MS Dhoni | ధోనీ ప్లాన్‌కు పొలార్డ్ మరోసారి బలి.. అప్పుడు కూడా ఇలాగే
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యూహానికి మరోసారి బలయ్యాడు ముంబయి బ్యాటర్ కీరన్ పొలార్డ్. అతడి కోసం ప్రత్యేకంగా ఫీల్డింగ్ సెట్ చేసిన మహీ.. సక్సెస్ అయ్యాడు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న అతడిని పెవిలియన్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ టోర్నీలో చైన్నై సూపర్ కింగ్స్-ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఇరు జట్ల బలబలాలు సమానంగా ఉండటమే కాకుండా.. మ్యాచ్ ఎప్పుడు, ఎలా మలుపు తిరుగుతుంతో కూడా చెప్పలేం. గురువారం ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఈ కోవకే వస్తుంది. అప్పటి వరకు విజయం మాదే అని ధీమాగా ఉన్న ముంబయి జట్టుకు.. ధోనీ తన విశ్వరూపమే చూపించాడు. ఒక ఓవర్‌లో 17 పరుగులు చేయాల్సిన తరుణంలో అదిరిపోయే హిట్టింగ్‌తో సీఎస్‌కేను గెలిపించాడు. అంతేకాకుండా అంతకుముందు ధోనీ తెలివిగా ఫీల్డింగ్ సెట్ చేసి ముంబయి బ్యాటర్ కీరన్ పొలార్డ్‌ను ఔట్ చేశాడు. అతడి వ్యూహానికి విండీస్ వీరుడు పెవిలియన్ బాట పట్టాడు.
ముంబయి ఇన్నింగ్స్ చివర్లో పొలార్డ్ ప్రమాదాకరంగా మారుతున్నాడు. అప్పటికే 9 బంతుల్లో ఓ సిక్సర్, ఫోర్ సహా 14 పరుగుల సాధించి భారీ స్కోరు చేసేలా కనిపించాడు. అలాంటి తరుణంలో చెన్నై మాజీ కెప్టెన్ ఫీల్డింగ్ సెట్ చేశాడు. మిస్టర్ కూల్ మాస్టార్ ప్లాన్‌లో చిక్కుకున్న విండీస్ వీరుడు మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మహీశ్ సంధించిన క్యారమ్ బాల్‌ను తక్కువ అంచనా వేసిన పొలార్డ్.. డీప్ ఉన్న దూబేకు క్యాచ్ ఇచ్చాడు. అంతకుముందు మహీ అతడి కోసం ప్రత్యేకంగా ఫీల్డింగ్ సెట్ చేశాడు.
ఇలా పొలార్డ్ ధోనీ వ్యూహానిక బలవ్వడం ఇదే మొదటిసారి కాదు. 12 ఏళ్ల క్రితం ఇదే తరహాలో 2010 ఫైనల్‌లో ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కేతో మ్యాచ్‌లో పొలార్డ్ ఔటయ్యాడు. మిడాఫ్‌లో మ్యాథ్యూ హెడెన్‌ను ఫీల్డింగ్ పెట్టిన ధోనీ.. అల్బీ మోర్కెల్‌కు బంతిని ఇచ్చాడు. అతడి బౌలింగ్‌లో పొలార్డ్ మిడాఫ్‌లోని హెడెన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ముంబయిపై చెన్నై 22 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ నెగ్గింది.
తాజాగా గురువారం ముంబయితో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 3 వికెట్ల తేడాతో నెగ్గింది. 156 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి బంతి వరకు పోరాడిన సీఎస్‌కే ధోనీ సాయంతో అద్భుత విజయాన్ని మూటగట్టుకుంది. చివర్లో 4 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా.. ఓ సిక్సర్, రెండు ఫోర్లతో విజృంభించి గెలిపించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 రన్స్ చేసింది. పరుగుల ఖాతా తెరవకముందే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ ఇషాన్‌కిషన్ కూడా డకౌట్ అయ్యాడు. బ్రేవిస్ 4 రన్స్ చేసి ఔటయ్యాడు. చెన్నై బౌలర్ ముఖేష్ చౌదరి నిప్పులు చెరిగే బంతులతో ముంబై టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ఇలాంటి సమయంలో సూర్యకుమార్ యాదవ్ అర్ధశతకంతో ఆకట్టుకుని ముంబయికి పోరాడే స్కోరును ఇవ్వగలిగాడు. అనంతరం చెన్నై బ్యాటర్లలో ధోనీ(28)తో పాటు రాయుడు(40), రాబిన్ ఉతప్ప(30) రాణించడంతో సీఎస్‌కే జట్టు గెలిచింది.
సంబంధిత కథనం
టాపిక్