NNS 29th May Episode: టవల్ ఇవ్వడానికి వచ్చిన భాగీని బాత్‌రూమ్‌లోకి లాగిన అమర్.. మిస్సమ్మను చంపేందుకు మనోహరి సుపారి!
NNS 29th May Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ బుధవారం (మే 29) ఎపిసోడ్లో తనకు టవల్ ఇవ్వడానికి వచ్చిన భాగీని బాత్‌రూమ్‌లోకి లాగుతాడు అమర్. మరోవైపు మిస్సమ్మను చంపేందుకు సుపారీ ఇస్తుంది మనోహరి.
NNS 29th May Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (మే 29) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. భాగీని చంపైనా అమర్‌ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ప్రశాంతంగా పడుకున్న మనోహరిని నీల వచ్చి హడావిడిగా లేపుతుంది. ఏమైంది, ఇంతపొద్దున్నే ఎందుకు లేపుతున్నావే అంటూ కోప్పడిన మనోహరితో ఒకసారి బయటకు వచ్చి చూడండి అంటూ బయటకు పరిగెడుతుంది నీల.
పిల్లలను చూసి అమర్ ఖుష్..
లాన్లో పిల్లలు ఎక్స్సర్సైజ్లు చేస్తూ కనిపిస్తారు. ఏమైందే వీళ్లకి పొద్దుపొద్దున్నే కుప్పిగంతులు వేస్తున్నారు అంటుంది మనోహరి. ఏమో అమ్మా అంటుంది నీల. పిల్లలకు ఇష్టమైన పనులు చేసి వాళ్లకి దగ్గరవ్వాలని చూస్తుందంటే ఇలా వాళ్లకి మరింత దూరమవుతుంది అంటుంది నీల. అసలేమైంది రాథోడ్.. పొద్దున్నే మమ్మల్ని ఇలా ఎందుకు చంపుతున్నావ్ అంటుంది అంజు.
ఏమో అమ్మా.. ఇది మిస్సమ్మ మేడమ్ ఆర్డర్ అంటాడు రాథోడ్. అప్పుడే అటుగా వచ్చిన అమర్ పిల్లలు పొద్దున్నే ఎక్స్సర్సైజ్లు చేయడం చూసి మెచ్చుకుంటాడు. థ్యాంక్యూ రాథోడ్ పిల్లల బాధ్యత నువ్వు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటాడు. అప్పుడే అక్కడికి మిస్సమ్మ రావడంతో కొన్ని గ్రహాలు మన జీవితంలోకి వచ్చినప్పటి నుంచీ ఏదీ సరిగ్గా లేదు, ఊర్లో వదిలేసి వచ్చామనుకునేలోపే ఇంట్లోకి వచ్చి తిష్ట వేసింది అంటాడు అమర్. అది విని సార్.. మీరు పొగుడుతుంటే బాగుందికానీ నన్ను, పిల్లల్ని పొద్దున్నే లేపి ఎక్స్సర్సైజ్లు చేయమంది మిస్సమ్మనే సార్ అంటాడు రాథోడ్. పిల్లలు, రాథోడ్ అక్కడనుంచి వెళ్లిపోతారు.
బాత్‌రూమ్‌లో భాగీ, అమర్
మిస్సమ్మ తెచ్చిన కాఫీ తీసుకుని తాగుతాడు అమర్. పొద్దున్నే నేను చేసిన పనులకు మెచ్చుకోకపోగా నా కాఫీ కూడా తాగేస్తున్నారా అంటుంది మిస్సమ్మ. ఇది నీకోసం తెచ్చుకున్నదా నాకోసం తెచ్చావనుకున్నా అంటాడు అమర్. నాకోసం తెచ్చుకున్నదే కొంచం తాగా కూడా అంటుంది మిస్సమ్మ. అంటే ఇది ఎంగిలి కాఫీనా? అని అమర్ అడుగుతున్నా పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోతుంది మిస్సమ్మ.
టవల్ మర్చిపోయి స్నానానికి వెళ్తాడు అమర్. మిస్సమ్మను టవల్ ఇమ్మని అడిగితే ఆటపట్టిస్తుంది. తనని ప్రేమగా భాగీ అని పిలిస్తేనే టవల్ ఇస్తాను అంటుంది. చేసేదేంలేక మిస్సమ్మను భాగీ అని పిలిచి టవల్ ఇమ్మంటాడు అమర్. ఆశ్చర్యపోయిన భాగీ టవల్ ఇచ్చేందుకు సంతోషంగా బాత్రూమ్ దగ్గరకు పరిగెత్తుతుంది. కానీ పొరపాటున టవల్తోపాటు భాగీని కూడా లోపలకు లాగుతాడు అమర్. భాగీ చెయ్యి తాకి షవర్ ఆన్ అవడంతో ఇద్దరూ తడిసిపోతారు.
భాగీని చంపడానికి మనోహరి సుపారీ
హడావిడిగా బయటకు వెళ్తున్న మనోహరిని చూసి ఇదెక్కడికో వెళ్తోంది దీని వెంటే వెళ్తే అసలేం చేస్తుందో తెలుసుకోవచ్చు అని కారెక్కుతుంది అరుంధతి. ఒకరికోసం ఒకరం ప్రాణం ఇచ్చుకునేంత ప్రేమ ఉందని తెలుసుకానీ ప్రాణం తీసేంత ధ్వేషం ఎందుకే? ఆయనతో నాకు రాసిపెట్టి ఉంటే నేనేం చేయగలనే.. ఇలా ఎందుకు చేశావు? ఎందుకు.. అని అరుస్తుంది అరుంధతి.
ఆ అరుపుతో ఉలిక్కిపడుతుంది మనోహరి. వెంటనే కార్లోంచి కిందపడిపోతుంది. అప్పుడే డ్రైవర్ అక్కడకు రావడంతో నన్ను నా కుటుంబానికి దూరం చేస్తావా అని అతనితో కలబడేందుకు ప్రయత్నిస్తుంది అరుంధతి. మనోహరి కార్లో నుంచి డబ్బు సూట్‌కేస్ తీసి ఇచ్చి నా అమర్‌కి నాకు మధ్యలో వచ్చిన భాగమతిని చంపెయ్ అని చెబుతుంది.
చేసిన పాపాలు చాలవన్నట్లు ఇంకా ఎన్ని పాపాలు చేస్తావే అంటుంది అరుంధతి. భాగమతిని తలుచుకుంటూ బాధపడతాడు రామ్మూర్తి. మంగళ ఫోన్ తీసుకుని భాగీకి వీడియోకాల్ చేస్తాడు. మనోహరి పట్టుదల గెలుస్తుందా? భాగీని చంపేందుకు మనోహరి ఏం ప్లాన్ చేయనుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు మే 29న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్