Vishwak Sen: వివాదంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. తగ్గే కొద్దీ మింగుతారంటూ విశ్వక్ సేన్ వార్నింగ్-vishwak sen about gangs of godavari movie release date controversy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen: వివాదంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. తగ్గే కొద్దీ మింగుతారంటూ విశ్వక్ సేన్ వార్నింగ్

Vishwak Sen: వివాదంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. తగ్గే కొద్దీ మింగుతారంటూ విశ్వక్ సేన్ వార్నింగ్

Sanjiv Kumar HT Telugu
Oct 29, 2023 12:28 PM IST

Vishwak Sen On Gangs Of Godavari Release: ఏదైనా సరే దూకుడుగా మాట్లాడే హీరోల్లో విశ్వక్ సేన్ ముందుంటాడు. తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదల విషయంలో స్ట్రాంగ్ ధమ్కీ ఇచ్చాడు విశ్వక్ సేన్.

వివాదంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. తగ్గే కొద్దీ మింగుతారంటూ విశ్వక్ సేన్ వార్నింగ్
వివాదంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. తగ్గే కొద్దీ మింగుతారంటూ విశ్వక్ సేన్ వార్నింగ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇందులో విశ్వక్ సేన్‌కు హాట్ బ్యూటి నేహా శెట్టి హీరోయిన్‌గా జత కట్టింది. సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. గోదావరి బ్యాక్ డ్రాప్‌లో సాగే పొలిటికల్ విలేజ్ డ్రామాగా సినిమా ఉండనుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు మంచి ఆసక్తి పెంచాయి. ఇందులో హీరోయిన్ అంజలి కూడా కీలక పాత్ర పోషిస్తోంది.

ఇదిలా ఉంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని డిసెంబర్ 8న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అయితే తాజాగా ఈ విడుదల విషయంలో విశ్వక్ సేన్ ఫైర్ అయ్యాడు. "బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతీ నా కొడుకు మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు. నేను సినిమా చూడకుండా ప్రతి ఫ్రేమ్ ప్రాణం పెట్టి పని చేసి చెబుతున్నా.. డిసెంబర్ 8న వస్తున్నాం. హిట్, ప్లాప్, సూపర్ హిట్, అట్టర్ ప్లాప్ చేస్తారన్నది మీ ఇష్టం. అది మీ నిర్ణయం" అని విశ్వక్ సేన్ అన్నాడు.

ఇంకా విశ్వక్ సేన్ కొనసాగిస్తూ "ఆవేశానికి లేదా ఈగోకి తీసుకునే నిర్ణయం కాదు. తగ్గే కొద్దీ మింగుతారు అని అర్థమైంది. డిసెంబర్ 8న శివాలెత్తిపోద్ది. గంగమ్మ తల్లికి నా ఒట్టు.. మహాకాళి మాతో ఉంది. డిసెంబర్‌లో సినిమా రాకపోతే నేను ప్రమోషన్స్ లో కనిపించను. రాను.." అని ఫైర్ అవుతూ.. ఇన్ స్టా వేదికగా రాసుకొచ్చాడు. కాగా డిసెంబర్ 7, 8 తేదిల్లో హాయ్ నాన్న, ఎక్స్ ట్రార్డినరీ, ఆపరేషన్ వాలెంటైన్ వంటి సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాయిదా వేసేందుకు ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా విశ్వక్ సేన్ మాటలు చూస్తుంటే అర్థమవుతోంది. ఏమైందో తెలియదు గానీ, అనుకున్నట్లుగా డిసెంబర్‌లో సినిమా విడుదల కాకుండే ప్రమోషన్స్ కు రానని డైరెక్ట్ గానే ధమ్కీ ఇచ్చాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్.

Whats_app_banner

టాపిక్