Trisha: పురుషాధిక్యతను ఎదురించిన యువరాణిగా త్రిష...పొన్నియన్ సెల్వన్ లుక్ ఔట్
చారిత్రక కథాంశంతో విలక్షణ చిత్రాల దర్శకుడు మణిరత్నం(maniratnam) రూపొందిస్తున్న తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్(ponniyin selvan). ఈ సినిమాలో త్రిష (trisha)ఫస్ట్ లుక్‌ను గురువారం విడుదలచేశారు. ఈ పోస్టర్ లో ఇంటెన్స్ లుక్ లో త్రిష కనిపిస్తోంది.
రోజుకో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ పొన్నియన్ సెల్వన్ పట్ల అభిమానుల్లో ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నారు విలక్షణ దర్శకుడు మణిరత్నం. ఇప్పటికే రిలీజ్ చేసిన విక్రమ్, కార్తి, ఐశ్వర్యారాయ్ పోస్టర్స్‌కు చక్కటి స్పందన లభిస్తోంది. తాజాగా గురువారం త్రిష ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె యువరాణి కుందవాయి పాత్రలో కనిపించబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
పురుషాధిక్య ప్రపంచంలో అసమాన ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన యువరాణిగా పొన్నియన్ సెల్వన్ సినిమాలో త్రిష పాత్ర శక్తివంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ పోస్టర్ రాచరికపు వస్త్రధారణలో ముక్కుపుడక, మెడలో హారం ధరించి డిఫరెంట్ లుక్ లో త్రిష కనిపిస్తోంది. పొన్నియన్ సెల్వన్ టీజర్ శుక్రవారం రిలీజ్ కానుంది. చెన్నైలో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా రెండు భాగాలుగా దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
విక్రమ్, కార్తి, జయంరవి, ఐశ్వర్యారాయ్, త్రిష, శోభిత దూళిపాళ్ల, శరత్ కుమార్ తో పాటు దక్షిణాదికి చెందిన పలువురు అగ్ర నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించనున్నారు. సెప్టెంబర్ 30న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ తో కలిసి మద్రాస్ టాకీస్ పతాకంపై మణిరత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాల్లో ఒకటిగా పొన్నియన్ సెల్వన్ నిలవనుంది.
సంబంధిత కథనం
టాపిక్