Suriya: పాతికేళ్ల అనుభవం తర్వాత ఎగ్జైట్ అయ్యాను.. తమిళ స్టార్ హీరో సూర్య కామెంట్స్-tamil actor suriya comments on kanguva movie says exited after 25 years experience ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tamil Actor Suriya Comments On Kanguva Movie Says Exited After 25 Years Experience

Suriya: పాతికేళ్ల అనుభవం తర్వాత ఎగ్జైట్ అయ్యాను.. తమిళ స్టార్ హీరో సూర్య కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Mar 25, 2024 06:11 AM IST

Suriya About Kanguva Movie: తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కంగువ. త్వరలో విడుదల కానున్న కంగువ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా ముంబైలో నిర్వహించారు. ఈ వేడుకలో సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

పాతికేళ్ల అనుభవం తర్వాత ఎగ్జైట్ అయ్యాను.. తమిళ స్టార్ హీరో సూర్య కామెంట్స్
పాతికేళ్ల అనుభవం తర్వాత ఎగ్జైట్ అయ్యాను.. తమిళ స్టార్ హీరో సూర్య కామెంట్స్

Suriya About Kanguva Movie: కంగువ లాంటి గొప్ప సినిమాలో నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తమిళ స్టార్ హీరో సూర్య తెలిపారు. ఆయన నటించిన ఈ ప్రెస్టీజియస్ మూవీ త్వరలో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. కంగువ సినిమాలో హాట్ బ్యూటి దిశా పటానీ, యానిమల్ యాక్టర్ బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కంగువ మూవీని హ్యూజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.

తాజాగా ముంబైలో 'కంగువ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సూర్యతో పాటు మూవీ టీమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య తన అనుభవాలను పంచుకున్నారు. "గొప్ప సినిమాల్లో నటించే అవకాశం అదృష్టవశాత్తూ దక్కుతుంటుంది. మన కోరికను ఈ యూనివర్స్ విని అది జరిగేలా చేస్తుందని నమ్ముతాను. అది కంగువ విషయంలోనూ జరిగింది" అని హీరో సూర్య తెలిపాడు.

"ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి రోజు రోజుకూ మూవీ మరింత బిగ్ ప్రాజెక్ట్‌గా మారుతూ వచ్చింది. అందుకు మా డైరెక్టర్ శివకు థ్యాంక్స్ చెప్పాలి. కంగువ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేయాలని కలగన్న మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాకు కృతజ్ఞతలు. అలాగే సినిమాటోగ్రాఫర్ వెట్రి, మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లేకుండా ఈ మూవీ ఇంత బాగా వచ్చేది కాదు" అని సూర్య అన్నాడు.

"ప్రతి సినిమాకు స్క్రిప్ట్‌కు మేకింగ్‌కు మధ్య కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కానీ కంగువ సినిమాకు ప్రతి రోజూ బెటర్‌గా వర్క్ చేస్తూ వచ్చాం. ఒక కొత్త పాత్రలోకి మారిపోవడం ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. నటుడిగా పాతికేళ్ల అనుభవం తర్వాత ఒక సినిమాకు ఎగ్జైట్ అయి వర్క్ చేయడం అంత సులువు కాదు. కంగువకు 150 రోజులకు పైగా చేసిన షూట్‌లో ప్రతి రోజూ ఆ ఎగ్జైట్ మెంట్ ఎక్సీపిరియన్స్ చేశాం. ఈ సినిమాకు మాకెంతో స్పెషల్. మీ అందరికీ కంగువ నచ్చుతుందని ఆశిస్తున్నాం" అని సూర్య చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సూర్య గజినీ, సూర్య సన్నాఫ్ క్రిష్ణన్, సింగం సిరీస్ తదితర సినిమాలతో ఆకట్టుకున్నాడు. సూర్య 42వ చిత్రంగా కంగువ వస్తోంది. ఇదే కాకుండా వాసివాసల్ అనే మూవీలో కూడా సూర్య నటిస్తున్నాడు. దీనికి తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సూరరై పోట్రు రీమేక్‌గా హిందీలో వస్తున్న సినిమాలో సూర్య గెస్ట్ రోల్ చేయనున్నాడు. ఈ మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్నాడు.

IPL_Entry_Point