Kanguva Movie: సూర్య వాయిస్ కోసం ఏఐ.. ఎనిమిది భాషల్లో రిలీజ్ కానున్న సినిమా.. ఆ విషయంలో నిరాశ!
Kanguva Movie: కంగువ సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‍డేట్స్ బయటికి వచ్చాయి. ఈ మూవీని భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఏకంగా ఎనిమిది భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కంగువపై అంచనాలు భారీ రేంజ్‍లో ఉన్నాయి. భారీ వీఎఫ్‍ఎక్స్‌తో ఈ ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం రూపొందింది. డిఫరెంట్ టైమ్‍లైన్లలో ఈ మూవీ సాగుతుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్‌తో హైప్ విపరీతంగా పెరిగిపోయింది. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 14వ తేదీన విడుదల కానుంది. ఈ తరుణంలో కంగువ గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
8 భాషలు.. 3500 థియేటర్లు
కంగువ సినిమాను ఎనిమిది భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు జ్ఞానవేల్ క్లారిటీ ఇచ్చేశారు. ప్రపంచవ్యాప్తంగా 3,500 థియేటర్లలో ఈ మూవీ విడుదలవుతుందని తెలిపారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్, ఫ్రెండ్, స్పానిష్‍లోనూ ఈ మూవీ వస్తుందని వెల్లడించారు.
సూర్య కోసం ఏఐ
కంగువ మూవీలో సూర్య వాయిస్ కోసం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నట్టు జ్ఞానవేల్ తెలిపారు. తమిళం కాకుండా వేరే భాషల్లో సూర్య వాయిస్ కోసం డబ్బింగ్ ఆర్టిస్ట్‌లను వాడకుండా ఏఐను టెక్నాలజీని వాడుతున్నట్టు వెల్లడించారు. అడ్వాన్స్ ఏఐ టెక్నాలజీ సాయంతో ప్రతీ భాషలో సూర్య వాయిస్‍ను రీక్రియేట్ చేసే పనిలో కంగువ టీమ్ ఉంది. దీంతో డబ్బింగ్ ఆర్టిస్టులతో పని లేకుండా ఇతర భాషల్లో సూర్య వాయిస్ ఏఐ ద్వారా ఉండనుంది. దీంతో ఇది ఆసక్తికరంగా మారింది.
ఈ విషయంలో నిరాశ
కంగువ చిత్రం 2డీతో పాటు 3డీ ఫార్మాట్‍లోనూ రిలీజ్ కానుంది. ఐమ్యాక్స్ వెర్షన్ కూడా వస్తుందని గతంలో మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే, కంగువ ఐమ్యాక్స్ ఫార్మాట్‍లో రాదని జ్ఞానవేల్ ఇప్పుడు వెల్లడించారు. దీంతో సూర్య అభిమానులkg ఇది కాస్త నిరాశగా మారింది.
కంగువ చిత్రంలో సూర్య రెండు పాత్రలు పోషిస్తున్నారు. మోడ్రన్ లుక్‍లోనూ కనిపించనున్నారు. రెండు రోజుల్లోనే ఈ లుక్‍ను రివీల్ చేస్తామని జ్ఞానవేల్ వెల్లడించారు. ఈ మూవీ నుంచి రెండో పాట అప్‍డేట్ కూడా త్వరలోనే రానుంది.
కంగువ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ నటించారు. విలన్‍గా బాబీ డియోల్ చేశారు. నటరాజన్ సుబ్రమణియం, కిచ్చా సుదీప్, జగపతి బాబు, రెడిన్ కింగ్‍స్లే, యోగిబాబు, కోవై సరళ, చక్రవర్తి, ఆనంద్‍రాజా కీలకపాత్రలు పోషించారు. సుమారు రూ.300కోట్ల బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందిందని అంచనా.
కంగువ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన విడుదల కావాల్సింది. అయితే, రజినీకాంత్ ‘వేట్టయన్’ అదే రోజు వచ్చేందుకు నిర్ణయించటంతో వాయిదా పడింది. నవంబర్ 14వ తేదీని కంగువ మేకర్స్ రిలీజ్‍కు ఫిక్స్ అయ్యారు.
టాపిక్