Hbd Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ‌...అప్పుడు ఫ్రీ గా న‌టించాడు - ఇప్పుడు ఇర‌వై ఐదు కోట్లు తీసుకుంటున్నాడు-vijay deverakonda remuneration for movies and brand endorsements ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hbd Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ‌...అప్పుడు ఫ్రీ గా న‌టించాడు - ఇప్పుడు ఇర‌వై ఐదు కోట్లు తీసుకుంటున్నాడు

Hbd Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ‌...అప్పుడు ఫ్రీ గా న‌టించాడు - ఇప్పుడు ఇర‌వై ఐదు కోట్లు తీసుకుంటున్నాడు

HT Telugu Desk HT Telugu
May 09, 2023 09:23 AM IST

Hbd Vijay Deverakonda: ఫ‌స్ట్ సినిమా నువ్విలాలో ఫ్రీగా న‌టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడో తెలుసా...

విజ‌య్ దేవ‌ర‌కొండ
విజ‌య్ దేవ‌ర‌కొండ

Hbd Vijay Deverakonda: పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి సినిమాల‌తో టాలీవుడ్‌లో ట్రెండ్‌సెట్ట‌ర్‌గా నిలిచాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌కు ముందు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ పేరు టాలీవుడ్ లో ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. ర‌విబాబు నువ్విలాతో పాటు శేఖ‌ర్ క‌మ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాల్లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన చిన్న పాత్ర‌ల్లో న‌టించాడు. వీటిలో విజ‌య్ పారితోషికం లేకుండానే ఉచితంగా న‌టించాడు. ఆ స‌మ‌యంలో తాను స్క్రీన్‌పై క‌నిపిస్తే చాలు అనే కోరిక విజ‌య్‌లో ఉండేది. ఆ కోరిక‌తోనే ఫ్రీగా సినిమాలు చేశాడు. ఆ త‌ర్వాత ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణం సినిమాతో విజ‌య్‌కి ఫ‌స్ట్ బ్రేక్ వ‌చ్చింది.

సినిమాల్లోకి రాక‌ముందు నుంచి డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్, విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ధ్య మంచి స్నేహం ఉంది.ఆ ఫ్రెండ్‌షిప్ కార‌ణంగానే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌తో పాటు ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాల్లో విజ‌య్‌కి అవ‌కాశాలు వ‌చ్చాయి. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం హిట్టైనా విజ‌య్ కెరీర్ మాత్రం స్పీడు అందుకోలేదు.దాంతో గుంపులో గోవింద లాంటి క్యారెక్ట‌ర్స్ కాకుండా సోలో హీరోగా సినిమా చేయాల‌ని ఫిక్సైన విజ‌య్ దేవ‌ర‌కొండ తానే ఓ డైరెక్ట‌ర్‌ను వెతుక్కున్నాడు.

ఆ డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు త‌రుణ్ భాస్క‌ర్‌. విజ‌య్‌, త‌రుణ్ భాస్క‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పెళ్లిచూపులు విజ‌య్ కెరీర్‌లో ఫ‌స్ట్ సోలో హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం విజ‌య్ ఐదు ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడు. ఆ త‌ర్వాత సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ అర్జున్ రెడ్డి సినిమాలో విజ‌య్ డిఫ‌రెంట్ ఆటిట్యూడ్‌, హీరోయిజానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

ఈ సినిమాతో యూత్‌లో అత‌డికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ సినిమాకు కూడా తాను ఐదు ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ మాత్ర‌మే అందుకున్న‌ట్లు గ‌తంలో విజ‌య్ దేవ‌ర‌కొండ తెలిపాడు.

లైగర్ కోసం ఇర‌వై ఐదు కోట్లు...

గీత గోవిందం 100 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డంతో విజ‌య్ స్టామినా ఏమిట‌న్న‌ది టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు అర్థ‌మైంది. దాంతో అత‌డితో సినిమాలు చేసేందుకు స్టార్ డైరెక్ట‌ర్స్ రెడీ అయ్యారు. డిమాండ్ కు అనుగుణంగానే విజ‌య్ కూడా ప్ర‌తి సినిమాకు త‌న రెమ్యున‌రేష‌న్ పెంచుకుంటూ వ‌చ్చిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ఇటీవ‌ల రిలీజైన లైగ‌ర్ సినిమాకు విజ‌య్ 25 కోట్ల‌కుపైగా పారితోషికం స్వీక‌రించిన‌ట్లు స‌మాచారం.ప్రజెంట్ చేస్తోన్న సినిమాల కోసం 25 కోట్లకుపైనే విజయ్ రెమ్యునరేషన్ అందుకున్నట్లు చెబుతోన్నారు.

ప్ర‌స్తుతం ప‌లు బ్రాండ్స్‌కు ప్ర‌చార క‌ర్త‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. ఒక్కో బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ కోటి నుంచి మూడు కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ స్వీక‌రిస్తోన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌జెంట్ విజ‌య్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఖుషి సెట్స్‌పై ఉండ‌గా గౌత‌మ్ తిన్న‌నూరితో చేస్తోన్న సినిమా ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ప‌ర‌శురామ్‌, సుకుమార్‌తో పాటు మ‌రో సినిమా కూడా చేయ‌బోతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

Whats_app_banner