Balakrishna: బాలయ్య వాణిజ్య ప్రకటనలు చేయకపోవడానికి కారణమేంటి?
కేవలం డబ్బు కోసమే కాకుండా సినిమాపై మమకారంతో సినిమాలు చేస్తూ, అభిమానులను అలరిస్తున్నారు. కనీసం ఒక్క వాణిజ్య ప్రకటనలో కూడా నటించకపోవడమే ఇందుకు ఉదాహరణ. 100కు పైచిలుకు చిత్రాల్లో నటించిన బాలకృష్ణ ఇంతవరకు ఒక్క యాడ్ లో కూడా నటించలేదు. టాలివుడ్ స్టార్ హీరోలు ప్రతి ఒక్కరూ కనీసం రెండు ప్రకటనలైనా చేశారు. కానీ ఆయన మాత్రం ఒక్కదాంట్లోనూ నటించలేదు.
టాలివుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. వెండితెరపై బాలయ్య డైలాగులకు, యాక్షన్లకు ఫిదా అయిపోతారు. అందుకే సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన కూడా అభిమానుల గురించి పదే పదే ఆయన ప్రస్తావిస్తుంటారు. ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ సినిమాను మాత్రం వీడలేదు. తనదైన శైలిలో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. కేవలం డబ్బు కోసమే కాకుండా సినిమాపై మమకారంతో సినిమాలు చేస్తూ, అభిమానులను అలరిస్తున్నారు. కనీసం ఒక్క వాణిజ్య ప్రకటనలో కూడా నటించకపోవడమే ఇందుకు ఉదాహరణ. 100కు పైచిలుకు చిత్రాల్లో నటించిన బాలకృష్ణ ఇంతవరకు ఒక్క యాడ్ లో కూడా నటించలేదు. టాలివుడ్ స్టార్ హీరోలు ప్రతి ఒక్కరూ కనీసం రెండు ప్రకటనలైనా చేశారు. ఎన్నో కంపెనీలు, టీవీ ఛానళ్లు ఆయనకు ప్రకటల కోసం సంప్రదించిన సున్నితంగానే ఆయన తిరస్కరించారు. ఇందుకు గల కారణాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
వాణిజ్య ప్రకటనల్లో నటించడానికి కారణం తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావేనట. గత ఐదు దశాబ్దాలుగా తెలుగు అభిమానులు తమ కుటుంబం పట్ల ప్రేమ కురిపిస్తున్నారని, వారి ప్రేమను వాణిజ్యపరం చేసి సొమ్ము చేసుకోవాలని అనుకోవట్లేదని బాలకృష్ణ అన్నారు. కేవలం ప్రేక్షకులకు సినిమా ద్వారా వినోదాన్ని అందించడమే తన విధి అని, ఇందుకోసం ఎంతగానైనా కష్టపడతానని అన్నారు. జీవితాంతం తను సినిమాల్లోనే నటిస్తానని మనస్సులో మాట బయటకు చెప్పారు బాలకృష్ణ.
ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో అఖండ చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకులకు ముందుకు రానుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రమిది. దీంతో ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రగ్వా జైస్వాల్ కథానాయిక. శ్రీకాంత్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.