Sreemukhi: చాలా సార్లు ల‌వ్‌లో ఫెయిల‌య్యా - బ్రేక‌ప్ స్టోరీని బ‌య‌ట‌పెట్టిన శ్రీముఖి-sreemukhi reveals about her love breakup secrets ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sreemukhi: చాలా సార్లు ల‌వ్‌లో ఫెయిల‌య్యా - బ్రేక‌ప్ స్టోరీని బ‌య‌ట‌పెట్టిన శ్రీముఖి

Sreemukhi: చాలా సార్లు ల‌వ్‌లో ఫెయిల‌య్యా - బ్రేక‌ప్ స్టోరీని బ‌య‌ట‌పెట్టిన శ్రీముఖి

HT Telugu Desk HT Telugu
Nov 29, 2023 10:05 AM IST

Sreemukhi: త‌న ల‌వ్ బ్రేక‌ప్ స్టోరీల‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది శ్రీముఖి. ల‌వ్‌లో చాలా సార్లు ఫెయిల‌య్యాన‌ని తెలిపింది. మంగ‌ళ‌వార ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ ద్వారా అభిమానుల‌తో ముచ్చ‌టించిన శ్రీముఖి ప్రేమ‌, పెళ్లి గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది.

శ్రీముఖి
శ్రీముఖి

Sreemukhi: ప్ర‌స్తుతం టాలీవుడ్ స్మాల్‌స్క్రీన్‌పై టాప్ యాంక‌ర్స్‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది శ్రీముఖి. టీవీ, ఓటీటీ షోల‌తో ఫుల్ బిజీగా ఉంది. సినిమాల్లో అనుకున్నంత‌గా స‌క్సెస్ కాలేక‌పోయినా బుల్లితెర‌పై మాత్రం తిరుగులేని స్టార్‌గా కొన‌సాగుతోంది. ఈ బిజీ షెడ్యూల్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ ఛాన‌ల్ ద్వారా మంగ‌ళ‌వారం అభిమానుల‌తో స‌ర‌దాగా ముచ్చ‌టించింది శ్రీముఖి. త‌న ల‌వ్ స్టోరీతో పాటు పెళ్లి గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టింది.

ల‌వ్‌లో ఎప్పుడైనా ఫెయిల్ అయ్యావా అని ఓ అభిమాని... శ్రీముఖిని అడిగాడు. అత‌డి ప్ర‌శ్న‌కు త‌న‌దైన శైలిలో బొచ్చెడు సార్లు ట‌క్కున స‌మాధానం ఇచ్చింది శ్రీముఖి. పెళ్లి అయితే యాంక‌రింగ్ మానేస్తారా అని ఫ్యాన్ అడ‌గ్గా పెళ్లి అయినా యాంక‌రింగ్ మానేసేది లేద‌ని శ్రీముఖి క్లారిటీ ఇచ్చింది. త‌ప్ప‌కుండా పెళ్లి చేసుకుంటాన‌ని స‌మాధానం చెప్పింది. కానీ ఎవ‌రిని, ఎప్పుడ‌న్న‌ది మాత్రం క్లారిటీ ఇవ్వ‌కుండా స‌స్పెన్స్‌లో పెట్టింది.

ఎంతో కొంత నా గురించి చెప్పుకొని మీకు ద‌గ్గ‌ర కావాల‌నే బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో పెట్టాన‌ని ఓ ఫ్యాన్ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పింది శ్రీముఖి. ఒక‌వేళ ఎవ‌రైనా బాధ‌లో ఉన్నా కాసేపు వాళ్ల‌ను డైవ‌ర్ట్ చేసి నేను డైవ‌ర్ట్ అవుదామ‌న్న‌దే బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ పెట్ట‌డానికి కార‌ణ‌మ‌ని తెలిపింది.

ప్ర‌స్తుతం ఆదివారం విత్ స్టార్ మా ప‌రివారం, డ్యాన్స్ ఐకాన్‌, సారంగ‌ద‌రియాతో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోన్న కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ సీజ‌న్ 2కు శ్రీముఖి యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.