Goddess Lakshmi | సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేయకూడదని మీకు తెలుసా?-do not do this work after sunset if you want to maintain peace at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /   Do Not Do This Work After Sunset If You Want To Maintain Peace At Home

Goddess Lakshmi | సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేయకూడదని మీకు తెలుసా?

పాలు
పాలు (pixabay)

సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసా? పొరపాటున కూడా సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తే లక్ష్మీ దేవికి కోపం వస్తుందట. అందుకే ఈ పనులు మాత్రం అసలు చేయకండి. ఇంతకీ సూర్యాస్తమయం తర్వాత చేయకూడని ఆ పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కొన్ని పనులు మాత్రం సూర్యాస్తమయం తర్వాత చేస్తే లక్ష్మీ దేవికి కోపం వస్తుందట. ఇంట్లో నుంచి వెళ్లిపోతుందట. అందుకే అనుగ్రహం సంగతి అలా ఉంచితే ఆగ్రహానికి మాత్రం గురి కాకండి.

ట్రెండింగ్ వార్తలు

ధనం (Money): లక్ష్మీ దేవికి ప్రతి రూపం ధనం. మీరు సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బులు ఇస్తే మన ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపించివేస్తున్నట్లే. శుక్రవారం కూడా డబ్బులు ఎవరికీ ఇవ్వకూడదు.

పాలు (Milk): సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా మనం పాలు ఇస్తే ఆ లక్ష్మీదేవికి కోపం వస్తుందట. వారి వృద్ధి ఆగిపోయినట్లేనట.

పెరుగు (Yogurt): పెరుగు శుక్రుడితో సమానం. పెరుగు మన ఆనందానికి, శోభకి ప్రతి రూపం. అలాంటిది సూర్యాస్తమయం తర్వాత పెరుగు ఎవరికైనా ఇస్తే ఆ కుటుంబంలో సంతోషం, శోభ తగ్గిపోతాయట.

పసుపు (Tumeric): పసుపు కూడా శుక్రుడితోనే సమానం. ఒకవేళ ఎవరైనా సూర్యాస్తమయం తర్వాత పసుపును ఎవరికైనా ఇచ్చారంటే.. ఆ కుటుంబసభ్యులకు ఆరోగ్య, ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందట.

ఉల్లి పాయ, వెల్లుల్లిపాయ (Onion & Garlic): ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ.. కేతు గ్రహానికి సంకేతం. సాయంకాలం ఎవరికీ వీటిని కూడా ఇవ్వకూడదు. ఇస్తే మాత్రం కష్టాలు తప్పవు.

లక్ష్మీదేవి నివాస స్థలాలు

పాలు, పూలు, పసుపు, కుంకుమ, దీపం, గోవు, ధనం, ధాన్యం, పరిశుభ్రమైన ఇల్లు లక్ష్మీదేవి నివాస స్థలాలు. వీటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండరాదు

- సూర్యోదయం తరువాత, సూర్యాస్తమయం సమయంలో అస్సలు పడుకోకూడదు. అలా నిద్రించే వారి ఇళ్లల్లో లక్ష్మీ దేవి ఉండదు.

- ఉదయం బ్రష్ చేయకుడా వంట గది, పూజ గదిలోకి వెళ్లకూడదు. నిద్రలేవగానే ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు.

- ఎల్లప్పుడూ కలహాలతో ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కాలు పెట్టదట. ఎక్కడైతే పవిత్రత, ప్రశాంతత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఇంట్లో సంతోషాలకు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందండి.

WhatsApp channel

సంబంధిత కథనం