Cooking Oil | ఒకసారి వాడిన నూనె మళ్లీ వంటకు వాడొచ్చా? వాడితే ఏమవుతుంది?-can we use cooking oil which has been used once ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cooking Oil | ఒకసారి వాడిన నూనె మళ్లీ వంటకు వాడొచ్చా? వాడితే ఏమవుతుంది?

Cooking Oil | ఒకసారి వాడిన నూనె మళ్లీ వంటకు వాడొచ్చా? వాడితే ఏమవుతుంది?

Himabindu Ponnaganti HT Telugu
Dec 16, 2021 07:35 PM IST

ఏవైనా పిండి వంటలు చేసినప్పుడు చివర్లో కాస్త నూనె మిగిలిపోతుంది. ఆ నూనెను మళ్లీ వాడొచ్చా లేదా అన్నది ఎంతో మందికి మదిలో ఉండే సందేహం. కొంతమంది ఏమీ కాదులే అని వాడేస్తుంటారు. మరికొందరు ఆరోగ్యానికి మంచిది కాదని పారబోస్తుంటారు.

వంట నూనె
వంట నూనె (pixabay)

పిండి వంటల కోసం కూడా లీటర్లలో నూనె వాడతాం. వంట మొత్తం అయిన తర్వాత నూనె మిగిలిపోతుంది. ఆ నూనెను ఏం చేయాలా అని ఆలోచిస్తాం. మరిగి మరిగి ఉన్న నూనె వాడకూడదని కొందరు అంటారు. మరికొందరేమో వాడితే ఏమి కాదులే అని ఆ తర్వాత రోజు వారీ కూరల కోసం వాడేస్తుంటారు. ఇంతకీ ఒక సారి వేడి చేసిన వాడిన నూనెను మళ్లీ వాడొచ్చా? లేదా? 

కెమికల్స్ రిలీజ్ అవుతాయి..

వంట నూనెలు ఏవైనా ఎక్కువసార్లు వేడి చేస్తే అందులో ఉంటే విటమిన్స్ నశించడమే కాకుండా హానికారక కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అవి గుండె, మెదడు సంబంధిత వ్యాధులు, వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులకు కారణమవుతాయి. ఆల్జీమర్స్, స్ట్రోక్, క్యాన్సర్, పార్కిన్సన్స్, కాలేయ సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.  అలాగే ఎక్కువ సార్లు వేడి చేసిన నూనెను వాడటం వలన హార్మోన్లు, ఎంజైముల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

- తరచుగా గ్యాస్ సమస్య లేదా కడుపులో మంటగా అనిపిస్తే దీనికి కారణం వంట నూనె అని చెప్పాలి. వీధి ఆహారం, రెస్టారెంట్లలో ఒకసారి ఉపయోగించిన వంట నూనెనే మళ్లీ మళ్లీ ఉపయోగిస్తుంటారు. అందుకే బయట ఆహారం తినడం వల్ల తరచుగా ఇబ్బందులకు గురవుతుంటాం.

- తప్పనిసరిగా నూనె మళ్లీ వాడాల్సి వస్తే.. వంట చేసిన తర్వాత మిగిలిన నూనెను చల్లబడిన తర్వాత వడగట్టాలి. చివర్లో నల్లగా ఉన్న పదార్థం కిందకు దిగకుండా వడబోయాలి. ఆ తర్వాత ఆ నూనెను గాలి చొరబడని డబ్బాలో పోయాలి.

- నూనెను తిరిగి వాడే ముందు ప్రతి సారి నూనె రంగు, మందం గురించి తనిఖీ చేయండి. అలా కాకుండా నూనె ముదురు రంగు, జిడ్డు ఉంటే మాత్రం ఆ నూనెను మార్చవలసిన అవసరం ఉంది.

- నూనె ఎక్కువ వేడి అవ్వక ముందే పొగలు వస్తే అప్పుడు ఆ నూనె విషపూరితం అయినదని గమనించాలి.

- ఒకసారి వాడిన నూనెని, వాడని దానితో కలపకూడదు. దానివల్ల తాజా నూనె కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. నూనెలను చల్లని, పొడి ప్రదేశాల్లో, సరైన మూత పెట్టి నిల్వ చెయ్యాలి. రిఫ్రిజిరేటర్‌లో పెట్టి తీస్తే గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత వాడాలి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్