Trivikram | మాటల మాంత్రికుడినీ వదలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు.. ఫొటో వైరల్‌-trivikram fined by hyderabad traffic police for having tilted film to his car windows ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Trivikram Fined By Hyderabad Traffic Police For Having Tilted Film To His Car Windows

Trivikram | మాటల మాంత్రికుడినీ వదలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు.. ఫొటో వైరల్‌

HT Telugu Desk HT Telugu
Apr 04, 2022 07:43 PM IST

సెలబ్రిటీలు తమకు తాము అన్నింటికీ అతీతమని అనుకుంటారు. కానీ అలాంటి సెలబ్రిటీలను కూడా వదలడం లేదు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు.

త్రివిక్రమ్ కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగిస్తున్న ట్రాఫిక్ పోలీసు
త్రివిక్రమ్ కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగిస్తున్న ట్రాఫిక్ పోలీసు (Twitter)

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఈ మధ్య చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. స్పెషల్‌ డ్రైవ్‌ల పేరుతో భారీగా చలాన్లు వేస్తున్నారు. సామాన్యులు, జర్నలిస్టులు, పోలీసులు, ప్రముఖులు అన్న తేడా లేకుండా అందరికీ జరిమానాల మోత మోగిస్తున్నారు. ఈ మధ్య వాహనాలపై ప్రెస్‌, పోలీసు వంటి అక్షరాలు రాసిన వారికి భారీగా జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కార్ల అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌లు ఉన్నా కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారు.

తాజాగా టాలీవుడ్‌ మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు కూడా ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. సోమవారం ఉదయం పోలీసులు అతడు ప్రయాణిస్తున్న వెహికిల్‌ను ఆపారు. కారు అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ ఉండటంతో ఫైన్‌ వేశారు. అంతేకాకుండా అప్పటికప్పుడు ఆ అద్దాలకున్న బ్లాక్‌ ఫిల్మ్‌లను తొలగించారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కార్ల అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ ఉండకూడదని కొన్నేళ్ల కిందటే సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. మొదట్లో వీటి పట్ల సీరియస్‌గా ఉన్న పోలీసులు తర్వాత చాలా కాలం పాటు పట్టించుకోలేదు. మళ్లీ ఇప్పుడు స్పెషల్‌ డ్రైవ్‌లతో ఇలాంటి కార్లను పట్టుకుంటున్నారు. ఈ మధ్యే టాలీవుడ్‌ హీరోలు అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌, మంచు మనోజ్‌ల వెహికిల్‌ను కూడా ఆపి జరిమానాలు విధించిన విషయం తెలిసిందే.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్