంది. ఒక్కొక్క శునకానికి 8000 రూపాయల నుంచి 15 వేల రూపాయల దాకా వసూలు చేస్తారు. నాలుగు కుక్కలను డాగ్ వాకింగ్ తీసుకెళ్లడంవల్ల వారికి అధికంగానే ఆదాయం వస్తుంది. అందుకే డాగ్ వాకర్సుగా స్థిరపడుతున్న వారు కూడా ఉన్నారు.

డాగ్ వాకర్స్ ఎవరు పడితే వారు కాలేరు, కంపెనీలో చేరాక వారికి డాగ్ వాకింగ్, గ్రూమింగ్ సేవల గురించి కొంత అవగాహన కల్పిస్తారు. ట్రైనింగ్ కూడా ఇస్తారు. అలాంటి డాగ్ వాకింగ్, గ్రూమింగ్ సేవలను అందించే మరో సంస్థ ఫ్లూట్. ఇది తమ డాగ్ వాకర్లకు శిక్షణ ఇచ్చాకే ఉద్యోగంలోకి తీసుకుంటుంది. రెండు రోజులు పాటు కోర్సును అందిస్తుంది. ఒక్కో మనిషి నాలుగు కుక్కలను నెలరోజుల పాటు డాగ్ వాకింగ్ కి తీసుకెళ్తే చాలు, అతని ఫ్యామిలీ కి కావాల్సిన సంపాదన వచ్చేస్తుంది. ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన కొత్త ఉద్యోగం డాగ్ వాకర్స్.

టాపిక్