Liger Trp Rating: లైగ‌ర్ టీఆర్‌పీ రేటింగ్ - ప్ర‌భాస్‌, మ‌హేష్ సినిమాల‌ను దాటేసింది-vijay deverakonda liger first premiere trp rating
Telugu News  /  Entertainment  /  Vijay Deverakonda Liger First Premiere Trp Rating
విజ‌య్ దేవ‌ర‌కొండ
విజ‌య్ దేవ‌ర‌కొండ

Liger Trp Rating: లైగ‌ర్ టీఆర్‌పీ రేటింగ్ - ప్ర‌భాస్‌, మ‌హేష్ సినిమాల‌ను దాటేసింది

27 December 2022, 8:35 ISTNelki Naresh Kumar
27 December 2022, 8:35 IST

Liger Trp Rating: విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన లైగ‌ర్ సినిమా ఇటీవ‌ల బుల్లితెర ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఫ‌స్ట్ టైమ్ ప్రీమియ‌ర్‌కు వ‌చ్చిన టీఆర్‌పీ రేటింగ్ ఎంతంటే...

Liger Trp Rating: విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లైగ‌ర్ ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైంది. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా మిగిలింది. పూరి జ‌గ‌న్నాథ్ రాసుకున్న క‌థ‌, విజ‌య్ దేవ‌ర‌కొండ క్యారెక్ట‌రైజేష‌న్‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో ఈ సినిమా ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది.

నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చింది. ఈ సినిమా ఇటీవ‌ల బుల్లితెర‌పై స్టార్‌మాలో ప్రీమియ‌ర్ అయ్యింది. ఫ‌స్ట్‌టైమ్ ప్రీమియ‌ర్‌కు 6.68 టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది. బుల్లితెర‌పై కూడా ఈ సినిమా మోస్తారు ఆద‌ర‌ణ‌ను సొంతం చేసుకున్న‌ది.

తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో లోయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో రిలీజై ఫ్లాప్ అయిన సినిమాల్లో సాహో 5.8 టీఆర్‌పీ, అజ్ఞాతవాసి 6.1, మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ 6.7 టీఆర్‌పీ రేటింగ్స్ ద‌క్కించుకున్నాయి. వాటి త‌ర్వాత లైగ‌ర్ నిలిచింది.

మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో లైగ‌ర్ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించారు. అన‌న్యా పాండే హీరోయిన్‌గా న‌టించింది. పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మిల‌తో క‌లిసి బాలీవుడ్ అగ్ర నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించారు. హిందీలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క్రేజ్ కార‌ణంగా అత్య‌ధిక థియేట‌ర్ల‌లో ఈ సినిమా విడుద‌లైంది. కానీ అక్క‌డ కూడా విజ‌య్‌కినిరాశే మిగిలింది.