Suriya: తెలుగు హీరోల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పిన సూర్య.. మూడు వేల మంది లైఫ్ పార్ట్‌నర్స్ అంటూ!-suriya comments on friend in tollywood heroes ram charan allu arjun mahesh babu prabhas at kanguva mega event in vizag ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya: తెలుగు హీరోల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పిన సూర్య.. మూడు వేల మంది లైఫ్ పార్ట్‌నర్స్ అంటూ!

Suriya: తెలుగు హీరోల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పిన సూర్య.. మూడు వేల మంది లైఫ్ పార్ట్‌నర్స్ అంటూ!

Sanjiv Kumar HT Telugu
Oct 29, 2024 10:46 AM IST

Suriya About Friends In Tollywood Heroes: తెలుగు సినీ ఇండస్ట్రీలోని హీరోల్లో ఫ్రెండ్స్ ఎవరో చెప్పాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఇటీవల వైజాగ్‌లో సూర్య నటించిన కంగువ మూవీ మెగా ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో టాలీవుడ్ హీరోలు, కంగువ మూవీపై ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు సూర్య.

తెలుగు హీరోల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పిన సూర్య.. మూడు వేల మంది లైఫ్ పార్ట్‌నర్స్ అంటూ!
తెలుగు హీరోల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పిన సూర్య.. మూడు వేల మంది లైఫ్ పార్ట్‌నర్స్ అంటూ!

Suriya Friends In Tollywood Heroes: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్‌గా సూర్య సరసన బాలీవుడ్ హాట్ భామ దిశా పటానీ యాక్ట్ చేసింది.

yearly horoscope entry point

నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్స్

అలాగే, యానిమల్ విలన్ బాబీ డియోల్ కంగువాలో పవర్‌ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. 'కంగువ' సినిమాను హ్యూజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. కంగువ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయనున్నారు.

కంగువ మెగా ఈవెంట్

ఇక 'కంగువ' సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. ఇటీవల వైజాగ్‌లో కంగువ మెగా ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సూర్య, సందీప్ కిషన్, రైటర్ రాకేందు మౌళి, డైరెక్టర్ శివ, ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు, యాక్టర్ అవినాష్ ఇతరులు హాజరై సందడి చేశారు.

నాన్న గారి సినిమాల నుంచి

హీరో సూర్య మాట్లాడుతూ.. "వైజాగ్ కంగువ ఈవెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఘంటా శ్రీనివాసరావు గారు మాకు ఎంతో సపోర్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. ఆయనకు మా కృతజ్ఞతలు చెబుతున్నాం. వైజాగ్‌తో మాకు ఎంతో అనుబంధం ఉంది. మా నాన్నగారి సినిమాల షూటింగ్ విశాఖలో జరిగినప్పుడు మేము వచ్చేవాళ్లం. అప్పటినుంచి వైజాగ్‌తో అనుబంధం కొనసాగుతోంది" అని తెలిపాడు.

లైఫ్ పార్ట్‌నర్స్ కూడా

"నేను కంగువ లాంటి బిగ్ మూవీ చేసేందుకు నా వైఫ్ జ్యోతిక సపోర్ట్ ఎంతో ఉంది. మా యూనిట్‌లోని మూడు వేల మంది జీవిత భాగస్వాములు (లైఫ్ పార్ట్‌నర్స్) కూడా తమ కుటుంబాలను ఏ లోటు లేకుండా చూసుకోవడం వల్లే మేము రెండేళ్ల పాటు కంగువ లాంటి భారీ పాన్ ఇండియా మూవీ చేయగలిగాం. అందుకు ఆ గొప్ప మహిళలు అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా" అని సూర్య చెప్పాడు.

మంచి మిత్రులు దొరకడం

"నాకు తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, ప్రభాస్ లాంటి మంచి మిత్రులు దొరకడం సంతోషంగా ఉంది. కంగువ సినిమా డబ్బు కోసం చేసింది కాదు. మీ అందరికీ ఒక గొప్ప సినిమా ఇవ్వాలని చేసిన ప్రయత్నం. థియేటర్‌లో గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేలా కంగువ ఉంటుంది. నవంబర్ 14న థియేటర్స్‌లో కంగువ చూసి మా ప్రయత్నానికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా" అని సూర్య పేర్కొన్నాడు.

స్క్రీన్స్ ఫైర్ అయ్యేంత

రైటర్ రాకేందు మౌళి మాట్లాడుతూ.. "కంగువ మెగా ఈవెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సూర్య గారు మనల్ని ఎన్నో ఏళ్లుగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఆయన పాటలు మనం పాడుకుంటున్నాం. ఆయన డైలాగ్స్ చెప్పుకుంటున్నాం. కంగువ సినిమాలో అలాంటి మాటలు పాటలు రాసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. స్క్రీన్స్ ఫైర్ అయ్యేంత పవర్‌ఫుల్‌గా కంగువ ఉంటుంది. మీరంతా థియేటర్స్‌కు వెళ్లి మూవీ చూసి ఎంజాయ్ చేయండి" అని తెలిపారు.

Whats_app_banner