Varun Tej Lavanya Wedding: వరుణ్, లావణ్య కాక్‌టెయిల్ పార్టీ.. రామ్ చరణ్, అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్.. ఫొటోలు వైరల్-varun tej lavanya wedding in italy allu arjun ram charan special attraction ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Varun Tej Lavanya Wedding In Italy Allu Arjun Ram Charan Special Attraction

Varun Tej Lavanya Wedding: వరుణ్, లావణ్య కాక్‌టెయిల్ పార్టీ.. రామ్ చరణ్, అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్.. ఫొటోలు వైరల్

Hari Prasad S HT Telugu
Oct 31, 2023 10:39 AM IST

Varun Tej Lavanya Wedding: వరుణ్, లావణ్య కాక్‌టెయిల్ పార్టీ ఇచ్చారు. వీళ్ల పెళ్లి జరగబోయే ఇటలీలోని టస్కనీలో అల్లు, కొణిదెల ఫ్యామిలీల హంగామాకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

వరుణ్, లావణ్య కాక్ టెయిల్ పార్టీలో రామ్ చరణ్, అల్లు అర్జున్ సందడి
వరుణ్, లావణ్య కాక్ టెయిల్ పార్టీలో రామ్ చరణ్, అల్లు అర్జున్ సందడి

Varun Tej Lavanya Wedding: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ బుధవారం (నవంబర్ 1) పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలుసు కదా. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ వీళ్లు ఇటలీలోని టస్కనీలో ఏడడుగులు నడవబోతున్నారు. ఈ మెగా ఈవెంట్ కోసం మూడు రోజుల కిందే కొణిదెల, అల్లు కుటుంబాలు ఇటలీ చేరుకున్నాయి. ఫ్యామిలీకి కాబోయే దంపతులు కాక్‌టెయిల్ పార్టీ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

సోమవారం (అక్టోబర్ 30) రాత్రి వరుణ్ తేజ్, లావణ్య ఇచ్చిన కాక్‌టెయిల్ పార్టీలో రామ్ చరణ్, అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మెహెండీ, హల్దీలాంటి పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యే ముందు రెండు కుటుంబాల వాళ్లు, సన్నిహితులు ఇలా పార్టీతో చిల్ అయ్యారు. వీళ్ల పెళ్లికి కేవలం రెండు కుటుంబాల వాళ్లు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.

ఈ కాక్‌టెయిల్ పార్టీకి బావ, బావమరదులైన రామ్ చరణ్, అల్లు అర్జున్.. బ్లాక్ అండ్ వైట్ సూట్స్ లో వచ్చారు. రామ్ చరణ్ బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్, బ్లేజర్ లో కనిపించగా.. అల్లు అర్జున్ బ్లాక్ సూట్ లో ఫొటోలకు పోజులిచ్చాడు. ఈ ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు కాక్ టెయిల్ పార్టలో సందడి చేశారు. పార్టీలో తీసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బుధవారం (నవంబర్ 1) ఉదయం వరుణ్, లావణ్య పెళ్లి జరగనుంది. ఆ తర్వాత నవంబర్ 3న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే వీళ్ల రిసెప్షన్ ఇన్విటేషన్ వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. మాదాపూర్ లో ఉన్న ఎన్ కన్వెన్షన్ లో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి వీళ్ల రిసెప్షన్ ప్రారంభం కానుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.