OTT Murder Mystery: ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న తెలుగు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - ఎందులో చూడాలంటే?
OTT Murder Mystery: తెలుగు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ బాలుగాని టాకీస్ ఓటీటీలో దూసుకుపోతుంది. ఆహా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది. బాలుగాని టాకీస్ మూవీలో శివ రామచంద్రవరపు, శరణ్య శర్మ హీరోహీరోయిన్లుగా నటించారు.
OTT Murder Mystery: తెలుగు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ బాలుగాని టాకీస్ ఓటీటీలో అదరగొడుతోంది. థియేటర్లను స్కిప్ చేస్తూ ఇటీవలే డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. సినిమా రిలీజై పది రోజులు అవుతోన్న ఆహా ఓటీటీలో టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో రెండో ప్లేస్‌లో బాలుగాని టాకీస్ మూవీ నిలిచింది. ఓటీటీలో 30 మిలియన్లకుపైనే ఈ మూవీ స్ట్రీమింగ్ మినట్స్ వ్యూస్‌ను దక్కించుకున్నట్లు సమాచారం.
రివేంజ్ డ్రామా...
బాలుగాని టాకీస్ మూవీలో శివ రామచంద్రవరపు, శరణ్య శర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. రఘు కుంచె సుధాకర్‌రెడ్డి, వంశీ నెక్కంటి కీలక పాత్రలు పోషించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి విశ్వనాథ్ ప్రతాప్ దర్శకత్వం వహించాడు.
బాలు టాకీస్...
థియేటర్ బ్యాక్‌డ్రాప్‌లో మర్డర్ మిస్టరీకి కామెడీని జోడించి బాలుగాని టాకీస్ మూవీ తెరకెక్కింది. బాలుకు (శివ రామచంద్రవరపు) సొంతంగా థియేటర్ ఉంటుంది. ఒకప్పుడు జనాలతో కళకళలాడిన థియేటర్‌కు పూర్వ వైభవం తీసుకురావాలన్నది బాలు కల.
కానీ ఆర్థిక స్థోమత లేకపోవడంతో అందరి దగ్గర అప్పులు చేస్తూ బూతు సినిమాలను ఆడిస్తుంటాడు. దాంతో బాలుకు పిల్లను ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. తన థియేటర్‌లో బాలకృష్ణ కొత్త సినిమాను రిలీజ్ చేస్తానని ఊరి ప్రజలతో బాలు ఛాలెంజ్ చేస్తాడు.
కొద్ది రోజులకే థియేటర్‌లో సినిమా చూస్తున్న ఓ వ్యక్తి చనిపోతాడు. ఆ విషయం తెలిస్తే తన థియేటర్ మూతపడుతుందని భావించిన బాలు ఆ డెడ్‌బాడీని మాయం చేయాలని అనుకుంటాడు. అతడి ప్రయత్నం ఫలించిందా? డెడ్‌బాడీని బాలు ఎలా మాయం చేశాడు? ఆ వ్యక్తి థియేటర్‌లో ఎలా చనిపోయాడు అనే కాన్సెప్ట్‌తో బాలుగాని టాకీస్ మూవీ తెరకెక్కింది.
ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు...
కాన్సెప్ట్‌తో పాటు హీరో లైఫ్‌లో ఎదురయ్యే ట్విస్ట్‌లను ఇంట్రెస్టింగ్‌గా రాసుకొని ఆడియెన్స్‌ను మెప్పించాడు డైరెక్టర్. శ్రీనిధి సాగర్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీకి స్మరణ్ పాటల్ని, ఆదిత్య బీఎన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ...
బాలుగాని టాకీస్ కంటే ముందు తెలుగులో పలు సినిమాలు చేశాడు శివ రామచంద్రవరపు. పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్, నితిన్ భీష్మ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, నాగచైతన్య మిజిలీతో తో పాటు ఇరవైకిపైగా సినిమాల్లో నెగెటివ్, పాజిటివ్ క్యారెక్టర్స్ చేశాడు. శివ రామచంద్రవరకు హీరోగా నటిస్తోన్న నరుడి బ్రతుకు అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షికేశ్వర్ యోగి దర్శకత్వం వహించిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రిలీజ్ చేస్తోంది.