vijay- samantha |విజయ్ దేవరకొండ- సమంత... ఛలో కశ్మీర్-vijay devarakonda samantha new movie goes on floors ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay- Samantha |విజయ్ దేవరకొండ- సమంత... ఛలో కశ్మీర్

vijay- samantha |విజయ్ దేవరకొండ- సమంత... ఛలో కశ్మీర్

Nelki Naresh HT Telugu
Apr 21, 2022 02:57 PM IST

విజ‌య్ దేవ‌ర‌కొండ‌,స‌మంత జంట‌గా శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న తాజా చిత్రం గురువారం హైద‌రాబాద్‌లో మొద‌లైంది. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొంద‌నున్న‌ది.

విజయ్ దేవరకొండపై క్లాప్ నిస్తున్న దర్శకుడు హరీష్ శంకర్
విజయ్ దేవరకొండపై క్లాప్ నిస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ (twitter)

అల‌నాటి మేటి న‌టి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన మ‌హాన‌టి చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌,స‌మంత తొలిసారి జంట‌గా న‌టించారు. సావిత్రి జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చే జ‌ర్న‌లిస్ట్‌లుగా త‌మ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. దాదాపు నాలుగేళ్ల విరామం త‌ర్వాత‌ మ‌రోసారి ఈ జోడి వెండితెర‌పై క‌నువిందుచేయ‌బోతున్న‌ది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌,స‌మంత‌ క‌ల‌యిక‌లో ఓ ప్రేమ‌క‌థా చిత్రం తెర‌కెక్కుతోంది. నిన్నుకోరి,మ‌జిలీ ఫేమ్ శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం గురువారం హైద‌రాబాద్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది.

మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ల‌వ్ స్టోరీ ఇద‌ని సమాచారం. ఈ నెల‌లోనే క‌శ్మీర్ లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌బోతున్నారు.విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న 11వ చిత్ర‌మిది. డియ‌ర్ కామ్రేడ్ త‌ర్వాత మ‌రోసారి మైత్రీ మూవీ మేక‌ర్స్ తో విజ‌య్ ఈ సినిమా చేస్తున్నారు.

మ‌ల‌యాళంలో మ్యూజిక‌ల్‌గాపెద్ద హిట్ అయిన హృద‌యం సినిమా ఫేమ్ హిషామ్ అబ్దుల్ వ‌హాబ్ ఈ ల‌వ్ స్టోరీతో సంగీత ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం కాబోతున్నారు. మ‌ల‌యాళ న‌టుడు జ‌య‌రామ్ తో పాటు స‌చిన్ ఖేడ్క‌ర్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. గురువారం ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్‌కు స‌మంత హాజ‌రుకాలేదు.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్