Maharaja OTT: విజయ్ సేతుపతి 50వ సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు-vijay sethupathi 50th film maharaja gets ott partner is netflix and theatrical release date also revealed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Maharaja Ott: విజయ్ సేతుపతి 50వ సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు

Maharaja OTT: విజయ్ సేతుపతి 50వ సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 05, 2024 02:20 PM IST

Maharaja OTT: విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తున్న మహారాజ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. అప్పుడే ఈ సినిమా ఓటీటీ డీల్ జరిగింది. ఓటీటీ హక్కులను ఏ ప్లాట్‍ఫామ్ తీసుకుందో వెల్లడైంది.

Maharaja OTT: విజయ్ సేతుపతి 50వ సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు
Maharaja OTT: విజయ్ సేతుపతి 50వ సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు

Maharaja OTT: తమిళ స్టార్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా ‘మహారాజ’ మూవీ వస్తోంది. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో మహారాజపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. హీరోగా విజయ్ సేతుపతికి ఇది 50వ చిత్రంగా ఉంది. సపోర్టింగ్ పాత్రల్లో చాలా చిత్రాల్లో చేశారు. కాగా, మహారాజ చిత్రం థియేటర్లలో రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ జరిగింది.

ఈ ప్లాట్‍ఫామ్ చేతికి..

మహారాజ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేట్రికల్ డేట్ తెలిజేస్తూ తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. దీనిద్వారా ఓటీటీ పార్ట్‌నర్ నెట్‍ఫ్లిక్స్ అని తెలిసిపోయింది. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుంది.

థియేటర్లలోకి ఎప్పుడు..

మహారాజ సినిమా జూన్ 14వ తేదీన తమిళంలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం తెలుగులో కూడా రానుంది. తెలుగు ట్రైలర్ కూడా వచ్చింది. అయితే, తెలుగు రిలీజ్ గురించి మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి తెలుగులోనూ జూన్ 14నే వస్తుందేమో చూడాలి. త్వరలోనే ఈ విషయంపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మహారాజ ట్రైలర్లో విజయ్ సేతుపతి మేకోవర్ డిఫరెంట్‍గా, వైలెంట్‍గా ఉంది. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నాటీ, భారతీరాజా, అభిరామి, సింగంపులి, అరుల్‍దాస్, మునిష్‍కాంత్ కీలకపాత్రలు పోషించారు.

కురంగు బొమ్మై మూవీతో గుర్తింపు తెచ్చుకున్న నితిలన్ స్వామినాథన్ ఈ మహారాజ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్లపై సుధన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజ్మిష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.

ట్రైలర్ ఇలా..

మహారాజ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయింది. మరోసారి తన మార్క్ వైవిధ్యభరితమైన నటనతో విజయ్ సేతుపతి అదరగొట్టారు. ఈ చిత్రంలో విజయ్ ఓ సెలూష్ షాప్ నడుపుతుంటారు. తన పేరు మహారాజ అని.. తన ఇంట్లో ఉన్న లక్ష్మిని దొంగలించారంటూ పోలీస్ స్టేషన్‍కు విజయ్ సేతుపతి వెళ్లడంతో ఈ ట్రైలర్ మొదలైంది. అయితే, లక్ష్మి ఏంటనేది మాత్రం ట్రైలర్లో సస్పెన్స్‌గానే ఉంది. లక్ష్మి అంటే నగలా.. డబ్బా.. డాక్యుమెంట్సా అని అడిగితే అలాంటివేం కాదని మహారాజా (విజయ్ సేతుపతి) చెబుతారు. ఏం చెప్పినా చేతులతో సైగలు చేస్తూ లక్ష్మి అని అంటుంటారు. పోలీసులు కూడా అదేంటో తెలియక కన్‍ఫ్యూజ్ అవుతుంటారు. ఆ తర్వాత ట్రైలర్ యాక్షన్ థ్రిల్లర్‌ మోడ్‍లోకి వెళుతుంది. అసలు లక్ష్మి ఏంటి.. మహారాజా ఇంట్లో ఏం జరిగింది అనేదే ఈ సినిమాలో ముఖ్యమైన అంశంగా అర్థమవుతోంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక మహారాజా మూవీపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.

ఇక, విజయ్ సేతుపతి ప్రస్తుతం విడుదలై పార్ట్ 2 మూవీలోనూ నటిస్తున్నారు. వెట్రిమారన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. 2021లో వచ్చిన విడుదలైకు సీక్వెల్‍గా ఈ చిత్రం వస్తోంది. విడుదలై పార్ట్ 2 రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు.

Whats_app_banner