The Sabarmati Report OTT: ఓటీటీలోకి రాబోతున్న రాశీ ఖన్నా కొత్త మూవీ.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
Raashii Khanna: హీరోయిన్ రాశీఖన్నా, విక్రాంత్ మాస్సే జంటగా నటించిన ‘ది సబర్మతి రిపోర్ట్’పై ప్రధాని నరేంద్ర మోడీ రియాక్ట్ అవ్వడంతో.. ఈ సినిమాకి ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది.
హీరోయిన్ రాశీ ఖన్నా నటించిన ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీ గత శుక్రవారం (నవంబరు 15)న రిలీజై.. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహన ఘటన కథాంశంగా ఈ సినిమాను దర్శకుడు ధీరజ్ సర్నా తెరకెక్కించారు. ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా, రిధి డోగ్రా ప్రధాన పాత్రలు పోషించారు.
ప్రధాని రియాక్ట్‌తో రాజకీయ దుమారం
ది సబర్మతి రిపోర్ట్ సినిమాపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించారు. తప్పక చూడాల్సిన సినిమా అని మోడీ రియాక్ట్ అవ్వడంతో ఈ మూవీపై రాజకీయ దుమారం కూడా రేగింది. దాంతో అసలు ఈ సినిమాలో ఏముంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోయింది.గోద్రా పట్టణంలో అప్పట్లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు కొందరు నిప్పు పెట్టగా.. ఆ ఘటనలో 59 మంది ప్రయాణికులు మృతి చెందిన విషయం తెలిసిందే.
తొలి రోజు పేలవం.. ఆ తర్వాత క్లిక్
వాస్తవానికి రిలీజ్ రోజున ది సబర్మతి రిపోర్ట్ మూవీకి వచ్చిన కలెక్షన్లు రూ.1.15 కోట్లు మాత్రమే. కానీ.. పాజిటివ్ రివ్యూలు, రాజకీయ దుమారంతో ప్రచారం పెరిగి క్రమంగా కలెక్షన్లు పెరుగుతున్నాయి. దాంతో ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్ గట్టిగా పోటీపడ్డాయి. అయితే.. చివరికి మంచి ఫ్యాన్సీ రేటుకి జీ5 ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఓటీటీలోకి ఎప్పుడు?
ది సబర్మతి రిపోర్ట్ మూవీ బడ్జెట్ రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాను డిసెంబరు చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో జీ5 స్ట్రీమింగ్‌కి ఉంచబోతోంది.