Love Me Movie: వైష్ణ‌వి చైత‌న్య హార‌ర్ ల‌వ్‌స్టోరీ రిలీజ్ వాయిదా - నెల రోజులు ఆల‌స్యంగా థియేట‌ర్ల‌లోకి ల‌వ్ మీ మూవీ-tollywood news vaishnavi chaitanya love me if you dare movie new release date locked dil raju ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Love Me Movie: వైష్ణ‌వి చైత‌న్య హార‌ర్ ల‌వ్‌స్టోరీ రిలీజ్ వాయిదా - నెల రోజులు ఆల‌స్యంగా థియేట‌ర్ల‌లోకి ల‌వ్ మీ మూవీ

Love Me Movie: వైష్ణ‌వి చైత‌న్య హార‌ర్ ల‌వ్‌స్టోరీ రిలీజ్ వాయిదా - నెల రోజులు ఆల‌స్యంగా థియేట‌ర్ల‌లోకి ల‌వ్ మీ మూవీ

Nelki Naresh Kumar HT Telugu
Apr 24, 2024 11:53 AM IST

Love Me Movie: బేబీ త‌ర్వాత వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్‌గా న‌టిస్తోన్న ల‌వ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ రిలీజ్ వాయిదా ప‌డింది. నెల రోజులు ఆల‌స్యంగా ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతోంది.

ల‌వ్ మీ ఇఫ్ యూ డేర్  రిలీజ్ డేట్
ల‌వ్ మీ ఇఫ్ యూ డేర్ రిలీజ్ డేట్

Love Me Movie: దిల్‌రాజు వార‌సుడు ఆశిష్, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ల‌వ్ మీ మూవీ రిలీజ్ వాయిదాప‌డింది. ఏప్రిల్ 25న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ నెల రోజులు ఆల‌స్యంగా థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. మే 25న ల‌వ్ మూవీ మూవీని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు బుధ‌వారం సినిమా యూనిట్ ప్ర‌క‌టించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ల‌వ్ మీ మూవీతో అరుణ్ భీమవరపు డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

హార‌ర్ ల‌వ్‌స్టోరీ...

హార‌ర్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ల‌వ్ మీ మూవీకి ఆస్కార్ విన్న‌ర్‌ కీర‌వాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమాల‌కు బ్యాడ్ సీజ‌న్ న‌డుస్తోంది. ఐపీఎల్ కార‌ణంగా థియేట‌ర్ల‌లో సినిమాలేవి స‌రిగ్గా వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోతున్నాయి. వాటికి తోడు ల‌వ్ మీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ఆల‌స్య‌మైన‌ట్లు తెలిసింది. అందువ‌ల్లే ల‌వ్ మూవీ రిలీజ్ వాయిదాప‌డిన‌ట్లు చెబుతోన్నారు. స‌రైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూసిన మేక‌ర్స్ మే 25ను ఫిక్స్ చేసిన‌ట్లు చెబుతోన్నారు. ఇటీవ‌లే ల‌వ్ మీ టీజ‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు.

ద‌య్యంతో ప్రేమాయ‌ణం...

ద‌య్యంతో ప్రేమ‌లో ప‌డిన ఓ కుర్రాడి క‌థ‌తో న్యూ ఏజ్ ల‌వ్ స్టోరీగా ల‌వ్ మీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా టైటిల్‌కు ఇఫ్ యు డేర్ అనే క్యాప్ష‌న్‌ను జోడించారు. బేబీ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత తెలుగులో వైష్ణ‌వి చైత‌న్య చేస్తోన్న మూవీ ఇది. ఇందులోనూ ఆమె యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా కోసం వైష్ణ‌వి చైత‌న్య సింగ‌ర్‌గా మారింది. ఓ పాట కూడా పాడింది.

రౌడీ బాయ్స్‌తో ఎంట్రీ...

దిల్‌రాజు అన్న కొడుకుగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు ఆశీష్. రౌడీబాయ్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా ప‌ర్వాలేద‌నిపించింది. ప్ర‌స్తుతం ల‌వ్ మీతో పాటు సెల్ఫీష్ పేరుతో మ‌రో మూవీ చేస్తున్నాడు. దిల్‌రాజు తో క‌లిసి సెల్పిష్ మూవీని అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

బేబీ త‌ర్వాత నాలుగు సినిమాలు...

మ‌రోవైపు బైబీతో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్న వైష్ణ‌వి చైత‌న్య టాలీవుడ్ నుంచి ఆఫ‌ర్లు క్యూ క‌డుతోన్నాయి. ల‌వ్ మీతో పాటు సిద్ధుజొన్న‌ల‌గ‌డ్డ‌తో యాక్ష‌న్ మూవీ చేస్తోంది. ఈ సినిమాకు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. బేబీ త‌ర్వాత ఆనంద్ దేవ‌ర‌కొండ‌తో మ‌రో సారి రొమాన్స్ చేయ‌నుంది వైష్ణ‌వి చైత‌న్య‌. వాటితో పాటు మ‌రో రెండు సినిమాల‌కు ఆమె గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

టాపిక్