Divine Message Short Film: భగవద్గీత గొప్పత‌నంతో టాలీవుడ్ డైరెక్ట‌ర్ షార్ట్ ఫిల్మ్ - డైరెక్ట్‌లో ఓటీటీలో రిలీజ్‌-santhosh jagarlapudi divine message short film directly streaming on ott amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Divine Message Short Film: భగవద్గీత గొప్పత‌నంతో టాలీవుడ్ డైరెక్ట‌ర్ షార్ట్ ఫిల్మ్ - డైరెక్ట్‌లో ఓటీటీలో రిలీజ్‌

Divine Message Short Film: భగవద్గీత గొప్పత‌నంతో టాలీవుడ్ డైరెక్ట‌ర్ షార్ట్ ఫిల్మ్ - డైరెక్ట్‌లో ఓటీటీలో రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 02, 2024 02:05 PM IST

Divine Message Short Film: భగవద్గీత గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేసేలా డివైన్ మెసేజ్ వన్ పేరుతో టాలీవుడ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి ఓ షార్ట్ ఫిల్మ్ చేయ‌బోతున్నాడు. త్వ‌ర‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మ‌రికొన్ని ఓటీటీల‌లో ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ కానుంది.

డివైన్ మెసేజ్ వన్ షార్ట్ ఫిల్మ్
డివైన్ మెసేజ్ వన్ షార్ట్ ఫిల్మ్

Divine Message Short Film: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో డివోష‌న‌ల్ సినిమాల ట్రెండ్ న‌డుస్తోంది. భ‌క్తి కి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను జోడించి తెర‌కెక్కిన కార్తికేయ 2, హ‌నుమాన్ సినిమాలు ఇండ‌స్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. ఈ విజ‌యాల‌తో డివోష‌న‌ల్ సినిమాల‌పై ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్లో ఆస‌క్తి పెరిగింది. స్టార్ హీరోలు సైతం ఈ భ‌క్తి క‌థ‌ల్లో న‌టించ‌డానికి సిద్ధ‌ప‌డుతోన్నారు. తాజాగా టాలీవుడ్ సంతోష్ జాగ‌ర్ల‌పూడి డివోష‌న‌ల్ జాన‌ర్‌లోకి అడుగుపెట్టాడు. అయితే సినిమా కాకుండా ఓ షార్ట్ ఫిల్మ్ చేయ‌బోతున్నాడు.

భగవద్గీత గొప్పత‌నంతో...

భగవద్గీత గొప్పతనాన్ని నేటి జనరేషన్ కు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో డివైన్ మెసేజ్ వ‌న్ పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఈ షార్ట్ ఫిల్మ్‌కు సచినందన్ హరిదాస్ క‌థ‌ధ‌ను అందించారు. హైదరాబాద్ అ త్తాపూర్లోని ఇస్కాన్ ఆలయంలో డివైన్ మెసేజ్ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ పూర్తిచేశారు. భగ‌వ‌ద్గీత సారాన్ని, యువ‌త‌కు అందించే స్ఫూర్తిని ఈ షార్ట్ ఫిల్మ్‌లో చూపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. నేటి త‌రానికి కూడా గీత ఎలా మార్గ‌ద‌ర్శ‌నంగా నిలుస్తుందో ఈ షార్ట్ ఫిల్మ్‌లో చెప్ప‌బోతున్న‌ట్లు తెలిసింది. డివైన్ మెసేజ్ వ‌న్ షార్ట్ ఫిల్మ్ ద్వారా యూత్‌కు మంచి మెసేజ్ ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్‌...

ఈ షార్ట్ ఫిల్మ్‌క‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుగుతోన్నాయి. త్వ‌ర‌లో అమెజాన్ పైమ్ వీడియోతో పాటు మిగిలిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ డివైన్ మెసేజ్ వ‌న్ షార్ట్ ఫిల్మ్‌ను రిలీజ్ చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేయ‌బోతున్నారు. ఈ షార్మ్ ఫిల్మ్‌లోని న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఎవ‌ర‌న్న‌ది కూడా అప్పుడే రివీల్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

నాగ‌శౌర్య‌తో ల‌క్ష్య‌....

సుమంత్ హీరోగా న‌టించిన సుబ్ర‌హ్మ‌ణ్య పురం మూవీతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సంతోష్ జాగ‌ర్ల‌పూడి. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీలో ఈషారెబ్బా హీరోయిన్‌గా న‌టించింది. ఆ త‌ర్వాత మూడేళ్లు మెగాఫోన్‌కు మూడేళ్లు గ్యాప్ తీసుకున్న సంతోష్ జాగ‌ర్ల‌పూడి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నాగ‌శౌర్య‌తో ల‌క్ష్య సినిమా చేశాడు. కేతికా శర్మ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర పోషించాడు. సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం, ల‌క్ష్మ సినిమాలు ద‌ర్శకుడిగా సంతోష్ జాగ‌ర్ల‌పూడికి ఆశించిన స్థాయిలో విజ‌యాల్ని తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి.

మ‌హేంద్ర‌గిరి వారాహి...

సుమంత్ హీరోగా మహేంద్ర గిరి వారాహి అనే సినిమా చేస్తోన్నాడు సంతోష్ జాగ‌ర్త‌పూడి. మ‌హేంద్ర‌గిరిలో ఉన్న వారాహి అనే అమ్మ‌వారి గుడి బ్యాక్‌డ్రాప్‌లో డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. గ‌త ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

టాపిక్