Monkey Man OTT: ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చిన శోభిత ధూళిపాళ్ల యాక్షన్ మూవీ - కానీ ఓ ట్విస్ట్ ఏంటంటే?
Monkey Man OTT: శోభిత దూళిపాళ్ల తొలి హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. అయితే ఓవర్‌సీస్ ఆడియెన్స్‌కు మాత్రమే ఓటీటీలో వీక్షించవచ్చు. ఇండియాలో మాత్రం రిలీజ్ కాలేదు.

Monkey Man OTT: మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ దేవ్ పటేల్ హీరోగా నటిస్తూ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ హాలీవుడ్ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. అయితే ఇండియన్ ఆడియెన్స్ మాత్రం మంకీ మ్యాన్‌ను ఓటీటీలో చూసేందుకు అవకాశం లేదు. కేవలం అమెరికా, కెనడాతో పాటు మరికొన్ని దేశాల్లో మాత్రమే ఈ మూవీ ఓటీటీలో రిలీజైంది.
ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి...
ఏప్రిల్ 5న అమెరికాలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఇరవై రోజుల్లోనే ఓటీటీలో రిలీజైంది. ఇండియాలో ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ సెన్సార్‌తో పాటు ఇతర సమస్యల కారణంగా రిలీజ్ వాయిదాపడింది.
అమెరికాలో మంకీమ్యాన్ మూవీ ఓటీటీలో రిలీజైన నేపథ్యంలో ఇండియాలో థియేటర్ రిలీజ్‌కు దాదాపు దారులు మూసుకుపోయినట్లే తెలుస్తోంది. ఇండియాలో డైరెక్ట్‌గా ఓటీటీలోనే ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మంకీమ్యాన్ ఇండియా స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. మే ఫస్ట్ వీక్ లో ఇండియాలో మంకీ మ్యాన్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం.
పురాణాల స్ఫూర్తితో...
భారతీయ పురాణాల నుంచి స్ఫూర్తి పొందుతూ దేవ్ పటేల్ మంకీ మ్యాన్ మూవీని తెరకెక్కించాడు. ఇందులో చాలా మంది భారతీయ నటీనటులకే కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలో హీరో లక్ష్యానికి అండగా నిలించే పాత్రలో శోభిత ధూళిపాళ్ల కనిపించింది. వేశ్యగా బోల్డ్ రోల్ చేసింది. సినిమాలో చిన్న రోల్ అయినా తన గ్లామర్‌తో హాలీవుడ్ ఆడియెన్స్‌ను శోభిత ఇంప్రెస్ చేసింది.
మంకీ మ్యాన్ క థ ఇదే...
ముంబైలోని మురికివాడల్లో నివసించే ఓ యువకుడు తన తల్లి మరణానికి కారణమైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? ఈ పోరాటంలో అతడికి హనుమంతుడు ఎలా స్ఫూర్తినిచ్చాడు అనే అంశాలతో దేవ్ పటేల్ మంకీ మ్యాన్ మూవీని తెరకెక్కించాడు.
దేవ్ పటేల్ యాక్టింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయనే పేరొచ్చిన కమర్షియల్‌గా ఈ మూవీ ఆశించిన విజయం దక్కించుకోలేకపోయింది. ఈ సినిమాతోనే దేవ్ పటేల్ దర్శకుడిగా మారాడు. అంతే కాకుండా మంకీ మ్యాన్ సినిమాకు ఓ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించాడు.
తెలుగులో రెండు సినిమాలు...
శోభిత దూళిపాళ్ల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అడివిశేష్‌తో గూఢచారి, మేజర్ సినిమాలు చేసింది. స్వతహాగా తెలుగు అమ్మాయి అయిన శోభిత నట ప్రయాణం బాలీవుడ్‌లో మొదలైంది. రమణ్ రాఘవ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె బాలీవుడ్‌తో పాటు మలయాళం, తమిళంలో సినిమాలు చేసింది. మంకీ మ్యాన్‌తో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
నాగచైతన్యతో డేటింగ్...
నాగచైతన్యతో శోభిత డేటింగ్ చేస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తండేల్ మూవీ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన నాగచైతన్య టూర్ వెళ్లాడు. ఈ టూర్ ఫొటోలను నాగచైతన్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. శోభిత కూడా టూర్‌లో ఉంది. నాగచైతన్యతో పాటు శోభిత జంగిల్ సఫారీ టూర్ ఫొటోలను షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరి ఫొటోల్లో ఒకే లోకేషన్, బ్యాక్‌డ్రాప్ కనిపిస్తోంది. దాంతో నాగచైతన్, శోభిత ఇద్దరు కలిసే టూర్‌కు వెళ్లినట్లు టాలీవుడ్‌లో వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.