Star Maa Serial: బుల్లితెర మెగాస్టార్ ఈజ్ బ్యాక్ - కొత్త సీరియ‌ల్‌ను అనౌన్స్ చేసిన స్టార్ మా - టైటిల్ ఇదే!-star maa announces new serial illu illalu pillalu bullithera megastar prabhakar reentry in to small screen ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Star Maa Serial: బుల్లితెర మెగాస్టార్ ఈజ్ బ్యాక్ - కొత్త సీరియ‌ల్‌ను అనౌన్స్ చేసిన స్టార్ మా - టైటిల్ ఇదే!

Star Maa Serial: బుల్లితెర మెగాస్టార్ ఈజ్ బ్యాక్ - కొత్త సీరియ‌ల్‌ను అనౌన్స్ చేసిన స్టార్ మా - టైటిల్ ఇదే!

Nelki Naresh Kumar HT Telugu
Aug 26, 2024 06:19 AM IST

Star Maa Serial: కొంత గ్యాప్ త‌ర్వాత బుల్లితెర మెగాస్టార్ ప్ర‌భాక‌ర్ కొత్త సీరియ‌ల్‌తో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇల్లా ఇల్లాలు పిల్ల‌లు అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సీరియ‌ల్ స్టార్ మాలో త్వ‌ర‌లో ప్రారంభం కాబోతుంది. ఈ సీరియ‌ల్‌లో ఆమ‌ని కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

స్టార్ మా సీరియల్
స్టార్ మా సీరియల్

Star Maa Serial: బుల్లితెర మెగాస్టార్ ప్ర‌భాక‌ర్ కొంత గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ కొత్త సీరియ‌ల్‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. అప్ప‌ట్లో తెలుగులో ఏ సీరియ‌ల్‌లో చూసిన ప్ర‌భాక‌ర్ క‌నిపించేవాడు. ఈటీవీతో కెరీర్‌ను ప్రారంభించిన ప్ర‌భాక‌ర్ జెమిని, స్టార్‌మా, జీ తెలుగు ప‌లు సీరియ‌ల్స్ చేశాడు.

వ‌దిన‌మ్మ‌, దీపారాధ‌న‌, అన్నాచెల్లెళ్లు, రుతురాగాలు, మ‌ట్టిగాజులు, జాబిల‌మ్మ, అంత‌రంగాలు ఇలా దాదాపు వంద‌కుపైగా సీరియ‌ల్స్‌లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేసి బుల్లితెర మెగాస్టార్‌గా పేరుతెచ్చుకున్నాడు ప్ర‌భాక‌ర్‌. కొన్ని సీరియ‌ల్స్‌కు ప్రొడ్యూస‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రించాడు.

ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు..

కొంత‌కాలం సీరియ‌ల్స్‌కు గ్యాప్ ఇచ్చిన ప్ర‌భాక‌ర్ మ‌ళ్లీ ఓ కొత్త సీరియ‌ల్‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇల్లా ఇల్లాలు పిల్ల‌లు అనే సీరియ‌ల్‌లో లీడ్ రోల్‌లో క‌నిపిస్తున్నాడు. ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ సీరియ‌ల్‌లో ప్ర‌భాక‌ర్‌కు జోడీగా ఆమ‌ని న‌టిస్తోంది. ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్‌ ప్రోమో వీడియోతో స్టార్ మా అనౌన్స్ చేసింది.

కామెడీ విత్ ఫ్యామిలీ డ్రామా...

కామెడీ, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ ప్రోమో వీడియో సాగింది. ఇందులో రామ‌రాజు అనే పాత్ర‌లో ముగ్గురు కొడుకుల‌కు తండ్రిగా ప్ర‌భాక‌ర్ క‌నిపించాడు. త‌న కొడుకులు ఆణిముత్యాల‌ని, తండ్రి మాట జ‌వ‌దాట‌ర‌ని ప్ర‌భాక‌ర్ గొప్ప‌లు చెబుతూ ఈ వీడియోలో క‌నిపించాడు.

అమ్మాయిల‌కు త‌న కొడుకులు ఆమ‌డ దూరం ఉంటార‌ని ప్ర‌భాక‌ర్ అంటాడు. కానీ కొడుకులు మాత్రం తండ్రి ముందు సిన్సియ‌ర్‌గా న‌టిస్తూ అమ్మాయిల‌తో రొమాన్స్, ల‌వ్ ఎఫైర్స్ పెట్టుకుంటారు. తండ్రికి ప్రేమ‌పెళ్లిళ్లు ఇష్టం లేక‌పోవ‌డంతో...త‌మ ల‌వ్‌స్టోరీస్‌ను అరెంజ్‌డ్ మ్యారేజీలుగా మార్చేసేందుకు కొడుకులు ప్లాన్స్ వేస్తున్న‌ట్లుగా ఈ వీడియో ప్రోమోలో క‌నిపిస్తోంది.

రామ‌రాజు గొడ‌వ‌లు...

మేన‌కోడ‌లిని మీ కొడుకుల్లో ఒక‌రికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంద‌ని పంతులు అన‌గానే కోపంతో రామ‌రాజుతో పాటు అత‌డి కొడుకులు పంతులును చిత‌క‌బాదిన‌ట్లుగా ప్రోమోలో క‌నిపిస్తుంది. అత్తింటితో రామ‌రాజుకు గొడ‌వ‌లు ఉన్న‌ట్లుగా...ఆ గొడ‌వ‌ల కార‌ణంగా పుట్టింటితో వేద‌వ‌తి(ఆమ‌ని)కి సంబంధాలు తెగిపోయిన‌ట్లుగా చూపించి ప్రోమోను ఎండ్ చేశారు. అతి త్వ‌ర‌లోనే ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ టెలికాస్ట్ కానుంద‌ని స్టార్ మా వెల్ల‌డించింది. సీరియ‌ల్ ప్రారంభం డేట్‌ను ఈ వీక్‌లోనే వెల్ల‌డించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

వ‌దిన‌మ్మ 2 రీమేక్‌...

ఈ ప్రోమో వీడియో చూసిన కొంద‌రు ఇది వ‌దిన‌మ్మ 2 సీరియ‌ల్ అని చెబుతోన్నారు.త‌మిళంలో వ‌చ్చిన పాండియ‌న్ స్టోర్స్ ఆధారంగా వ‌దిన‌మ్మ సీరియ‌ల్‌ను రూపొందించారు. పాండియ‌న్ స్టోర్ పెద్ద స‌క్సెస్ కావ‌డంతో ఈ సీరియ‌ల్‌కు పాండియ‌న్ స్టోర్ 2 పేరుతో సీక్వెల్‌ను తెర‌కెక్కించారు.

ప్ర‌స్తుతం త‌మిళంలో టాప్ టీఆర్‌పీ రేటింగ్‌ను ద‌క్కించుకుంటున్న సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా పాండియ‌న్ స్టోర్ 2 కొన‌సాగుతోంది. పాండియ‌న్ స్టోర్ 2కు రీమేక్‌గా ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు రూపొందుతోన్న‌ట్లు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

క్యారెక్ట‌ర్స్‌, స్టోరీలైన్ పాండియ‌న్ స్టోర్స్ 2ను పోలి ఉన్నాయ‌ని అంటున్నారు. ఈ సీరియ‌ల్‌కు వ‌దిన‌మ్మ 2 అని టైటిల్ పెడితే బాగుండేద‌ని అంటున్నారు. ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్‌లో నితిన్‌, ప్ర‌శాంత్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.