Cheating In Relationship : అక్రమ సంబంధం పెట్టుకోవడానికి 6 అసలైన కారణాలు!-6 honest reason for cheating in relationship and extramarital affairs ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cheating In Relationship : అక్రమ సంబంధం పెట్టుకోవడానికి 6 అసలైన కారణాలు!

Cheating In Relationship : అక్రమ సంబంధం పెట్టుకోవడానికి 6 అసలైన కారణాలు!

HT Telugu Desk HT Telugu
Jul 20, 2023 07:00 PM IST

Cheating In Relationship : మీరు ఓ వ్యక్తిని చాలా ఇష్టపడుతున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ కొన్ని కారణాలతో కొంతమంది అక్రమ సంబంధం పెట్టుకుంటారు. ఈ విషయం తెలిసిన భాగస్వామి అస్సలు తట్టుకోలేరు. అసలు అక్రమ సంబంధానికి దారితీసే అసలైన కారణాలేంటి..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ఈ రోజుల్లో కొంతమంది పెళ్లి చేసుకున్నా.. ఇతరులతో శారీరక సంబంధం పెట్టుకుంటారు. నకిలీ సంబంధాలలో మునిగిపోతారు. ప్రతిరోజూ వార్తల్లో ఇలాంటివి వింటూనే ఉంటాం. రిలేషన్ షిప్ లో ఉన్న కొందరు వ్యక్తులు తమ భాగస్వాములను ఎందుకు మోసం చేస్తారు? వివాహేతర సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకలా చేస్తారో ఓసారి చూద్దాం..

yearly horoscope entry point

పెళ్లయిన కొంత కాలం తర్వాత చాలా మంది జంటలు రిలేషన్ షిప్(Relationship)లో బోర్ గా ఫీల్ అవుతారు. మీరు ఈ విసుగును సీరియస్‌గా తీసుకోకుంటే, అది మీ సంబంధానికి పెద్ద నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే జంటలో ఒకరు విసుగు చెందినప్పుడు, కొత్త సంబంధంలో థ్రిల్ కోసం చూస్తారు. విసుగు అనేది వ్యక్తులు బయటి సంబంధాలు, ప్రేమను కోరుకునేలా చేస్తుంది. ఆనందాన్ని పొందడానికి వారు వివాహేతర సంబంధాలలో మునిగిపోవడానికి ప్రయత్నించవచ్చు. ప్రస్తుత సంబంధంలో లేనిది ఏదో.. తిరిగి పొందేందుకు ఇది ఒక అవకాశంగా కూడా చూడవచ్చు.

వ్యక్తులు తమ భాగస్వామిని మోసం చేయడం అనేది వారు ఏదైనా చేసిన తప్పుకు ప్రతీకారంగా భావించవచ్చు. తమ భాగస్వామి ద్రోహం చేసినా, పెద్దగా పట్టించుకోకపోయినా.., ప్రతీకారం తీర్చుకునేందుకు ఇలాంటివి చేస్తుంటారు. అయితే భాగస్వామికి ఆ విషయం తెలిసినా.. తెలియకపోయినా.. ఇలా చేస్తేనే.. వారికి సరైన బుద్ధి అనే భ్రమలో ఉంటారు. దీని వెనక ఉద్దేశ్యం ఏమిటంటే, ఎదుటి వ్యక్తి ఎంత బాధపెట్టారో అంతే బాధపెట్టి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం.

సంబంధంలో అసంతృప్తి, నిర్లక్ష్యం భాగస్వామిని మోసం చేయడానికి లేదా వివాహేతర సంబంధంలో పాల్గొనడానికి దారితీస్తుంది. భాగస్వామితో సరిగా లేకపోవడం, దూరంగా ఉండటం వంటి కారణాలతో సంబంధంలో అసంతృప్తి ఏర్పడవచ్చు. ఇది చివరికి నిర్లక్ష్యానికి దారి తీస్తుంది. ఒక భాగస్వామి సంబంధంలో నిర్లక్ష్యానికి గురైతే.. ఇతరులపై ఆసక్తిని చూపిస్తారు.

ఎవరైనా ఒక సంబంధంలో సంతోషంగా లేదా అసంతృప్తిగా ఉన్నప్పుడు ఆ బంధాన్ని ముగించడం కష్టమవుతుంది. నేరుగా వెళ్లి.. నీతో నాకు కుదరదు అని చెబితే ఎవరూ వినరు. దీంతో మోసం చేయడం ద్వారా సులభంగా దూరం అవ్వచ్చు అనే ఆలోచనల్లో ఉంటారు. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటే.. భాగస్వామి విడిపోతారని ఇలా చేస్తుంటారు కొంతమంది.

ఎమోషనల్ కనెక్షన్(Emotional Connection) లేకపోవడంతో తమ భాగస్వామి డిస్‌కనెక్ట్ అయినట్లుగా కొందరు భావిస్తారు. ఒక వ్యక్తిని తన భాగస్వామి నిర్లక్ష్యం చేస్తే, దూరంగా ఉన్నట్లు భావించినప్పుడు ఇతరులతో అక్రమ సంబంధాన్ని(Illegal Affair) పెట్టుకునే అవకాశం ఉంది. అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. కాస్త ఎమోషన్స్ చూపించినా.. కరిగిపోతారు. అలాంటి సందర్భాలలో, వారు కోరుకునే భావోద్వేగ సంబంధమే వారి భాగస్వామిని మోసం చేసేలా చేస్తుంది. అలా వారు వివాహేతర సంబంధాల వైపు వెళ్తారు.

వివాహ జీవితంలో శారీరక సాన్నిహిత్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక జంట కలిసి సెక్స్‌లో నిమగ్నమైనప్పుడు, ఒకరి అవసరాలను మరొకరు తెలుసుకోవాలి. కానీ భాగస్వామి లైంగిక అవసరాలు సరిగా తీర్చకుంటే.. అది నిరాశగా మారుతుంది. ఏదో అనుకుంటే.. అంతగా సంతృప్తి లేదని భావిస్తారు. లైంగిక అసంతృప్తి ఉంటే.. కచ్చితంగా వేరే వారివైపు చూస్తారు. కొందరు వ్యక్తులు పడకగదిలో సంతోషంగా లేదా సంతృప్తిగా లేనప్పుడు, బయట లైంగిక ఆనందాన్ని పొందవచ్చు. తమ కోరికల కోసం ఇతరుల మీద ఆధారపడొచ్చు. కానీ ఏదిఏమైనా.. ఇతరులతో లైంగిక సంబంధం పెట్టుకోవడం అనేది జీవితాలను నాశనం చేస్తుందని గుర్తుంచుకోవాలి.

Whats_app_banner