Poonam Kaur Health Condition: పూనమ్ కౌర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? లేటెస్ట్ అప్డేట్ ఇదిగో?
Poonam Kaur Health Condition: ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Poonam Kaur Health Condition: ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ టాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల కంటే కూడా సోషల్ మీడియా చురుకుగా ఉంటూ పాపులరైన ఈ నటి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఫైబ్రో మైయాల్జియా అనే అరుదైన సమస్యతో బాధపడుతున్న ఆమె ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటుందని సమాచారం. తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై సరికొత్త అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పత్రికా ప్రకటన విడుదలైంది. ఈ విషయాన్ని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న తెలియజేశారు.
"గత ఏడాది కాలంగా జీరో జీఎస్టీ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న పూనమ్ కౌర్ నవంబరు 10వ తేదీన మాతో కలిసి సూరత్ గాంధీ పార్కులో చేనేతపై జీఎస్టీ పన్ను ఎత్తివేయాలని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 11వ తేదీన సబర్మతీ ఆశ్రమలో మౌన దీక్ష చేసిన అనంతరం అదే రోజు సాయంత్రం దిల్లీ బయల్దేరారు. 12వ తేదీని అక్కడ జరిగే బ్రహ్మకుమారి కార్యక్రమం కోసం వెళ్లారు. అక్కడ ఆమెకు వెన్ను నొప్పి రావడంతో కేరళ వెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఆమెకు 18వ తేదీన ఫైబ్రో మయాల్జీయా వ్యాధి నిర్ధారణ అయింది. కేరళలో చికిత్స అనంతరం మహారాష్ట్ర వెళ్లి ఆమె అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు." అని వెంకన్న తన ప్రకటనలో పేర్కొన్నారు.
పూనమ్ కౌర్‌కు ఫైబ్రో మయాల్జియా అనే వ్యాధి సంక్రమించిందని ఒక్కసారిగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఈ వార్తలను బలపరుస్తూ పూనమ్.. తన ఇన్‌స్టా స్టోరీలో పోస్టు పెట్టింది. “ఇది మందు కాదు.. ప్రేమతో ఇస్తున్నారు. దీని వల్లే నా రోగం కూడా తగ్గుతుంది” అంటూ ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
పూనమ్ కౌర్‌కు వచ్చిన ఈ అరుదైన వ్యాధి వల్ల నిద్రలేమితనం, మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, అలసట, మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, కండరాల సమస్యలు ఏర్పడటం లాంటి లక్షణాలు ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్లో హీరోయిన్లు ఇలాంటి అరుదైన వ్యాధులతో బాధపడుతుండటం గమనార్హం. ఇప్పటికే సమంత మయోసైటిస్ అనే వ్యాధికి చికిత్స తీసుకుంటోంది. ఇటీవలే ఆమె నటించిన యశోద సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
సంబంధిత కథనం
టాపిక్