తెలుగు న్యూస్ / ఫోటో /
Busiasness Idea: ధోనీలా కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారం.. కిలో మాంసం ధర ఎంతో తెలుసా!
- భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారం మెుదలుపెట్టారు. ఇందుకోసం ఆయన మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లాలోని ఓ సంస్థ నుండి 2,000 కోడిపిల్లల వరకు ఆర్డర్ ఇచ్చారు.
- భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారం మెుదలుపెట్టారు. ఇందుకోసం ఆయన మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లాలోని ఓ సంస్థ నుండి 2,000 కోడిపిల్లల వరకు ఆర్డర్ ఇచ్చారు.
(1 / 6)
ధోనీ లాంటి ప్రముఖులు కడక్‌నాథ్ కోళ్లను పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటే మరి ఆ కోడిలో ఉన్న ప్రత్యేకతలేంటి.. మార్కెట్లో వాటికి ఉన్న డిమాండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
(2 / 6)
ప్రస్తుతం మార్కెట్‌లో కడక్‌నాథ్ కోడి మాంసం కిలో రూ.700 నుంచి రూ 900 పైగానే ఉంది. కేవలం ఈ కోడి మాంసమే కాదు.. గుడ్డు కూడా చాలా కాస్ట్‌లీయో. కోడిపిల్ల పుట్టిన తర్వాత రోజులను బట్టి ధర ఉంటుంది. ఒకరోజు, ఏడు రోజులు, 15 రోజుల వయసున్న కోడిపిల్లలకు వేర్వేరు ధరలు ఉంటాయి. ఒకరోజు కోడిపిల్ల ధర రూ.75, ఏడు రోజుల వయసున్న కోడిపిల్ల ధర రూ.80, 15 రోజుల కోడిపిల్ల ధర రూ.90. 28 రోజుల కోడిపిల్ల ధర 120 రూపాయల వరకు ఉంటుంది.
(3 / 6)
ఐదు నెలల వయసు నుండి ఒక్కొ కోడి నెలకు 10 నుంచి 18 గుడ్ల చొప్పున దాదాపు మూడేళ్ల వరకు గుడ్లు పెడుతుంది.
(4 / 6)
సాధారణ బాయిలర్ కోళ్ల కంటే కడక్‌నాథ్ కోడి మాంసంలో ప్రొటీన్స్, ఐరన్ ఎక్కువగా. కొవ్వు తక్కువగా ఉంటుంది. వాటి గుడ్డులోనూ అత్యధికంగా ప్రొటీన్లు, లినోలెయిక్ యాసిడ్‌లు ఉంటాయి.
(5 / 6)
కడక్‌నాథ్ కోళ్లు పౌల్ట్రీ రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందుతున్నారు. నిర్వహాణ కూడా తక్కువగా ఉండడంతో చాలా మంది ఈ వ్యాపారంపై ఆసక్తి చూపిస్తున్నారు. వీటి నిర్వహణకు పెద్దగా ఖర్చు ఉండదు. పాడైన కూరగాయాలు, పంట పొలాల్లో ఉండే కీటకాలను ఆహరంగా తీసుకుంటాయి.
ఇతర గ్యాలరీలు