Triptii Dimri: ఆ పాటలో దారుణమైన స్టెప్స్‌ వేయడంపై స్పందించిన యానిమల్ బ్యూటీ తృప్తి-triptii dimri reacts to trolling on her dance moves in the song mere mehboob says this ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Triptii Dimri: ఆ పాటలో దారుణమైన స్టెప్స్‌ వేయడంపై స్పందించిన యానిమల్ బ్యూటీ తృప్తి

Triptii Dimri: ఆ పాటలో దారుణమైన స్టెప్స్‌ వేయడంపై స్పందించిన యానిమల్ బ్యూటీ తృప్తి

Hari Prasad S HT Telugu
Oct 01, 2024 04:00 PM IST

Triptii Dimri: తృప్తి డిమ్రి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తున్న విషయం తెలుసు కదా. అలాగే తాజాగా ఓ పాటలో ఆమె వేసిన దారుణమైన స్టెప్స్ పై విపరీతమైన ట్రోలింగ్ జరగగా.. ఇప్పుడు వాటిపై ఆమె స్పందించింది.

ఆ పాటలో దారుణమైన స్టెప్స్‌ వేయడంపై స్పందించిన యానిమల్ బ్యూటీ తృప్తి
ఆ పాటలో దారుణమైన స్టెప్స్‌ వేయడంపై స్పందించిన యానిమల్ బ్యూటీ తృప్తి

Triptii Dimri: తృప్తి డిమ్రి.. యానిమల్ మూవీతో రాత్రికి రాత్రే నేషనల్ క్రష్ గా మారిపోయిన ఈ బ్యూటీ ఆ తర్వాత కూడా అలాంటి బోల్డ్ పాత్రలే చేస్తోంది. తన ఇంట్లో వాళ్లు, బంధువులు, ఫ్యాన్స్.. ఇలా ఎవరేమన్నా ఆమె పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా తాను మేరే మెహబూబ్ సాంగ్ కోసం వేసిన స్టెప్స్ పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతున్నా.. వాటిని పెద్దగా పట్టించుకోవద్దంటూ ఆమె చెప్పడం విశేషం.

తృప్తి డిమ్రి రియాక్షన్ ఇదీ

విక్కీ విద్య కా వో వాలా వీడియో అనే సినిమాలో మేరే మెహబూబ్ అనే పాటలో తృప్తి డిమ్రి వేసిన స్టెప్స్ చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేశాయి. గణేష్ ఆచార్య కొరియోగ్రాఫ్ చేసిన ఈ పాటలో తృప్తి.. నేలపై పడుకొని తన నడుము కిందికి, మీదికి కదుపుతూ వేసిన హుక్ స్టెప్స్ పై చాలా ట్రోలింగ్ జరిగింది.

మరీ ఇంత దారుణమైన స్టెప్స్ వేయడానికి ఎలా అంగీకరించావంటూ ఆమెను పలువురు నిలదీశారు. దీనిపై తాజాగా ది హాలీవుడ్ రిపోర్టర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తృప్తి స్పందించింది.

నటిగా భిన్నంగా ప్రయత్నించాలనే..

ఓ నటిగా తాను భిన్నంగా ప్రయత్నించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు ఆమె చెప్పింది. "ఓ నటిగా భిన్నమైన విషయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మొదట్లో ఓ నటిగా నటన తెలిస్తే చాలని అనుకునేదాన్ని. కానీ నిజంగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇది పూర్తిగా భిన్నమైనదని తెలుసుకున్నాను.

ఓ షోకి హోస్ట్ చేయమని అడిగినప్పుడు మీకు ఎలా సరిగ్గా నడవాలో తెలియాలి. అలాగే ఓ డ్యాన్స్ ఆఫర్ చేసినప్పుడు దానిని సరిగ్గా ఎలా చేయాలో తెలియాలి. అందువల్ల నేను ప్రతిదీ చేయడానికి ప్రయత్నించాలి. ప్రతి విషయంలో నేను బాగా చేయకపోవచ్చు. కానీ ప్రయత్నించడంలో తప్పు లేదు కదా" అని తృప్తి చెప్పింది.

అవన్నీ పట్టించుకోవద్దు

అందరూ అనుకునేది పట్టించుకుంటే ఇక ఏమీ చేయలేమని తృప్తి అనడం విశేషం. "అందరికీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అందరికీ అన్నీ నచ్చాలని లేదు. అంతమాత్రాన ప్రయోగాలు చేయడం మానేయకూడదు.

మనల్ని మనం ఆపకూడదు. మనకు ఏది నచ్చితే అది చేస్తూ వెళ్లాలి. అందరూ ఏం అనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటే.. మనం చేసే పనికి వంద శాతం న్యాయం చేయలేం" అని తృప్తి స్పష్టం చేసింది.

ఏంటీ మేరే మెహబూబ్ పాట?

రాజ్ కుమార్ రావ్ నటిస్తున్న విక్కీ ఔర్ విద్య కా వో వాలా వీడియో మూవీలో ఈ మేరే మెహబూబ్ అనే పాట ఉంది. ఈ పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించాడు. ఈ పాటలో తృప్తికి అతడు ఇచ్చిన స్టెప్స్ చూడటానికి చాలా దారుణంగా ఉన్నాయి.

ఇలాంటి స్టెప్స్ వేయడానికి ఆమె ఎందుకు అంగీకరించిందో అంటూ పలువురు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 11న థియేటర్లలో రిలీజ్ కానుంది.