Sarkar 4 Promo: బీర్ గురించి బ‌బుల్ గ‌మ్ హీరోయిన్ కామెంట్స్ -సుడిగాలి సుధీర్ స‌ర్కార్ 4 నెక్స్ట్ ఎపిసోడ్‌ ప్రోమో రిలీజ్‌-sudigali sudheer sarkar season 4 episode 3 promo ananya nagalla manasa chowdaryattend as guests this game show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sarkar 4 Promo: బీర్ గురించి బ‌బుల్ గ‌మ్ హీరోయిన్ కామెంట్స్ -సుడిగాలి సుధీర్ స‌ర్కార్ 4 నెక్స్ట్ ఎపిసోడ్‌ ప్రోమో రిలీజ్‌

Sarkar 4 Promo: బీర్ గురించి బ‌బుల్ గ‌మ్ హీరోయిన్ కామెంట్స్ -సుడిగాలి సుధీర్ స‌ర్కార్ 4 నెక్స్ట్ ఎపిసోడ్‌ ప్రోమో రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 30, 2024 12:31 PM IST

Sarkar 4 Promo: సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న స‌ర్కార్ సీజ‌న్ 4 గేమ్ షో తాలూకు మూడో ఎపిసోడ్ ప్రోమో యూట్యూబ్‌లో రిలీజైంది. మే 3న స్ట్రీమింగ్ కానున్న ఈ కొత్త ఎపిసోడ్‌లో న‌లుగురు తెలుగు హీరోయిన్లు సంద‌డి చేశారు.

సుడిగాలి సుధీర్ స‌ర్కార్ సీజ‌న్ 4
సుడిగాలి సుధీర్ స‌ర్కార్ సీజ‌న్ 4

Sarkar 4 Promo: సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా ఆహా లోస్ట్రీమింగ్ అవుతోన్న‌ తెలుగు గేమ్ షో స‌ర్కార్ ఓటీటీ ఆడియెన్స్‌ను అల‌రిస్తోంది. ఈ గేమ్‌షోలో నాలుగో సీజ‌న్ ప్ర‌స్తుతం టెలికాస్ట్ అవుతోంది. గ‌త మూడు సీజ‌న్స్ స‌క్సెస్ కావ‌డంతో నాలుగో సీజ‌న్‌కు మ‌రింత ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉండేలా మేక‌ర్స్ ప్లానింగ్ చేస్తున్నారు. సుధీర్‌ను కొత్త‌గా హోస్ట్‌గా తీసుకొచ్చారు.

మూడో ఎపిసోడ్ ప్రోమో...

స‌ర్కార్ సీజ‌న్ 4 మూడో ఎపిసోడ్‌కు సంబంధించిన కొత్త ప్రోమో రిలీజైంది. మే 3న రిలీజ్ కానున్న మూడో ఎపిసోడ్‌లో న‌లుగురు టాలీవుడ్ హీరోయిన్లు సంద‌డి చేయ‌బోతున్నారు. అన‌న్య నాగ‌ళ్ల‌, శ్రీ గౌరిప్రియ‌, మాన‌స చౌద‌రి, శివాని గెస్ట్‌లుగా వ‌చ్చారు.

న‌లుగురు తెలుగు హీరోయిన్లు...

ఈ షోకు మొత్తం న‌లుగురు తెలుగు హీరోయిన్లు గెస్టులుగా రావ‌డం ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ న‌లుగురికి రోజ్ ఫ్ల‌వ‌ర్ ఇచ్చి సుడిగాలి సుధీర్ ప్ర‌పోజ్ చేశాడు. హీరోయిన్ల‌ను పొగుడుతూ సుధీర్ చెప్పిన డైలాగ్స్ ఈ ప్రోమోలో ఆక‌ట్టుకుంటున్నాయి.

నేనెలా మిస్స‌య్యాను...

శ్రీగౌరిప్రియ రాగానే మీరు మిస్ హైద‌రాబాద్ క‌దా అని ఆమెను అడిగాడు. అవున‌ని ఆమె అన‌గానే...నేను ఇలా మిస్ అయ్యాను అని అన‌డం ఆక‌ట్టుకుంటుంది. ఆ త‌ర్వాత అన‌న్య నాగ‌ళ్ల రాగానే ఆమెకు ల‌వ్ లెట‌ర్ ఇచ్చాడు. ఆ లెట‌ర్ ఓపెన్ చేసి త‌న పేరును అన‌న్య నాగ‌ళ్ల చ‌ద‌వ‌గానే..ప్ర‌పంచం అంత వెతికా అంత కంటే గొప్ప పేరు క‌నిపించ‌లేదు అని సుధీర్ చెప్పాడు.

గుండెల్లో మోసేది నేనే...

శివాని షోలోకి ఎంట్రీ ఇవ్వ‌గానే మీరు బ‌రువు పెర‌గ‌న‌ని నాకు మాటివ్వండి అంటూ శివానిని సుధీర్ కోరాడు. నేను బ‌రువు పెరిగితే మీకెంటి ప్రాబ్ల‌మ్ అని ఆమె అడ‌గ్గానే...జీవితాంతం గుండెల్లో పెట్టుకొని బ‌రువు మోయాల్సింది నేను అంటూ రొమాంటిక్‌గా బ‌దులిచ్చాడు.

మానన చౌద‌రి పంచ్‌లు...

సుధీర్ వేసిన రొమాంటిక్ డైలాగ్స్‌కు త‌గ్గ‌ట్లుగా బ‌బుల్ గ‌మ్ హీరోయిన్ మాన‌స చౌద‌రి పంచ్‌లు వేయ‌డం న‌వ్వుల‌ను పంచుతోంది. మీ ఇంటి పేరు ఏంటండి అని మాన‌స చౌద‌రిని సుధీర్ అడిగాడు. చెరుకూరి అని ఆమె అన‌గానే అందుకేనా అంత స్వీట్‌గా ఉన్నారు అని సుధీర్ ట‌క్కున అన్నాడు. మీ ఇంటి పేరు ఏంటి అని సుధీర్‌ను మాన‌స అడిగింది. అత‌డు బ‌యానా అని అన‌గానే అందుకేనా అంత భ‌య‌ప‌డుతున్నార‌ని పంచ్ వేసింది.

బ‌బుల్ గ‌మ్ హీరోయిన్‌...

ఈ షోలో భాగంగా ఓ బీర్ బాటిల్‌లో ఎంత బీర్ ఉంటుంద‌ని సుధీర్ ప్ర‌శ్న అడిగాడు. ఆ ప్ర‌శ్న‌కు ఫుల్లా, హాఫా అంటూ మాన‌స చౌద‌రి అడ‌గ‌టం న‌వ్వుల‌ను పూయించింది. ఈ ప్రోమోలో మాన‌స చౌద‌రి హైలైట్ అయ్యింది. సుధీర్‌ను చాలా సార్లు డామినేట్ చేసింది. ఈ న‌లుగురు ముద్దుగుమ్మ‌ల‌తో స‌ర‌దాగా ఫ‌న్ గేమ్స్ ఆడించాడు సుధీర్‌.

మే 3న రాత్రి ఎనిమిది గంట‌ల‌కు ఆహా ఓటీటీలో స‌ర్కార్ సీజ‌న్ 4 ఎపిసోడ్ త్రీ రిలీజ్ కానుంది. స‌ర్కార్ గ‌త సీజ‌న్స్‌కు ప్ర‌దీప్ మాచిరాజు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించాడు. అత‌డి స్థానంలో సీజ‌న్ 4కు సుధీర్ హోస్ట్‌గా వ‌చ్చాడు.

IPL_Entry_Point

టాపిక్