Rakul Preet Singh Re Entry: నాలుగేళ్ల త‌ర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోన్న‌ ర‌కుల్ - అయ‌లాన్ రిలీజ్ డేట్ ఫిక్స్‌-siva karthikeyan ayalaan release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rakul Preet Singh Re Entry: నాలుగేళ్ల త‌ర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోన్న‌ ర‌కుల్ - అయ‌లాన్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Rakul Preet Singh Re Entry: నాలుగేళ్ల త‌ర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోన్న‌ ర‌కుల్ - అయ‌లాన్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 24, 2023 11:58 AM IST

Rakul Preet Singh Re Entry: శివ‌కార్తికేయ‌న్ హీరోగా న‌టిస్తోన్న అయ‌లాన్ రిలీజ్ డేట్‌ను సోమ‌వారం అనౌన్స్ చేశారు. ఈ సినిమాతో నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత ర‌కుల్ ప్రీత్ సింగ్ కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది.

శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్
శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్

Rakul Preet Singh Re Entry: నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది ర‌కుల్ ప్రీత్‌సింగ్‌. కోలీవుడ్ స్టార్ హీరో శివ‌కార్తికేయ‌న్‌ కు ర‌కుల్ జోడీగా న‌టిస్తోన్న అయాల‌న్ రిలీజ్ డేట్‌ను సోమ‌వారం అనౌన్స్‌చేశారు. ఏలియ‌న్స్ బ్యాక్‌డ్రాప్‌లో సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ మూవీని దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్‌లో ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలోనూ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఏలియ‌న్స్ బ్యాక్‌డ్రాప్‌లో ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో తెర‌కెక్కుతోన్న తొలి సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ సినిమాకు ఆర్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. వీఎఫ్ఎక్స్‌కు ప్రాధాన్య‌మున్న సినిమా ఇద‌ని, ఈ సినిమాలో 4500ల‌కుపైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటాయ‌ని నిర్మాత‌లు చెబుతోన్నారు. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే హ‌య్యెస్ట్ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్న ఫుల్ లెంగ్త్ లైవ్ యాక్ష‌న్ సినిమా ఇదేన‌ని అంటోన్నారు. ప్ర‌ముఖ హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ కంపెనీ ఫాంట‌మ్ స్టూడియెస్ ఈ సినిమాకు గ్రాఫిక్స్ అందిస్తోన్న‌ట్లు పేర్కొన్నారు.

ఈ సినిమాలో ఇషాకొప్పిక‌ర్‌, శ‌ర‌ద్ ఖేల్క‌ర్‌, భానుప్రియ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు. అయ‌లాన్ సినిమాకు ఏఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. కాగా ఈ సినిమాతో నాలుగేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత కోలీవుడ్‌లోకి ర‌కుల్ ప్రీత్‌సింగ్ రీఎంట్రీ ఇస్తోంది.

చివ‌ర‌గా 2019లో సూర్య ఏన్‌జీకే సినిమాలో న‌టించింది ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ఏన్‌జీకే త‌ర్వాత సౌత్ కు దూర‌మైన ర‌కుల్ బాలీవుడ్ సినిమాల్లోనే ఎక్కువ‌గా న‌టించింది. అయాల‌న్‌తో తిరిగి త‌మిళంతో పాటు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ఈ సినిమాతో సౌత్‌లో మళ్లీ పాగా వేయాల‌నే ఆలోచ‌న‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఉన్న‌ట్లుగా చెబుతోన్నారు.