Venkatesh: చిరంజీవి లేకుంటే హిమాలయాలకు వెళ్లిపోయేవాన్ని.. వెంకటేష్ షాకింగ్ కామెంట్స్-venkatesh about chiranjeevi and himalayas at venky 75 saindhav event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Venkatesh: చిరంజీవి లేకుంటే హిమాలయాలకు వెళ్లిపోయేవాన్ని.. వెంకటేష్ షాకింగ్ కామెంట్స్

Venkatesh: చిరంజీవి లేకుంటే హిమాలయాలకు వెళ్లిపోయేవాన్ని.. వెంకటేష్ షాకింగ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Dec 28, 2023 11:00 AM IST

Venkatesh About Chiranjeevi: వెంకీ 75 సెలబ్రేషన్స్ ఈవెంట్‌లో చిరంజీవి లేకుంటే సినిమాలు వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోయేవాన్ని అన్న అర్థంలో హీరో వెంకటేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంకా ఆయన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

చిరంజీవి లేకుంటే హిమాలయాలకు వెళ్లిపోయేవాన్ని.. వెంకటేష్ షాకింగ్ కామెంట్స్
చిరంజీవి లేకుంటే హిమాలయాలకు వెళ్లిపోయేవాన్ని.. వెంకటేష్ షాకింగ్ కామెంట్స్

Venkatesh Himalayas: విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన సినిమా సైంధవ్. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జేఈర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వెంకీ 75 కలియుగ పాండవులు టు సైంధవ్ పేరుతో స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవి చీఫ్ గెస్టుగా విచ్చేయగా.. నాని, ఆండ్రియా, రుహానీ శర్మ, డైరెక్టర్ శైలేష్ కొలనుతోపాటు పలువురు తారలు సందడి చేశారు.

అభిమానుల ప్రేమతోనే

వెంకీ 75 కార్యక్రమంలో తన మొదటి సినిమా కలియుగ పాండవులు గురించి చెబుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు వెంకటేష్. "గురువు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన కలియుగ పాండవులు చిత్రంతో నా ప్రయాణం మొదలైంది. దాసరి నారాయణరావు, కె విశ్వనాథ్ పలువురు అగ్ర దర్శకులతో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభవం. అభిమానుల ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేశాను" అని వెంకటేష్ తెలిపారు.

పిలుపు మారినా

"జయాపజయాల్ని చూడకుండా నేను చేసిన విభిన్న చిత్రాలను గమనించి ప్రోత్సహించారు. మొదట్లో విక్టరీ అనేవారు. తర్వాత రాజా అని పిలిచేవారు. కొన్నాళ్లు పెళ్లికాని ప్రసాద్ అన్నారు. తర్వాత పెద్దోడు, వెంకీ మామ అన్నారు. ఇలా పిలుపు మారినా ప్రేమ మాత్రం తగ్గలేదు. అందుకే ఎప్పటికప్పుడు మరింత ఉత్సాహంగా పని చేస్తున్నాను" అని వెంకటేష్ అన్నారు.

ఎనర్జీ ఇచ్చేవారు

"చాలాసార్లు సినీ కెరీర్‌ను వదిలి పెట్టి వెళ్లిపోదాం అనుకునేవాణ్ని. అంతలోనే చిరంజీవి వచ్చి ఓ బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చేవారు. నాతోటి హీరోలైనా బాలకృష్ణ, నాగార్జున వీళ్లంతా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవారు. అందుకే హిమాలయాలకు వెళ్లకుండా సినిమాలు కొనసాగించాను" అని చిరంజీవి హిట్ ఇవ్వకుండా హిమాలయాలకు వెళ్లేవాన్ని అనే అర్థంలో వెంకటేష్ చెప్పుకొచ్చారు.

చిరంజీవితో సినిమా

"నా 75వ చిత్రం సైంధవ్ గొప్ప మూవీ అవుతుంది. జనవరి 13న అందరినీ కలుస్తుంది. కృషి, పట్టుదల, నిలకడతోనే విజయాలు సాధ్యం అవుతాయి. ఎక్కువ హైరానా పడకుండా సహజంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఏదైనా రావాల్సిన సమయంలోనే వస్తుంది. చిరంజీవితో కలిసి త్వరలోనే మూవీ చేస్తా" అని మల్టీ స్టారర్ గురించి కూడా చెప్పారు వెంకటేష్.

Whats_app_banner