Detox Tips : శరీరం నుంచి విషపదార్థాలను ఇలా సహజంగా బయటకు పంపేయండి.. లేదంటే..-check out these ayurvedic ways to remove toxins from body ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Detox Tips : శరీరం నుంచి విషపదార్థాలను ఇలా సహజంగా బయటకు పంపేయండి.. లేదంటే..

Detox Tips : శరీరం నుంచి విషపదార్థాలను ఇలా సహజంగా బయటకు పంపేయండి.. లేదంటే..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 17, 2022 10:00 AM IST

శరీరంలోని విషపదార్థాలను డిటాక్స్ చేయడం చాలా మంచి విషయం. కచ్చితంగా మీలోపల ఉన్న విషపదార్థాలను బయటకు పంపడం మీ శరీరానికి చాలా మంచిది. మీ శరీరంలోపల చనిపోయిన కణాలను బయటకు పంపకపోతే.. అవి మిమ్మల్ని అనారోగ్యానికి గురయ్యేలా చేస్తాయి. అయితే మీరు సహజంగానే మీ శరీరాన్ని డిటాక్స్ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

<p>డిటాక్స్</p>
డిటాక్స్

Ayurveda Tips to Detox : మనం తినే ఆహారం, పీల్చే గాలి, చర్మం ద్వారా విషపదార్థాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి వాటిని డిటాక్స్ చేయడం చాలా అవసరం. లేదంటే లేనిపోని రోగాలు మనల్ని చుట్టుముడతాయి. మన గట్, చర్మం, ఊపిరితిత్తులను కచ్చితంగా డిటాక్స్ చేస్తూ ఉండాలి. అయితే నిర్విషీకరణ చేయడానికి అనేక సాధారణ బయోహ్యాకింగ్ పద్ధతులు ఉన్నాయి. మీరు సహజంగా డిటాక్స్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయని ఆయుర్వేద డాక్టర్ మనోజ్ తెలిపారు.

yearly horoscope entry point

“మన శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. ఫైబర్, విటమిన్ సి, సల్ఫర్‌తో కూడిన సరైన ఆహారాన్ని తీసుకోవడం, యాంటీఆక్సిడెంట్లు, ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ వంటివి శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి. ప్యాక్ చేసిన, శుద్ధి చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. చక్కెర, ఉప్పును తక్కువగా తీసుకోవాలి. మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడానికి, అన్ని జీవక్రియలను తొలగించడానికి ఈ ఆర్ద్రీకరణ ముఖ్యం. ఆకుకూరలు, పొట్లకాయ, కొబ్బరి నీరు, గోధుమ గడ్డి, పుచ్చకాయ మొదలైన కొన్ని ఆహారాలు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి.''

పొడి, తడి ఆవిరి, ఇన్‌ఫ్రా-రెడ్ ఆవిరి, సన్‌బాత్ చర్మ పనితీరును మెరుగుపరిచే ఎక్స్‌ఫోలియేషన్ పద్ధతులు. ఏరోబిక్స్ వంటి వ్యాయామాలు నిర్విషీకరణనకు చాలా మంచివి. వివిధ శ్వాస వ్యాయామాలు, ప్రాణాయామ అభ్యాసాలు ఊపిరితిత్తుల నుంచి మలినాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇవి కాకుండా సానుకూల ఆలోచనలపై దృష్టి పెట్టడం ద్వారా, మన మనస్సులోని ప్రతికూల బాధలన్నింటినీ తొలగించి భావోద్వేగ ప్రక్షాళనను కూడా అభ్యసించాలి. లోతైన నిర్విషీకరణకు ఉపవాసం కూడా ఒక అద్భుతమైన మార్గమని డాక్టర్ మనోజ్ తెలిపారు.

ఇదే విషయాన్ని వివరిస్తూ.. Vieroots వెల్‌నెస్ సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు సజీవ్ నాయర్.. అడపాదడపా ఉపవాసం అనేది శరీరం నుంచి మృతకణాలను శుభ్రపరచడంలో సహాయపడే వాటిలో ఒకటని తెలిపారు. ఎర్తింగ్ అనేది కూడా అలాంటి మరొక సులభమైన మార్గం. నేల మీద బేర్ పాదాలతో నడవడం.

మరిన్ని డిటాక్స్ పద్ధతులు

1. రాత్రి 7 గంటలలోపు (లేదా పడుకునే ముందు 4-5 గంటల ముందు) రాత్రి భోజనం ముగించేయండి. ఈ విధంగా మీ శరీరం ఆహారాన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతుంది.

2. వెజిటబుల్ జ్యూస్ (పొట్లకాయ, దోసకాయ మొదలైనవి) వంటి డిటాక్స్ జ్యూస్‌లను తీసుకోవడం మంచిది. ప్రాధాన్యంగా ఉదయం ఖాళీ కడుపుతో మీ శరీరాన్ని నిర్విషీకరణ చేయడం వల్ల ముఖ్యమైన అవయవాలు విషపదార్థాలను శుభ్రపరుస్తాయి. కాలేయం వాటిని విసర్జించడంలో సముచితంగా పని చేస్తుంది.

3. వారానికి ఒకసారి ద్రవపదార్థాలతో ఉపవాసం ఉండండి. లిక్విడ్ ఫాస్ట్ వివిధ కారణాల వల్ల.. నిర్విషీకరణకు, బరువు తగ్గడానికి, మీ జీర్ణవ్యవస్థకు విశ్రాంతిని ఇవ్వడానికి లేదా దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం చేయవచ్చు. స్పష్టమైన లిక్విడ్ డైట్ మీకు తగిన కేలరీలు, పోషకాలను అందించదు కాబట్టి.. దీన్ని కొన్ని రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగించకూడదు.

Whats_app_banner

సంబంధిత కథనం