Vidya Vasula Aham Motion Poster: ఇంట్రెస్టింగ్‌గా శివాని రాజశేఖర్ మూవీ మోషన్ పోస్టర్
Vidya Vasula Aham Motion Poster: టాలీవుడ్ హీరో రాజశేఖర్ కూతురు శివాని నటిస్తున్న విద్య వాసుల అహం మూవీ మోషన్ పోస్టర్‌ను వినాయక చవితి సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
Vidya Vasula Aham Motion Poster: విద్య వాసుల అహం.. ఈ టైటిల్‌లో నుంచే వివాహం అనే పదాన్ని హైలైట్ చేస్తూ శివానీ రాజశేఖర్ నటించిన మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టైటిలే చాలా వెరైటీగా ఉంది కదూ. అయితే తాజాగా వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
ఈ పోస్టర్‌లో వివాహం గురించి చెబుతూ.. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆడ, మగలను సృష్టించి, వాళ్లను భూమి మీదికి పంపించి.. వివాహంతో ఒక్కటయ్యేలా చేశారని చెబుతూ.. ఈ వివాహంలోనూ కలతలు రావడానికి కారణం అహం అని కాస్త ఫన్నీగా చెప్పే ప్రయత్నం చేశారు. మహాభారత యుద్ధమైనా, రావణ సంహారమైనా, బాహుబలి, భల్లాలదేవుని ఫైట్ అయినా.. అంతా ఒకరి అహం వల్లే అంటూ మరింత ఫన్‌ను ఇందులో జోడించారు.
విద్య, వాసు అనే ఇద్దరు వివాహంతో ఏకమై వారి మధ్య అహం ఎలాంటి విభేదాలకు కారణమైందో సరదాగా చెప్పే కథే ఈ విద్య వాసుల అహం మూవీ. ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ అయిన విషయాన్ని చెబుతూ శివానీ రాజశేఖర్ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. "అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విద్య వాసుల అహం వివాహం పరిచయం చేస్తున్నాం. అదండీ మేటరూ.. ఇదో పెద్ద ఇగో స్టోరీ. ఈ వివాహం కోసం చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. మోషన్ పోస్టర్ ఇదీ" అని క్యాప్షన్ రాసింది.
ఈ మూవీలో కుడి ఎడమైతే వెబ్ సిరీస్ ఫేమ్ రాహుల్ విజయ్ సరసన శివానీ రాజశేఖర్ నటిస్తోంది. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. మణికాంత్ గెల్లి ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. కల్యాణీ మాలిక్ మ్యూజిక్ అందించాడు. షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.