Kushi | ఖుషీ మూవీ రెండో షెడ్యూల్‌కు విజయ్‌ దేవరకొండ రెడీ-vijay devarakonda to start second schedule of kushi from june 5th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kushi | ఖుషీ మూవీ రెండో షెడ్యూల్‌కు విజయ్‌ దేవరకొండ రెడీ

Kushi | ఖుషీ మూవీ రెండో షెడ్యూల్‌కు విజయ్‌ దేవరకొండ రెడీ

HT Telugu Desk HT Telugu
May 31, 2022 07:34 PM IST

అప్పుడెప్పుడో 21 ఏళ్ల కిందట వచ్చిన పవన్‌ కల్యాణ్‌ మూవీ టైటిల్‌ ఖుషీతోనే ఇప్పుడు విజయ్‌ దేవరకొండ కూడా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్‌ సరసన సమంత నటిస్తోంది.

విజయ్ దేవరకొండ, సమంత
విజయ్ దేవరకొండ, సమంత (twitter)

ఈ మధ్యే ఖుషీ ఫస్ట్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నాడు విజయ్‌ దేవరకొండ. ఆ షెడ్యూల్‌ కశ్మీర్‌లో జరిగింది. విజయ్‌తోపాటు సమంత కూడా ఈ షెడ్యూల్‌లో షూట్‌ చేసింది. ఈ ఫస్ట్‌ షెడ్యూల్‌ ముగిసిన తర్వాత విజయ్‌ ముంబై ట్రిప్‌కు వెళ్లాడు. అయితే ఇప్పుడు అతడు రెండో షెడ్యూల్‌కు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పింక్‌విల్లా ప్రకారం జూన్‌ 5 నుంచి ఈ మూవీ సెకండ్‌ షెడ్యూల్‌ ప్రారంభం కానుంది.

మొదట విజయ్‌ దేవరకొండ ఈ షెడ్యూల్‌లో పాల్గొననుండగా.. సమంత కొన్ని రోజుల తర్వాత టీమ్‌తో చేరనుంది. "విజయ్‌ దేవరకొండ జూన్‌ 5 నుంచి రెండో షెడ్యూల్‌ షూటింగ్‌కు రానున్నాడు. ఇది మూడు వారాల షెడ్యూల్. హైదరాబాద్‌తోపాటు వైజాగ్‌, అలెప్పీలలో ఈ షూటింగ్‌ జరగనుంది. ఇందులో కొన్ని కీలకమైన సీన్స్‌ను షూట్‌ చేయనున్నారు. సమంత ఈ జూన్‌ 8 నుంచి ఈ షెడ్యూల్‌లో చేరుతుంది" అని పింక్‌విల్లా తన రిపోర్ట్‌లో వెల్లడించింది.

మెట్రో స్టేషన్‌, చర్చ్‌, మ్యారేజ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌, హాస్పిటల్‌ సెట్స్‌లో కొన్ని సీన్లను షూట్‌ చేయనున్నట్లు కూడా తెలిపింది. ఖుషీ మూవీ షూటింగ్‌ పూర్తయిన తర్వాత పూరీ జగన్నాథ్‌ జన గణ మన మూవీ షూటింగ్‌ మొదలుపెట్టనున్నాడు విజయ్‌ దేవరకొండ. ఈ మూవీ ఫస్ట్‌ షెడ్యూల్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఆగస్ట్‌లో మూవీ రిలీజ్‌ అవుతుంది.

ఇక ఖుషీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్యే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో విజయ్‌, సమంత మధ్య లిప్‌లాక్‌ సీన్‌ కూడా ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 23న రిలీజ్‌ కానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం