Saindhav OTT: ఓటీటీలోకి వెంకటేష్ సైంధవ్.. రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎందులో అంటే?-venkatesh saindhav ott release date confirmed on amazon prime ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saindhav Ott: ఓటీటీలోకి వెంకటేష్ సైంధవ్.. రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Saindhav OTT: ఓటీటీలోకి వెంకటేష్ సైంధవ్.. రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 26, 2024 09:02 AM IST

Saindhav OTT Release Date: విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో 75వ సినిమాగా వచ్చింది సైందవ్. హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన సైంధవ్ మూవీ త్వరలో ఓటీటీలోకి రానుంది. దీనికి సంబంధించిన ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఓటీటీలోకి వెంకటేష్ సైంధవ్.. రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎందులో అంటే?
ఓటీటీలోకి వెంకటేష్ సైంధవ్.. రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Saindhav OTT Streaming: దగ్గుబాటి వెంకటేష్ నటించిన మూవీ సైంధవ్. ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లో 75వ మూవీగా వచ్చింది. ఈ యాక్షన్ పాన్ ఇండియా మూవీ సైంధవ్‌ను ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించారు. సైంధవ్ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజులకు వెంకటేష్ సోలో హీరోగా కనిపించడంతో ఆయన అభిమానులు ఎంతో ఆసక్తి చూపించారు సైంధవ్ మువీపై. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి కానుకగా సైంధవ్ మూవీ థియేటర్లలో విడుదలైంది.

ఓటీటీ రిలీజ్ డేట్

జనవరి 13న తెలగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషషల్లో సైంధవ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్, నాగార్జున నా సామిరంగ చిత్రాలకు పోటీగా సంక్రాంతి బరిలోకి దిగింది వెంకటేష్ సైంధవ్. తాజాగా సైంధవ్ మూవీ ఓటీటీ రైట్స్, రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెగ వార్తలు వస్తున్నాయి. తాజాగా సైంధవ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని పలు వెబ్ సైట్స్ వార్తలు రాస్తున్నాయి.

భారీ వ్యయం చెల్లించి

సైంధవ్ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందన్న న్యూస్ ఇదివరకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సైంధవ్ మూవీ ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్ముడుపోయాయనేది హాట్ టాపిక్‌గా మారింది. సైంధవ్ మూవీ ఓటీటీ హక్కులను 1.8 మిలియన్ డాలర్ల భారీ వ్యయం చెల్లించి అమెజాన్ దక్కించుకుందని లేటెస్ట్‌గా వినిపిస్తున్న టాక్. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 15 కోట్లు. సైంధవ్ మూవీ ఓటీటీ రైట్స్ 15 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం.

నెల రోజులకు

ఇక సైంధవ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఫిక్స్ అయినట్లు టాక్ వస్తోంది. వచ్చే నెల మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 9న అమెజాన్ ప్రైమ్‌లో సైంధవ్ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారట. ఇదే సైంధవ్ ఓటీటీ రిలీజ్ డేట్ అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. థియేట్రికల్ రన్ అయిన నెల రోజులకు సైంధవ్ ఓటీటీలో అలరించనుందని తెలుస్తోంది. కాగా అమెజాన్ ప్రైమ్ మాత్రమే కాకుండా ఈటీవీ విన్ కూడా సైంధవ్ ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసిందని మరో టాక్ వినిపిస్తోంది.

మరో ఓటీటీలో

ఈటీవీ విన్‌లో మాత్రం థియేట్రికల్ రన్ తర్వాత 45 రోజులకు సైంధవ్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని వినికిడి. ఇదిలా ఉంటే సైంధవ్ మూవీలో భారీ తారాగణం నటించింది. సైంధవ్ మూవీలో విలన్‌గా బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించారు. ఆయనతోపాటు తమిళ హీరో ఆర్య, ఆండ్రియా జెరెమియా, హీరోయిన్ రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్, జిషు సేన్‌గుప్తా, ముకేష్ రిషి, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. సైంధవ్ మూవీకి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. కాగా సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు.

భిన్నాభిప్రాయాలు

కాగా థియేటర్లలో విడుదలైన సైంధవ్ మూవీకి ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. సైంధవ్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పిన అభిమానులు అన్ని రకాల ఎమోషన్లతోపాటు యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని అంటున్నారు. ఇక సెకండాఫ్ ఫైటింగ్ సీన్స్ అయితే ఎక్సలెంట్ అని చెబుతున్నారు ఫ్యాన్స్. మరికొంతమంది సినిమా కాస్తా స్లో నేరేషన్‌తో ఉందని, కొన్ని బ్లాక్స్‌ మరింత ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కిస్తే బాగుండేదని అంటున్నారు.

IPL_Entry_Point