Kalki Release: యూట్యూబ్‌లో రిలీజైన సూపర్ యాక్షన్ మూవీ కల్కి - రికార్డ్ వ్యూస్‌తో అదరగొడుతోన్న తెలుగు సినిమా
Kalki Release: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన తెలుగు మూవీ కల్కి యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ యాక్షన్ మూవీలో రాజశేఖర్ హీరోగా నటించాడు.
Kalki Release: తెలుగు మూవీ కల్కి థియేటర్లలో రిలీజైన ఐదేళ్ల తర్వాత యూట్యూబ్‌లో రిలీజైంది. కల్కి సినిమాలో రాజశేఖర్ హీరోగా నటించాడు. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ కల్కి మూవీకి దర్శకత్వం వహించాడు. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న ఈ మూవీ తాజాగా యూట్యూబ్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.

యూట్యూబ్ స్ట్రీమింగ్ హక్కులు...
కల్కి యూట్యూబ్ స్ట్రీమింగ్ హక్కులను భవానీ మీడియా సంస్థ దక్కించుకున్నది. ఇటీవల ఈ మూవీని అఫీషియల్‌గా భవానీ మీడియా యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. హనుమాన్‌తో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియన్ లెవెల్‌లో క్రేజ్ ఏర్పడటం కల్కి మూవీకి కలిసివచ్చింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో కల్కి స్థానం దక్కించుకున్నది. రీసెంట్‌గా రిలీజైన రాజశేఖర్ సినిమాల్లో యూట్యూబ్‌లో హయ్యెస్ట్ వ్యూస్‌ను దక్కించుకున్న మూవీగా కల్కి నిలిచింది.
సిద్దు జొన్నలగడ్డ విలన్...
కల్కి మూవీలో రాజశేఖర్ హీరోగా నటించగా...అదాశర్మ, నందితా శ్వేత, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా కనిపించారు. ఇందులో డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ విలన్‌గా కనిపించడం గమనార్హం. రాహుల్ రామకృష్ణ కీలక పాత్ర పోషించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో గరుడ వేగ సక్సెస్ తర్వాత రాజశేఖర్ నటించిన కల్కి మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
టీజర్స్, ట్రైలర్స్‌తో ఈ మూవీ ఆకట్టుకున్నది. అయితే రాజశేఖర్ కంటే రాహుల్ రామకృష్ణ పాత్రకు ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉండటం ఆడియెన్స్ డిసపాయింట్ అయ్యారు. ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు ప్రశాంత్ వర్మ టేకింగ్, స్క్రీన్‌ప్లేకు మాత్రం ప్రశంసలు దక్కాయి.
కల్కి మూవీలో స్కార్లెట్ విల్సన్ ఐటెంసాంగ్‌లో కనిపించి గ్లామర్‌తో అలరించింది. అ! తర్వాత ప్రశాంత్ వర్మ దర్వకత్వం వహించిన సెకండ్ మూవీ ఇది. కల్కి మూవీ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
శర్వానంద్ మూవీలో...
ప్రస్తుతం హీరోగా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్స్‌పై ఫోకస్ పెడుతోన్నాడు రాజశేఖర్. ఇటీవల నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ సంస్థ తెరకెక్కిస్కోన్న సినిమాలో రాజశేఖర్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్నాడు.
కథ నచ్చితే విలన్ పాత్రల్లో నటించడానికి తాను సిద్ధమని రాజశేఖర్ ప్రకటించాడు. గత కొన్నేళ్లుగా సరైన హిట్టు లేకపోవడం, వివాదాల కారణంగా కొన్ని సినిమాలు సరైన రీతిలో ఆడకపోవడంతో రాజశేఖర్ సినిమాల వేగాన్ని తగ్గించారు. హీరోగా 2022లో వచ్చిన శేఖర్ తర్వాత మళ్లీ సినిమా చేయలేదు రాజశేఖర్.
హనుమాన్‌తో పాన్ ఇండియన్ డైరెక్టర్...
హనుమాన్‌తో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా మారిపోయాడు. తేజా సజ్జా హీరోగా నలభై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సూపర్ హీరో మూవీ 350 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. హనుమాన్ బ్లాక్‌బస్టర్‌తో ప్రశాంత్ వర్మతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలు రెడీ అయ్యారు. హనుమాన్‌కు జై హనుమాన్ పేరుతో ఓ సీక్వెల్ తెరకెక్కించబోతున్నాడు ప్రశాంత్ వర్మ. అలాగే బాలీవుడ్ అగ్ర హీరో రణ్‌వీర్ సింగ్‌తో ప్రశాంత్ వర్మ సినిమా చేయబోతున్నాడు.