amazon prime: ఇంటర్నెట్ లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో వీడియోలు చూడొచ్చు ఎలా అంటే!-amazon prime now lets you download tv shows for offline ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Amazon Prime: ఇంటర్నెట్ లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో వీడియోలు చూడొచ్చు ఎలా అంటే!

amazon prime: ఇంటర్నెట్ లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో వీడియోలు చూడొచ్చు ఎలా అంటే!

HT Telugu Desk HT Telugu
Apr 08, 2022 08:40 PM IST

ఓవర్-ది-టాప్ (ఓటీటీ) సర్వీసుల వినియోగం రోజురోజుకూ పెరుగతూనే ఉంది. సులభతమైన ఇంటర్నెట్ సౌఖర్యం, తక్కువ డేటా ఖర్చులు, ఒరిజినల్ కంటెంట్‌‌‌కు స్కోప్ ఉండడంతో ఓటీటీ ఆదరణ పెరుగుతుంది. మ

Amazon
Amazon (AP)

ఓవర్-ది-టాప్ (ఓటీటీ) సర్వీసుల వినియోగం రోజురోజుకూ పెరుగతూనే ఉంది. సులభతమైన ఇంటర్నెట్ సౌఖర్యం, తక్కువ డేటా ఖర్చులు, ఒరిజినల్ కంటెంట్‌‌‌కు స్కోప్ ఉండడంతో ఓటీటీ ఆదరణ పెరుగుతుంది. మరీ ముఖ్యంగా డిజిటలైజేషన్ కారణంగా ఓటీటీ ఫుల్ స్వింగ్‌లోకి వచ్చింది. ప్రాంతీయ భాషల కంటెంట్‌ను అందిస్తుండడంతో సబ్‌స్కైబర్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. గ్లోబల్ బ్రాండ్స్ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లు కూడా ప్రాంతీయ భాషలకు చెందిన సినిమా కంటెంట్‌ను ప్రమోట్ చెస్తుండడంతో వీటిని వినియోగిస్తు్న్న వారి సంఖ్య వీపరితంగా పెరిగింది.

అయితే OTTలో ఏదైనా కంటెంట్‌ను వీక్షించాలంటే తప్పనిసరిగా ఇంటర్నెట్ ఉండాలి. అది లేకుండా చూడడం సాధ్యం కాదు. అయితే ఇప్పుడు మీకు ఆశ్చర్యాన్ని కలిగించే న్యూస్ తెలియజేస్తున్నాం. అమెజాన్ ప్రైమ్‌లో ఇంటర్నెట్ ఉపయోగించకుండానే వీడియోలను చూడవచ్చు. చాలా ఈజీగా మీరు ఇంటర్నెట్ లేకుండా ఇష్టమైన కంటెంట్‌ను ఇక్కడ ఆస్వాదించవచ్చు. అయితే ఈ సాంకేతికతను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ వీడియోను మొబైల్ యాప్‌గా మీ ఫోన్‌కి డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత మీకు ఇష్టమైన సినిమాను, షో లేదా ఎపిసోడ్‌లను డౌన్‌లోడ్ చేయడం ద్వారా ఇంటర్నెట్ లేకుండా యాప్‌లోని కంటెంట్‌ను ఆస్వాదించగలుగుతారు. దీంతో మీకు నచ్చిన సినిమాని కావలసినప్పుడు చూడవచ్చు. కానీ చాలా సార్లు మీరు సిగ్నల్ సరిగ్గా లేని ప్రాంతాలలో ఉన్నప్పుడు.. నెట్‌వర్క్ కనెక్షన్ సమస్య ఉండవచ్చు. అలాంటి సందర్భాలలో ఇలా డౌన్‌లోడ్ చేయడం ద్వారా కంటెంట్‌ను ఆస్వాదించగలుగుతారు.

'ఎక్స్-రే' ఫీచర్

అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యేకమైన 'ఎక్స్-రే' ఫీచర్ ఉంది, ఇది మీరు చూస్తున్న ఈవెంట్ లేదా సినిమా సంబంధించిన సమాచారాన్ని అందిస్తోంది. అలాగే ఫీచర్ ద్వారా మీరు చూస్తున్న వీడియోను పాజ్ చేసినప్పుడు, మీరు దాని తారాగణం, పాత్రలు, ఇతర కంటెంట్, సంగీతం బోనస్ కంటెంట్ సంబంధించిన వివరాలను తెలుసకోవచ్చు.

వాచ్‌లిస్ట్‌

మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో వీక్షణ అనుభవాన్ని మెరుగుపరచడానికి వాచ్‌లిస్ట్‌ను రూపొందించుకునే అవకాశాన్ని అమెజాన్ ప్రైమ్ కల్పిస్తోంది. మీరు ఆ వాచ్‌లిస్ట్‌కి ఎంచుకున్న షోలు, సినిమాలను జోడించ వచ్చు. మీరు వీడియో చూస్తున్నప్పుడు వాటిని ప్రత్యేకంగా శోధించాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన కంటెంట్‌ని ఒకే చోట పొందుతారు.

ఆడియో

Amazon Prime వీడియోలో, మీకు ఇంగ్లీష్ , హిందీతో పాటు అనేక ఇతర భాషలలో కంటెంట్ అందుబాటులో ఉంది. అలాగే సబ్‌టైటిల్స్, ఆడియో సహాయంతో మీకు తెలియని భాషల కంటెంట్‌ను కూడా సులభంగా చూడవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్ మీకు నచ్చిన భాషలో కంటెంట్‌ను వీక్షించడానికి వినడానికి మీకు ఆప్షన్ అందిస్తుంది. అలాగే, మీరు సబ్‌టైటిల్స్ ఫాంట్, రంగు, నేపథ్యాన్ని మార్చుకుని ఆప్షన్ కూడా ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్