Thalapathy 67 Remuneration : దళపతి 67కి విజయ్, అర్జున్ పారితోషికం ఎంత?-thalapathy 67 remuneration arjun sarja charged 5 crore and thalapathy vijay charged 100 crore above ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thalapathy 67 Remuneration : దళపతి 67కి విజయ్, అర్జున్ పారితోషికం ఎంత?

Thalapathy 67 Remuneration : దళపతి 67కి విజయ్, అర్జున్ పారితోషికం ఎంత?

Anand Sai HT Telugu
Dec 26, 2022 06:02 PM IST

Thalapathy 67 Update : దళపతి 67వ సినిమాలో పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. ఈ చిత్రంలో సంజయ్ దత్, గౌతమ్ మీనన్, నివిన్ పౌలీ నటిస్తున్నారు. అర్జున్ సర్జా కూడా ఉన్నాడు. అయితే సినిమాలో నటులు రెమ్యూనరేషన్ ఎక్కువగానే తీసుకున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.

దళపతి విజయ్, అర్జున్
దళపతి విజయ్, అర్జున్

దళపతి విజయ్(Thalapathy vijay) వారసుడు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో దళపతి విజయ్, రష్మిక మందన్న తదితరులు నటించారు. ప్రమోషన్ వర్క్ భారీగా జ‌రుగుతోంది. తర్వాత లోకేష్‌ కనగరాజ్‌(lokesh kanagaraj) తో విజయ్ 'దళపతి 67'(Thalapathy 67) పనుల్లో బిజీ ఉంటాడు. ఈ చిత్రంలో అర్జున్‌ సర్జా(Arjun Sarja) విలన్‌గా నటిస్తున్నాడు. సినిమా కోసం ఆయన భారీ పారితోషికాన్ని అందుకున్నట్లు సమాచారం.

దళపతి 67వ సినిమాలో పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. ఈ చిత్రంలో సంజయ్ దత్(sanjay dutt), గౌతమ్ మీనన్, నివిన్ పౌలీ నటిస్తున్నారు.అర్జున్ సర్జా కూడా ఉన్నాడు. ఈ సినిమా కోసం 4.5 నుంచి 5 కోట్ల పారితోషికం(Remuneration) తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సంజయ్ దత్ రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. దళపతి విజయ్ 100 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

జనవరిలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా షూటింగ్ చెన్నై(Chennai)లో జరగనుంది. మేజర్ పార్ట్ షూటింగ్ కాశ్మీర్(Kashmir)లో ప్లాన్ చేశారు. 'దళపతి 67' బడ్జెట్ 200 కోట్ల రూపాయలను దాటేసిందని అంటున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 2023లోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

మరోవైపు విజయ్‌, లోకేష్‌ కనగరాజ్‌ సినిమా కావడంతో క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా డిజిటల్‌ హక్కులకు(digital rights) ఎక్కడ లేని డిమాండ్‌ వచ్చి పడింది. సౌతిండియాలోనే అత్యధిక మొత్తానికి ఈ సినిమా డిజిటల్‌ హక్కులు అమ్ముడయ్యాయని అంటున్నారు. ప్రముఖ ఓటీటీ(OTT) నెట్‌ఫ్లిక్స్‌ విజయ్‌, లోకేష్‌ సినిమా డిజిటల్‌ హక్కులను ఏకంగా రూ.160 కోట్లకు దక్కించుకోవడం విశేషం. అన్ని భాషల డిజిటల్‌ హక్కులు ఈ డీల్‌ కింద నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుందట.

వారసుడు(Varasudu)పై విజయ్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దళపతి ఫ్యాన్స్(Thalapathy Fans) కూడా ఎదురుచూస్తున్నారు. విక్రమ్‌(Vikram) హిట్‌తో డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ ఊపు మీద ఉన్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. అందుకే ఈ సినిమాపై క్రేజ్ ఉంది. వచ్చే ఏడాది పాన్‌ ఇండియా(Pan India) లెవల్లో ఈ సినిమా రిలీజ్‌ చేసే ఛాన్స్ ఉంది.

Whats_app_banner