OTT: ఓటీటీలో అదరగొడుతున్న వెన్నెల కిశోర్ చిత్రం.. ఇప్పటి వరకు ఎన్ని వ్యూస్ అంటే..
Chaari 111 OTT Streaming: చారి 111 సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో దుమ్మురేపుతోంది. థియేటర్లలో అంచనాలను అందుకోని ఈ చిత్రం ఓటీటీలో మాత్రం దూసుకెళుతోంది. ఆ వివరాలివే..
Chaari 111 OTT: ‘చారి 111’ చిత్రంతో స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా మారారు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన ఆ చిత్రం మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. స్పై కామెడీ థ్రిల్లర్‌గా చారి 111 మూవీని దర్శకుడు టీజీ కీర్తికుమార్ తెరకెక్కించారు. ఈ మూవీలో వెన్నెల కిశోర్ తన మార్క్ యాక్టింగ్‍తో అదరగొట్టారు. అయితే, ప్రమోషన్లను కూడా సరిగా చేయకపోవటంతో థియేటర్లలో ఆశించిన స్థాయిలో చారి 111 కలెక్షన్లను రాబట్టలేకపోయింది. అయితే, ఓటీటీలో మాత్రం సత్తాచాటుతోంది.
ఓటీటీలో దూకుడు
చారి 111 సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఏప్రిల్ 5వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. సడెన్‍గా ఓటీటీలో అడుగుపెట్టింది. ఆరంభం నుంచే ఈ మూవీకి మంచి వ్యూస్ దక్కుతున్నాయి. తాజాగా ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ 60 మిలియన్ వ్యూయింగ్ నిమిషాలను దాటేసింది. ఈ విషయాన్నిమూవీ టీమ్ వెల్లడించింది.
రెండు వారాలుగా టాప్-10లో ట్రెండింగ్
చారి 111 సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆరంభం నుంచి అదరగొడుతోంది. దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇండియా టాప్-10లో ఈ చిత్రం రెండు వారాలుగా ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు 60 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కూడా దాటేసింది. అంతగా బజ్ లేని తక్కువ బడ్జెట్ మూవీ ఒకే భాషలో వచ్చి ఓటీటీలో ఈ రేంజ్‍లో వ్యూస్ దక్కించుకోవడం విశేషంగా ఉంది.
చారి 111 చిత్రంలో వెన్నెల కిశోర్‌తో పాటు సంయుక్త విశ్వనాథన్, మురళీ శర్మ, పావని రెడ్డి, సత్య, తాగుబోతు రమేశ్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు. డైరెక్టర్ టీజీ కీర్తికుమార్ ఈ మూవీని తెరకెక్కించారు. బర్కత్ స్టూడియోస్ పతాకంపై ఆదిత్య సోనీ ఈ మూవీని నిర్మించారు. సిమన్ కే కింగ్ సంగీతం అందించారు.
చారి 111 మూవీ స్టోరీ బ్యాక్‍డ్రాప్
రుద్రనేత్ర సీక్రెట్ ఏజెన్సీని స్థాపించాలని మేజర్ మనోజ్ ప్రసాద్ రావు (మురళీ శర్మ)ను ముఖ్యమంత్రి (శుభలేఖ సుధాకర్) ఆదేశిస్తారు. ఈ ఏజెన్సీ ఎలాంటి నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదని చెబుతారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‍లో ఓ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దీంతో ఈ కేసును సీక్రెట్ ఏజెంట్ చారి (వెన్నెల కిశోర్)కి అప్పగిస్తారు. ఉగ్రవాదులను పట్టుకునే బాధ్యతను ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది.. చారి ఎలా దర్యాప్తు చేశాడు.. ఉగ్రవాదులను పట్టుకున్నాడా అనేదే చారి 111 మూవీలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
చారి 111 చిత్రానికి సీక్వెల్ కూడా తీసుకొస్తామని దర్శకుడు టీజీ కీర్తికుమార్ ఇటీవల చెప్పారు. దీన్ని యూనివర్స్‌లా చేస్తామన్నారు. అయితే, చారి 111 థియేటర్లలో వర్కౌట్ కాకపోవటంతో సీక్వెల్ తీసుకొస్తారా.. లేదా అనేది చూడాలి.
మరోవైపు, కమెడియన్‍గా ఫుల్ బిజీగా ఉన్న వెన్నెల కిశోర్.. చారి 111 సినిమా ప్రమోషన్లలో అసలు పాల్గొనలేదు. కనీసం ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు కూడా రాలేదు. దీంతో ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే, తాను ఉన్న బిజీ వల్ల ప్రమోషన్లలో పాల్గొనలేనని కూడా వెన్నెల కిశోర్ చెప్పారు.
టాపిక్