Tamannaah About Intimate Scenes: రొమాంటిక్ సీన్లలో హీరోల బిహేవియర్‌పై తమన్నా షాకింగ్ కామెంట్స్
Tamannaah About Intimate Scenes: శృంగార సన్నివేశలలో హీరోల ప్రవర్తన గురించి మిల్క్ బ్యూటీ తమన్నా సంచలన వ్యాఖ్యలు చేసింది. రొమాంటిక్ సన్నివేశాలు చేసేటప్పుడు నటులు ఎలా ప్రవర్తిస్తారో తనకు తెలుసని స్పష్టం చేసింది.
Tamannaah About Intimate Scenes: సినిమాల్లో రొమాంటిక్ సీన్లు లేదా శృంగార భరితమైన ముద్దు సీన్లు చేసేటప్పుడు హీరోలు ఎంత లక్కీనో అనుకునేవారు మనలో చాలా మంది ఉన్నారు. అంతెందుకు ఆ సమయంలో వారు ఫుల్ మూడ్‌లోకి వస్తారని, తమను తాము కంట్రోల్ చేసుకోలేరని అనుకుంటారు. దీనివల్లే క్యాస్టింగ్ కౌచ్, హీరోయిన్లపై వేధింపులు లాంటివి జరుగుతున్నాయని భావిస్తుంటారు. అయితే వీటన్నింటికీ విరుద్ధంగా తమన్నా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంటిమేట్ సీన్లను చిత్రీకరణ సమయంలో హీరోలు ఎలా బిహేవ్ చేస్తారో తనకు తెలుసని స్పష్టం చేసింది.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సహజమైన విషయం ఏంటంటే యాక్టర్లు కూడా మనుషులేనని తెలుసుకోవాలి. ఆడ లేదా మగ అనేదానితో సంబంధం లేకుండా ఇది ప్రతిఒక్కరికి వర్తిస్తుంది. అయితే రొమాంటిక్ సన్నివేశాలప్పుడు కొంతమంది హీరోలు చాలా ఇబ్బందికరంగా ఫీలవుతారు. మహిళలు ఏమనుకుంటారోనని అసౌకర్యంగా భావిస్తారు. అని తమన్నా తెలిపింది.
అయితే తమన్నా వ్యాఖ్యలపై పలువురు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. తమన్నా వ్యాఖ్యలను సాధారణంగా అందరికీ వర్తించేలేమని, రొమాంటిక్ సీన్లలో భిన్నంగా ప్రవర్తించే రెండు రకాల పురుషులు ఉంటారని స్పష్టం చేస్తున్నారు.
ఇక వర్క్ విషయానికొస్త్ మిల్క్ బ్యూటీ తమన్నా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో బోళా శంకర్ సినిమాలో చేస్తుండగా.. హిందీలో ఒ చిత్రం, మలయాళంలో మరో చిత్రం చేస్తోంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ గుర్తుందా శీతాకాలం చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో సత్యదేవ్ హీరోగా చేశాడు.
సంబంధిత కథనం