Naveen Polishetty: జాతిరత్నాలు హీరోకు యాక్సిడెంట్ - రెండు నెల‌లు షూటింగ్‌ల‌కు బ్రేక్‌-tollywood news naveen polishetty injured in bike accident in usa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tollywood News Naveen Polishetty Injured In Bike Accident In Usa

Naveen Polishetty: జాతిరత్నాలు హీరోకు యాక్సిడెంట్ - రెండు నెల‌లు షూటింగ్‌ల‌కు బ్రేక్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 28, 2024 12:33 PM IST

Naveen Polishetty: జాతిర‌త్నాలు హీరో న‌వీన్ పొలిశెట్టి బైక్ యాక్సిడెంట్‌లో గాయ‌ప‌డిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ప్ర‌మాదం కార‌ణంగా రెండు నెల‌ల పాటు న‌వీన్ పొలిశెట్టి షూటింగ్‌ల‌కు దూరం కానున్న‌ట్లు స‌మాచారం.

న‌వీన్ పొలిశెట్టి
న‌వీన్ పొలిశెట్టి

Naveen Polishetty: జాతి ర‌త్నాలు హీరో న‌వీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్ అయిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి. ఈ ప్ర‌మాదం కార‌ణంగా న‌వీన్ పొలిశెట్టి షూటింగ్‌ల‌కు రెండు నెల‌లు బ్రేక్ ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. బైక్ స్కిడ్ కావ‌డంతో న‌వీన్ పొలిశెట్టి కింద ప‌డిన‌ట్లు స‌మాచారం. ఈ ప్ర‌మాదంలో అత‌డి చేతి ఫ్రాక్చ‌ర్ అయ్యింద‌ని అంటున్నారు.

అమెరికాలో ఈ బైక్ యాక్సిడెంట్ జ‌రిగిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవ‌డానికి రెండు నెల‌లు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని న‌వీన్ పొలిశెట్టికి వైద్యులు సూచించిన‌ట్లు తెలిసింది. సినిమా షూటింగ్‌లో కాకుండా అమెరికా టూర్‌లో ఉండ‌గా న‌వీన్ పొలిశెట్టికి ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలిసింది. ఈ గాయం నుంచి న‌వీన్ పొటిశెట్టి తొంద‌ర‌గా కోలుకోవావ‌ల‌ని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

హ్యాట్రిక్ స‌క్సెస్‌...

గ‌త ఏడాది మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు న‌వీన్ పొలిశెట్టి, అనుష్క హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచింది. ఇందులో సిద్ధు పొలిశెట్టి అనే పాత్ర‌లో త‌న కామెడీ టైమింగ్‌తో తెలుగు ఆడియెన్స్‌ను న‌వ్వించాడు న‌వీన్ పొలిశెట్టి. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌కు అనుష్క దూరం కావ‌డంతో సింగిల్‌గానే ఈవెంట్స్‌లో పాల్గొన్నాడు న‌వీన్ పొలిశెట్టి. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌, జాతిర‌త్నాలు త‌ర్వాత ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

అత్య‌ధిక లాభాలు తెచ్చిన మూవీ...

ఏజెంట్ సాయి శ్రీనివాస‌ ఆత్రేయ ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజై విజ‌యాన్ని సాధించ‌గా జాతి ర‌త్నాలు 2021లో తెలుగులో రిలీజైన సినిమాల్లో నిర్మాత‌ల‌కు అత్య‌ధిక లాభాల‌ను తెచ్చిపెట్టిన మూవీగా నిలిచింది.

అన‌గ‌న‌గా ఒక రాజు ...

మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి రిలీజై చాలా రోజులు అయినా న‌వీన్ పొలిశెట్టి నెక్స్ట్ మూవీ ఏమిట‌న్న‌ది ఇంకా ఫైన‌లైజ్ కాలేదు.జాతి ర‌త్నాలు త‌ర్వాత అన‌గ‌న‌గా ఒక రాజు పేరుతో న‌వీన్ పొలిశెట్టి ఓ మూవీని అనౌన్స్ చేశాడు. మ్యాడ్ ఫేమ్‌ క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించాల‌ని అనుకున్న‌ది. శ్రీలీల హీరోయిన్‌గా న‌టించాల్సిన ఈ మూవీ క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తో ఆగిపోయింది.

జాతిర‌త్నాలు ద‌ర్శ‌కుడు అనుదీప్‌తో న‌వీన్ పొలిశెట్టి మ‌రో సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వాటితో పాటు మ‌రికొంత మంది కొత్త ద‌ర్శ‌కుల‌తో న‌వీన్ సినిమా చేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బైక్ యాక్సిడెంట్ కార‌ణంగా అత‌డి నెక్స్ట్ మూవీ మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌తో ఎంట్రీ...

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌తో న‌టుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు న‌వీన్ పొలిశెట్టి. ఇందులో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్ చేశాడు. ఆ త‌ర్వాత తెలుగులో ఢీ ఫ‌ర్ దోపీడి, మ‌హేష్ బాబు వ‌న్ నేనొక్క‌డినే సినిమాల్లో కీల‌క పాత్ర‌లు చేశాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా న‌టించిన చిచ్చోరే సినిమాతో న‌వీన్ పొలిశెట్టి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్క‌డ తొలి ప్ర‌య‌త్నంలోనే హిట్టందుకున్నాడు. వాట్స్ యువ‌ర్ స్టేట‌స్‌, ఏఐబీ పేరుతో కొన్ని కామెడీ షోస్ చేశాడు న‌వీన్ పొలిశెట్టి. వీటి ద్వారా వ‌చ్చిన పేరుతోనే హీరోగా మారాడు.

WhatsApp channel

టాపిక్