Family Star: క్రేజీ గాసిప్‌....ర‌ష్మిక మంద‌న్న‌ బ‌ర్త్‌డే రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యామిలీ స్టార్ రిలీజ్‌-vijay deverakonda family star releasing in theaters on rashmika mandanna birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Family Star: క్రేజీ గాసిప్‌....ర‌ష్మిక మంద‌న్న‌ బ‌ర్త్‌డే రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యామిలీ స్టార్ రిలీజ్‌

Family Star: క్రేజీ గాసిప్‌....ర‌ష్మిక మంద‌న్న‌ బ‌ర్త్‌డే రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యామిలీ స్టార్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 25, 2024 08:00 AM IST

Family Star: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే రోజు ర‌ష్మిక మంద‌న్న బ‌ర్త్‌డే కావ‌డం టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న

Family Star: విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తోన్న ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్‌కు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఏప్రిల్ 5న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన ఎన్టీఆర్ దేవ‌ర మూవీ పోస్ట్‌పోన్ కానున్న‌ట్లు స‌మాచారం.

దేవ‌ర‌లో విల‌న్‌గా న‌టిస్తోన్న సైఫ్ అలీఖాన్ షూటింగ్‌లో గాయ‌ప‌డ‌టం, పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కానుండ‌టంతో ఏప్రిల్ 5న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ రిలీజ్ కావ‌డం అనుమాన‌మేన‌ని టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఒక‌వేళ దేవ‌ర పోస్ట్‌పోన్ అయితే అదే డేట్ రోజు ఫ్యామిలీస్టార్‌ను రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఉన్న‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే ఫ్యామిలీ స్టార్ రిలీజ్‌పై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

ఏప్రిల్ 5 ర‌ష్మిక బ‌ర్త్‌డే...

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న ప్రేమ‌లో ఉన్న‌ట్లు చాలా కాలంగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే విజ‌య్‌, ర‌ష్మిక ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రుగ‌నున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. ఈ పుకార్ల‌ను విజ‌య్ టీమ్ కొట్టిప‌డేసింది. మ‌రోవైపు ఫ్యామిలీ స్టార్ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

ఆమె క్యారెక్ట‌ర్ స‌ర్‌ప్రైజింగ్‌గా ఉండాల‌నే మేక‌ర్స్ రివీల్ చేయ‌డం లేద‌ని స‌మాచారం. కాగా ఏప్రిల్ ఐదు ర‌ష్మిక మంద‌న్న బ‌ర్త్‌డే. అదే రోజు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కానుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. విజ‌య్‌, ర‌ష్మిక జంట‌కు ఉన్న క్రేజ్ కూడా ఈ రిలీజ్ డేట్‌కు క‌లిసివ‌చ్చేలా ఉంద‌ని, అందుకే ఆ డేట్‌నే ఫిక్స్ చేయాల‌నే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

గీత‌గోవిందం త‌ర్వాత‌...

గీత గోవిందం బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో ఫ్యామిలీ స్టార్ మూవీ రూపొందుతోంది. గీత‌గోవిందం 100 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించ‌డంతో ఫ్యామిలీస్టార్‌పై అంచ‌నాలు భారీగా నెల‌కొన్నాయి. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు త‌న‌దైన కామెడీ అంశాల‌ను జోడిస్తూ ప‌ర‌శురామ్ ఈ మూవీని తెర‌కెక్కిస్తోన్నారు.

ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ న‌టిస్తోంది. ఫ్యామిలీ స్టార్ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తొలుత సంక్రాంతికి ఫ్యామిలీ స్టార్‌ను రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ షూటింగ్ కంప్లీట్ కాక‌పోవ‌డం, సంక్రాంతి పోటీ ఎక్కువ‌గా ఉండ‌టంతో రిలీజ్ విష‌యంలో వెన‌క్కి త‌గ్గారు

గౌత‌మ్ తిన్న‌నూరి మూవీ...

గీత గోవిందం త‌ర్వాత విజ‌య్‌కి స‌రైన క‌మ‌ర్షియ‌ల్ హిట్టు లేదు. గ‌త ఏడాది రిలీజైన ఖుషి యావ‌రేజ్ రిజ‌ల్ట్‌ను సొంతం చేసుకున్న‌ది. దాందో ఫ్యామిలీ స్టార్ రిజ‌ల్ట్ అత‌డి కెరీర్‌కు కీల‌కంగా మారింది. .

ఫ్యామిలీ స్టార్ త‌ర్వాత గౌత‌మ్ తిన్న‌నూరితో ఓ స్పై యాక్ష‌న్ మూవీ చేయ‌నున్నాడు విజ‌య్‌. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించ‌నున్న ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్‌లో మొద‌లుకానుంది. ఈ సినిమాలో తొలుత శ్రీలీల‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. డేట్స్ అడ్జెస్ట్ కాలేక‌పోవ‌డంతో శ్రీలీల త‌ప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమె స్థానాన్ని ర‌ష్మిక మంద‌న్న భ‌ర్తీ చేసిన‌ట్లు చెబుతోన్నారు.

IPL_Entry_Point