(1 / 6)
మూడు నెలల్లోనే నా సామిరంగ సినిమా షూటింగ్ మొత్తం పూర్తిచేశామని ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున చెప్పాడు. ఈ సంక్రాంతికి పండుగకు నా సామిరంగతో పాటు రిలీజ్ అవుతోన్న అన్ని సినిమాలు ఆడాలని నాగార్జున ఆకాంక్షించారు
(2 / 6)
నా సామిరంగ ఆడితే నా లాంటి కొత్త దర్శకులకు నాగార్జున మరిన్ని అవకాశాలు ఇస్తారని విజయ్ బిన్నీ తెలిపాడు.
(3 / 6)
నాగార్జున ఇప్పటివరకు ఇండస్ట్రీకి 24 మంది కొత్త దర్శకులను పరిచయం చేశాడు. విజయ్ బిన్నీ ఇరవై ఐదో దర్శకుడు కావడం గమనార్హం.
(4 / 6)
నా సామిరంగ సినిమాలో అషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్లు ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేశారు.
(5 / 6)
నా సామిరంగ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన పురింజు మరియం జోస్ ఆధారంగా నా సామిరంగ మూవీ తెరకెక్కుతోంది.
(6 / 6)
నా సామిరంగ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తోండగా...చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూర్చారు.
ఇతర గ్యాలరీలు