Venkat Prabhu Imitates Dil Raju: దిల్‌రాజును ఇమిటేట్ చేసిన కస్టడీ డైరెక్టర్ - వీడియో వైరల్
Venkat Prabhu Imitates Dil Raju: కస్టడీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దిల్‌రాజును ఇమిటేట్ చేస్తూ దర్శకుడు వెంకట్‌ప్రభు మాట్లాడారు. అతడి స్పీచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Venkat Prabhu Imitates Dil Raju: విజయ్ వారిసు సినిమా ప్రమోషన్స్‌లో దిల్‌రాజు స్పీచ్ అప్పట్టో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. వారిసు సినిమాను ఉద్దేశిస్తూ తమిళ ప్రెస్‌మీట్‌లో ఈ సినిమాలో కామెడీ వెనుమా....కామెడీ ఇరుక్కు...డ్యాన్స్ వెనుమా..డ్యాన్స్ ఇరుక్కు అంటూ దిల్‌రాజు ఇచ్చిన ట్రెండింగ్‌లో నిలిచింది. దిల్‌రాజు స్పీచ్‌ను పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కాపీ కొట్టారు.
తాజాగా దిల్‌రాజు స్పీచ్‌ను ఇమిటేట్ చేసిన వారి జాబితాలో కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కూడా చేరిపోయాడు. నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న కస్టడీ మూవీ మే 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం చెన్నైలో నిర్వహించారు. ఈ వేడుకలో దిల్‌రాజు అనుకరిస్తూ వెంకట్ ప్రభు ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.
ఈ సినిమాలో చై స్టైల్ వెనుమా... స్టైల్ ఉంది. యాక్షన్ వెనుమా...యాక్షన్ ఉంది. పర్ఫార్మెన్స్ వెనుమా...పర్ఫార్మెన్స్ ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్ వెనుమా...ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది అంటూ వెంకట్ ప్రభు మాట్లాడాడు. అతడి స్పీచ్‌ను నాగచైతన్య తో పాటు అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. వెంకట్ ప్రభు స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కస్టడీ సినిమాకు సీక్వెల్
కస్టడీ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతున్నట్లు దర్శకుడు వెంకట్ ప్రభు ప్రకటించాడు. సినిమాలోనే సీక్వెల్ గురించి హింట్ ఇవ్వబోతున్నట్లు తెలిపాడు. కస్టడీలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
శరత్‌కుమార్, అరవింద్ స్వామి, ప్రియమణి కీలక పాత్రలను పోషిస్తోన్నారు. కస్టడీ మూవీకి ఇళయరాజాతో పాటు అతడి తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ మూవీతోనే నాగచైతన్య తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.